15, ఏప్రిల్ 2025, మంగళవారం

జిల్లాలో పెరిగిన ఇంటర్ ఉత్తీర్ణతా శాతం

మొదటి సంవత్సరంలో 16 శాతం పెరుగుదల 

రెండవ సంవత్సరం 22 శాతం పెరుగుదల 

సత్ఫలితాలు ఇచ్చిన లోకేష్ సంస్కరణలు 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ప్రైవేటు కాలేజీలకు ధీటుగా తీర్చిదిద్దుతామనే విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంకల్పం కార్యరూపం దాలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనితీరులో గణనీయమైన మార్పు వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. చిత్తూరు జిల్లాలో  గత సంవత్సరంతో పోల్చుకుంటే  ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రమాణాల పెంపునకు మంత్రి నారా లోకేష్ తీసుకున్న చర్యలే ఇందుకు కారణం.

జిల్లాలో 31 ప్రభుత్వ  జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఈ సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇంటర్మీడియట్ రెండో ఏడాదిలో 48.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది అత్యధికంగా 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రెండవ సంవత్సరంలో చవటగుంట జూనియర్ కళాశాల 98శాతం,  బొమ్మసముద్రం 96 శాతం,  పూతలపట్టు 94 శాతం, ఐరాల, చౌడేపల్లి జూనియర్ కళాశాలలు 90 శాతం ఫలితాలను సాధించాయి. ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షల్లో గత పదేళ్లతో పోలిస్తే రెండో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. గత ఏడాది 31.2 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా,  ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల్లో  47 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనితీరులో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫలితంగా రికార్డు స్థాయిలో ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగింది. వైసీపీ హయాంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ రద్దు చేసింది. నారా లోకేష్  బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయడం జరిగింది. ఐదేళ్ల తర్వాత 2024 ఏడాదిలో 217 మంది ప్రిన్సిపల్స్ కు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. జిల్లాలో 28 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రిన్సిపల్స్ ను నియమించారు. 2024 ఏడాది అక్టోబర్ నుంచి సెంట్రలైజ్డ్ అసెస్ మెంట్ చేయడం జరిగింది. అంతర్గత పరీక్షల్లో విద్యార్థుల ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించడంతో పాటు విశ్లేషించడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనివేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచడం జరిగింది. వంద రోజుల కార్యక్రమాన్ని రూపొందించి వెనుకబడిన విద్యార్థులను కేటగిరీలుగా విభజించడంతో పాటు స్టడీ మెటీరియల్ అందించి వారికి వెన్నుదన్నుగా నిలవడం జరిగింది. పేరెంట్ టీచర్ మీటింగులను ఏర్పాటుచేసి విద్యార్థులందరికీ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరిగింది. జరుగుతున్న సిలబస్ పై వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందచేశారు.  టేక్ కేర్ వ్యవస్థను ఏర్పాటుచేసి విద్యార్థుల అభ్యసన ఫలితాలు, అటెండెన్స్ బాధ్యతలను అప్పగించారు.   విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ఆధారంగా ఏ,బీ,సీ కేటగిరీలుగా వర్గీకరించి వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ చర్యలతో ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఇంటర్‌ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా లోకేశ్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే జూనియర్‌ కాలేజీలపై సమీక్షించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు బ్యాగులు, నోట్‌బుక్స్‌ కూడా ఇచ్చారు. దీంతో అడ్మిషన్లు కూడా పెరిగాయి. రాష్ట్రంలో 15వేల మంది అదనంగా ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కూడా చర్యలు చేపట్టింది.  జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సిలబస్‌ పూర్తిచేసి, రివిజన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.  ఎప్పటికప్పుడు స్లిప్‌ టెస్టులు నిర్వహిస్తూ విద్యార్థులు ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా సన్నద్ధం చేశారు.  ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా గత ఐదేండ్లుగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించారు. కాలేజీలు ప్రారంభమయ్యే ఆగస్టు నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉదయం గంట, సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులను నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులను నిర్వహించారు. మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులతోపాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను లెక్చరర్లు దత్తత తీసుకొని మరీ మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేశారు. అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఏ సబ్జెక్టులో అయితే ఉత్తీర్ణత శాతం తక్కువ వస్తుందో సంబంధిత లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామని కూడా సంబంధిత ఉన్నతాధికారులు హెచ్చరిస్తుండడంతో ప్రతి కాలేజీలో ఉత్తీర్ణత శాతం పెరిగేలా చర్యలు చేపడుతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉండడంతో పలు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం ప్రైవేట్‌ కాలేజీల కంటే అదనంగా సర్కార్‌ జూనియర్‌ కాలేజీల విద్యార్థులు సాధిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కాలేజీల్లో చేర్చుకోవడం, ఉచితంగా అన్ని కోర్సులకు సంబంధించిన పుస్తకాలను అందజేయడం, ప్రాక్టికల్స్‌కు సంబంధించి ల్యాబ్‌ మెటీరియల్‌ అందజేయడం, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానంతో రోజురోజుకూ విద్యార్థుల శాతం పెరిగింది. సీసీ కెమెరాలు, అధ్యాపకులకు ఫేషియల్ హాజరు విధానాన్ని అమలుచేస్తుండడంతో అధ్యాపకులు, విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో ఇంటర్ కాలేజీల్లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా విద్యార్థుల ఉత్తీర్ణణ శాతం గణనీయంగా పెరిగింది. 

పో రై గంగ 1  బొమ్మసముద్రం జూనియర్ కళాశాల 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *