4, ఏప్రిల్ 2025, శుక్రవారం

15 నెలలుగా జీతాలులేని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది

చిత్తూరు జిల్లాలో 25 మంది రాజీనామా 

నెల్లూరులో ఒకరు ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో ప్రమాదంలో ఒకరి మృతి 

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న సిబ్బంది శ్రమ దోపిడీకి, వెట్టి చాకిరికి అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్నారు. గత 15 నెలలుగా జీతాలు అందక కుటుంబాలను పోషించుకోలేక పస్తులతో మలమలమాడుతున్నారు. ఈ వ్యసాయ బడ్జట్ లో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి 61 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, ప్రకృతి వ్యవసాన్ని ప్రోత్సాహిస్తున్న సిబ్బంది జీతాల కోసం  వ్యవసాయ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తులు చేసినా ఫలితం కనిపించడం లేదు. 5, 8, 10 వేలకుపని చేస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి నెలలు తరబడి జీతాలు ఇవ్వకపోవడం శోచనీయం. 


జీతాలు ఇవ్వకపోవడంతో జిల్లాలో 25 మంది సిబ్బంది రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లాలో ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. గంగాధర నెల్లూరు మండలానికి చెందినా ఒక ఉద్యోగి ప్రకాశం జిల్లాలో అధికారిక సమావేశానికి హాజరవుతూ, ప్రమాదవశాత్తున మృతి చెందారు. ఆ కుటుంబానికి ఇంతవరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. జీతాలు ఇవ్వకపోగా 2025 ఖరీఫ్ వార్షిక ప్రణాళిక సొంత నిధులతో చేయాలని, ప్రతి క్లస్టర్లో 50 నుండి 100 మంది రైతులకు విత్తన కిట్లు తయారుచేసి ఇవ్వాలని అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. జిల్లాలో సుమారు 350 మంది వివిధ కేటగిరీలలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎంటీలు ఇన్చార్జిలు, ఎల్.1లు,ఎల్ 2లు, ఎల్ 3 లు, మోడల్ మేకర్లు ఉన్నారు. ఇందులో ఎంటీలు 15 మంది, ఇన్చార్జులు 25 మంది, ఐ సి ఆర్ పి లు 250 మంది మిగిలిన వారు ఇతర కేటగిరీలలో పనిచేస్తున్నారు. వీరికి గత 15 నెలలుగా జీతాలు రాలేదు. జీతాలు వెంటనే చెల్లిస్తేనే విధులకు హాజరవుతామని, ఖరీఫ్ వార్షిక ప్రణాళిక పనులు చేస్తామని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెగేసి చెబుతున్నారు. జీతాలు రాక నిధులు లేక నకనకలాడుతున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అధికారుల ఆగ్రహానికి గురవుతూ విలవిలలాడుతున్నారు .దీనికి తోడు రికార్డులు రాయడం, రైతుల వివరాలను  యాప్ లలో అప్లోడ్ చేయడం, సభలు సమావేశాలు ,శిక్షణా తరగతులు ప్రభుత్వ కార్యక్రమాలకు నిరంతరం ప్రయాణం చేయడానికి, హాజరుకావడానికి  కనీసం చార్జీలు కూడా లేక నఇబ్బందిపడుతున్నారు. గోరుచుట్టు మీద రోకటి పోటు అన్నట్లు ఇటీవల రైతు బజారుల్లో, వారపు సంతల్లో, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో, ఎంపీడీవో, ఎంఆర్ఓ, వెలుగు ఆర్ఎస్కే ల వద్ద కూరగాయల మార్కెట్ పెట్టాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీనితో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తీవ్ర మనోవేదనకు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రోజుకు రెండుసార్లు లైవ్ ఫోటోలు పెట్టమని సొంత ఖర్చులతో పోస్టర్లు, బ్యానర్లు, జిరాక్సులు, గోడల మీద రాతలు, బ్లాక్ బోర్డు పనులు  చేయాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వీటికి తోడు 2025 ఖరీఫ్ వార్షిక ప్రణాళిక నెలాఖరుపు లోపల పూర్తి చేయాలని, జీతాలు వచ్చిన రాకపోయినా పనులు చేయాలని ఇష్టం లేని వాళ్ళు నిలిచిపోవచ్చని, జీతాల గురించి తమను అడగవద్దని అధికారులు తప్పించుకుంటున్నారు. తమ గోడు, తమ దుస్థితి, తమ నిస్సహాయత తమ సమస్య ఎవరికి చెప్పాలో అర్థంకాక చాలామంది సిబ్బంది రాజీనామాలు కూడా చేశారు. కొందరు ఆత్మహత్యాయత్నాలకు ప్రయత్నించారు. అయినా అధికారులలో, ప్రభుత్వ ఆధినేతలలో చలనం లేదు.  ప్రభుత్వం, అధికారులు స్పందించి ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి వెంటనే  జీతాలు, బకాయిలు చెల్లించి వారికి న్యాయం చేయాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 


పో రై గంగ 1 ప్రకృతి వ్యసాయ సిబ్బంది 




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *