13, ఏప్రిల్ 2025, ఆదివారం

స్థానిక సమరానికి సిద్ధమవుతున్న వైసిపి

పిఎసి సభ్యులుగా ఆర్కే రోజా, నారాయణస్వామి 

పార్టీ పునర్ వైభవానికి వైసిపి కసరత్తు 

అందుకు దీటుగా వ్యూహరచనలో తెలుగుదేశం 

సమర్థ నాయకులకు పార్టీ పగ్గాలు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

స్థానిక సంస్థల సమరానికి ఇప్పటి నుచే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా శనివారం ప్రకటించిన ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలోచిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరికి స్థానం దక్కింది. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా నియమితులైన ఆర్కే రోజా, నారాయణస్వామిలకు జిల్లా మీద మంచి పట్టు ఉంది. వీరికి తోడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, రాయలసీమ జోనల్ ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వైసిపి పార్టీకి తిరిగి పునర్ వైభవం తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. వీరికి తోడు ఆర్కే రోజా, నారాయణ స్వాములను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యులుగా తీసుకోవడంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరినట్లు అయింది. రాజకీయంగా ఉద్దండలైన నలుగురు నాయకులకు జిల్లాల్లో పార్టీని పటిష్టం చేసే పనిని మాజీ ముఖ్యమంత్రి జగన్ అప్పగించారు. గత ఎన్నికలలో  జిల్లాలో ఘోర పరాభవాన్ని చవిచూసిన వైసిపి పార్టీకి ప్రారంభ స్థానిక సంస్థల ఎన్నికలలో తిరిగి తమ సత్తాను చాటడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆచితూచి అడుగులు వేస్తుందని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. నామినేటెడ్ పదవులలో జిల్లాకు చెందిన సమర్థవంతమైన నేతలకు స్థానం కల్పించి వారి ద్వారా పార్టీని పటిష్టం చేస్తారని, అలాగే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా కూడా సమర్థవంతమైన నేతలను నియమిస్తారని అంచనా వేస్తున్నారు.


ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాపై మాజీ ముఖ్య మంత్రి, వైసిపి అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాకు చెందిన చెందిన ఉద్దండ నేతలకు కీలక పదవులు అప్పగించారు. శనివారం ఏర్పాటు చేసిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో మాజీ ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి, మాజీ మంత్రి ఆర్ కె రోజాకు చోటు కల్పించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి కన్వీనర్ గా 33 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ కమిటీ వేశారు. ఇందులో చిత్తూరు జిల్లా నేతలు ఇద్దరికి స్థానం కల్పించడం వెనుక వ్యూహం దాగి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఏడు నియోజక వర్గాలలో ఆరు చోట్ల టిడిపి అభ్యర్థులు గెలిచారు. పుంగనూరు నియోజక వర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఆయన తమ్ముడు ద్వారకానాద్ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా, కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి రాజయసీమ పార్టీ బాధ్యత అప్పగించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతితో పాటు చిత్తూరు జిల్లా అధ్యక్షునిగా ఇయమించారు. వీరు ఇద్దరు అడుగడుగునా టిడిపి పార్టీపై పోరాటం చేస్తున్నారు. పెద్దిరెడ్డి చాప కింద నీరులా పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వం, టిటిడి వైఫల్యాలపై ప్రచార యుద్ధం చేస్తున్నారు. వీరికి తోడుగా జిల్లాకు చెందిన ఇద్దరికి కీలక పదవులు అప్పగించడంతో మరింత గట్టిగా రాజకీయ పోరాటం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే రోజా అధికార ప్రతినిధిగా కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నారాయణ స్వామికి జిల్లాలో మంచి పట్టు ఉంది. అందరూ కలసి జిల్లాలో అడుగడుగునా చంద్రబాబుకు ఇబ్బందులు కలిగించాలని జగన్ ఆదేశించినట్టు తెలుస్తున్నది. జిల్లా పరిషత్ చైర్మన్ గా వైసీపీకి చెందిన గోవిందప్ప శ్రీనివాస్ ఉన్నారు. మెజారిటీ స్థానిక సంస్థలు వైసిపి చేతిలో ఉన్నాయి. అలాగే జిల్లాకు చెందిన భరత్, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఏడాదిలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం సాధించేందుకు వైసిపి నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వ్యూహం ఏమిటన్నది బయటికి పొక్కడం లేదు.అయితే వైసిపి నేతలను సమర్థవంతంగా ఎదుర్కునే నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మే 15 లోపు బూత్ స్థాయి నుంచి పార్ల మెంటు స్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేయడానికి షెడ్యూల్ విడుదల చేసారు. ఈ సారి చాలా గట్టి వ్యక్తిని పార్లమెంటు అధ్యక్షునిగా నియమిస్తారని అంటున్నారు. మే 27, 28, 29 తేదీలలో జగన్ స్వంత జిల్లా అయిన కడప కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాటు చేస్తున్నారు. మహానాడు ముగిసిన వారంలో జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలు వేస్తారు. ఇందులో జిల్లాకు ప్రాధాన్యత ఉంటుందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ సారి జిల్లా నుంచి ఒకరికి టిడిపి పొలిట్ బ్యూరోలో చోటు కల్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే అంత లోపుగా ఇద్దరు ముగ్గురు సమర్ధ నాయకులకు జిల్లా నేతలకు రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టి, వైసిపి నాయకులను కట్టడిచేసే వ్యూహరచన చేస్తున్నారని టిడిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

పో రై గంగ 1  రోజా 

గంగ 2 నారాయణస్వామి

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *