12, ఏప్రిల్ 2025, శనివారం

రెండవ సంవత్సరం కూడా చిట్టచివరి స్థానంలో చిత్తూరు

గత సంవత్సరం కూడా చిట్టచివరి స్థానమే 

జిల్లాలో మెరుగుపడని ఇంటర్ విద్య 

ఇంటర్ మొదటి సంవత్సరం అట్టర్ ప్లాప్

రెండవ సంవత్సరం ఫలితాలు కొంత ఉరట

ప్రభ న్యూస్ బ్యూరో , చిత్తూరు. 


ఇంటర్ విద్యా ఫలితాలలో రెండవ సంవత్సరం కూడా చిత్తూరు జిల్లా ఘోరంగా విఫలం అయ్యింది. గత సంవత్సరం వచ్చిన చిట్టచివరి స్థానాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించి రికార్డు సృష్టించింది. శనివారం విడుదలచేసిన ఇంటర్ ఫలితాలలో  రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూరు జిల్లా అట్టడుగునా నిలిచింది. గతంలో చిత్తూరు జిల్లాలో  పది, ఇంటర్ పరీక్షలలో గణనీయమైన ఫలితాలు సాధిస్తుండగా రెండు సంవత్సరాలుగా ఇంటర్ ఫలితాలలో చిత్తూరు జిల్లా బోర్ల పడింది. చివరి స్థానంలో నిలువడంతో జిల్లా పరువు గంగలో కలిసినట్లయ్యింది. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు అగ్రస్థానం దక్కింది. సెకండియర్‌ ఫలితాల్లో 93 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. ఫస్టియర్‌ ఫలితాల్లో 54 శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లాకు చివరి స్థానం దక్కింది. సెకండియర్‌ ఫలితాల్లో 73 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి జిల్లాకు ఆఖరి స్థానం దక్కింది.


చిత్తూరు జిల్లాలో 31 ప్ర్తభుత్వ జూనియర్ కళాశాలలు, 125 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి.  ఇంటర్ పరిక్షలకు మొత్తం 30,652 మంది విద్యార్థులు పరీక్షకు హాల్ టిక్కెట్లు తీసుకున్నారు. ఇందులో మొదటి సంవత్సరానికి సంబందించి 15,482 మంది (జనరల్ 13574, ఒకేషనల్ 01908),  ద్వితీయ సంవత్సరానికి సంబందించి 15,170 మంది (జనరల్13136, ఒకేషనల్ 02034) విద్యార్థులు ఉన్నారు.  జిల్లాలో నుండి ఇంటర్ మొదటి సంవత్సరం 13183 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా 7168 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 54 శాతం ఉత్తీర్ణత. ఇంటర్ రెండవ సంవత్సరం 11450 మంది పరీక్షల రాయిగా 8440 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 74 శాతం ఉత్తీర్ణత. ఇంటర్ మొదటి సంవత్సరం కంటే రెండవ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరిగింది. చిత్తూరులోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం 67 శాతం మంది విద్యార్థులు విద్యార్థులు సాధించగా, రెండవ సంవత్సరం 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం 2481 మంది పరీక్ష రాయగా, 1172 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత  47 శాతం. రెండవ సంవత్సరం 2160 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 1514  ఉత్తీర్ణత సాధించారు. వీరు 70 శాతం ఉత్తీర్ణత సాధించారు.  ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం 8321 మంది విద్యార్థులు పరీక్షకు  హాజరుగాక, 6175 మంది పాసయ్యారు. 74 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉన్నత పాఠశాలల నుంచి 288 మంది పరీక్షకు హాజరు కాగా 155 మంది ఉత్తీర్ణత సాధించి,  65 శాతం నమోదు చేశారు. ఏపీ మోడల్ స్కూల్ నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం 441 మంది విద్యార్థులు హాజరుకాగా, 349 మంది ఉత్తీర్ణత సాధించారు. 79 తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం 325 మంది పరీక్షకు  హాజరుకాగా 271 మంది పాసయ్యారు. వీరి ఉత్తీర్ణత  శాతం 83.  కేజీబీవీ పాఠశాల నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం 257 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా, 150 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత శాతం 79.  ప్రైవేటు పాఠశాల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం 9362 మంది విద్యార్థులు హాజరుకాగా, 5189 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణత శాతం 55. ప్రైవేట్ గా 979 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాగా, 667 మంది పాసయ్యారు. వీరి ఉత్తీర్ణత శాతం 68. 

గత సంవత్సరం జిల్లాలో  ఇంటర్ మొదటి సంవత్సరం 13,224 మంది విద్యార్థులు పరిక్షలు రాయగా, ఇందులో 6566 మంది మాత్రం పాసయ్యారు.ఇంటర్ రెండవ సంవత్సరం  10,882 మంది విద్యార్థులు హాజరు కాగా 6,817 మంది పాసయ్యారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సులలో 1839 మంది హాజరు కాగా 941 మంది పాసయ్యారు. అలాగే ఒకేషనల్ రెండవ సంవత్సరం ఫలితాలలో 1610 మంది విద్యార్థులు హాజరు కాగా, 1008 మంది పాసయ్యారు. ఇంటర్  మొదటి సంవత్సరంలో 50 శాతం, రెండవ సంవత్సరంలో 63 శాతం  పాసయ్యారు.  ఒకేషనల్ కోర్సులలో ఇంటర్ మొదటి సంవత్సరం 51 శాతం, రెండవ సంవత్సరం 63 శాతం ఫలితాలను చిత్తూరు జిల్లా సాధించింది. ఇంటర్ ఫలితాలలో ఒక రకంగా బాలికలు ఎక్కువ శాతం మంది పాసయ్యారు.  గత సంవత్సరం ఇంటర్ పరీక్షా ఫలితాల్లో చిట్టచివరి స్థానం పొందడంతో ఈ సంవత్సరం అయినా, ఇంటర్ ఫలితాలు మెరుగు పాడుతాయని భావించారు. అయితే, ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఫలితాలే పునరావృతం కావడం బాధాకరం. గతంలో తిరుపతి, చిత్తూరు కలిసి ఉండేది. తిరుపతిలో ప్రైవేటు కళాశాలలు ఉండటంతో జిల్లా ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉండేది. ఈ సారి తిరుపతి విడిపోవడంతో చిత్తూరు జిల్లా ఫలితాలు పడిపోయింది. పరీక్షల నిర్వహణలో చూపిన శ్రద్ద సమీక్షలలో చూపలేదని విమర్శలు ఉన్నాయి. అర్థ సంవత్సర పరీక్షలు, ప్రీ ఫైనల్, యూనిట్ టెస్టులు సక్రమంగా జరగలేదని తెలుస్తుంది. వాటి మీద సమీక్షలు చేసి, జిల్లా అధికారులు సరిగ్గా సూచనలు ఇచ్చి ఉంటే, ఫలితాలు మెరుగయ్యే అవకాశం ఉండేది. ఈ సంవత్సరం పలువురికి ప్రిన్సిపాల్స్ గా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. ఇందులో సినియారిటిని పతిమ్చాలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కొందరు ఆందోళన బట పట్టారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అధ్యాపకులు లేకపోవడం కూడా ఒక లోపంగా చెప్పవచ్చు. మొత్తం మీద పర్యవేక్షణ లోపం కారణంగా ఫలితాలు తగ్గినట్లు తెలుస్తుంది. 




 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *