రైతులకు 50 శాతం రాయితితో వ్యవసాయ పనిముట్లు
జిల్లాకు రూ. 85 కోట్లతో, 1,635 యూనిట్లు మంజూరు
రైతులు ఈ నెలఖారులోపు దరఖాస్తు చేసుకోవాలి
సన్న, చిన్న కారు రైతులు మాత్రమే అర్హులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లను అందజేయడానికి వ్యవసాయ శాఖ ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లాకు 1,635 యూనిట్లను 2.85 కోట్ల రూపాయలతో అందజేయనున్నారు. బ్యాటరీ, ఫుట్, మాన్యువల్‌గా పనిచేసే నాప్‌సాక్ స్ప్రేయర్లు 250, పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు 575, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్ 7, ట్రాక్టర్ డ్రా ఇంప్లిమెంట్స్ 740 రోటోవేటర్ 28, వర్ వీడర్స్ 17, బ్రష్ కట్టర్లు 13 పవర్ టిల్లర్లు 5 చిత్తూరు జిల్లాకు మంజూరయ్యాయి. రైతులు ఈ నెలాఖరు లోపు రైతు సేవా కేంద్రాల ద్వార దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట ఈ గడువును మర్చి 31 వరకు నిర్దేశించారు. తగునాన్ని దరఖాస్తులు రాకపోవడంతో దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించారు.
వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని సాధి౦చడానికి వీలుగా రాష్ట్రంలో వ్యవసాయి యా౦త్రీకరణను చేపట్టి, జిల్లాలో సాగుచేసే పంటల ఆధరంగా సబ్సిడీపై సరిపడే వ్యవసాయయంత్రాలను సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది. వ్యవసాయ యా౦త్రీకరణ పధకాన్ని వ్యవసాయశాఖ అమలు చేస్తుంది. వ్యవసాయ యా౦త్రీకరణ ద్వారా రైతులకు శ్రమ తగ్గి౦చి, సకాలంలో తక్కువ శ్రమతో వ్యవసాయ పనులను చెపట్టి ఉత్పత్తి సాధకముల వినియోగాన్ని పెంచి, అధిక దిగుబడిని సాధి౦చడానికి ఈ పధకాన్ని ప్రవేశపెట్టింది. చిన్న, సన్నకారు రైతులకు సహా అ౦దరు వ్య క్తిగత రైతులు , రైతుక్లబ్బులు,సి.ఎం.ఇ.వై. లబ్దిదారులు, నీటి వినియోగదారుల సంఘలు,సంస్థలకు చె౦దిన రైతులు సబ్సిడికి అర్హులు. క్రమ బద్ధమైన వ్యవసాయ యా౦త్రీకరణ పధకం క్రి౦ద పవార్ టిల్లర్, ట్రాక్లర్లకు ఖరీదులో 50శాత౦ రాయితీ లేదా 45 వేల రూపాయల వరకుసబ్సిడీ ఉంటుంది. మిగతా అన్ని వ్యవసాయ పరికరాలు, యంత్రాలపై 50 శాతం సబ్సిడికి లేదా 30 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు. ఎ.పి.అగ్రో పరిశ్రమల అభివృద్ధి కార్పోరేషన్ లిమిటేడ్ పేరిట సబ్బిడి పోను మిగిలిన మొత్తాన్ని డి.డి .రూప౦లో తీసుకొనిపూర్తిచేసిన దరఖాస్తుతో పాటు హైదరాబాదులోని ఎ.పి.అగ్రోస్ కు ప౦పాలి. రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ సబ్ మిషన్ కింద 50 శాతం రాయితీతో వ్యవసాయ పనిముట్లను అందజేస్తోంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రతీ జిల్లాకు రూ.2.80 కోట్లను మంజూరు చేసింది. బ్రష్‌కట్టర్లు, పవర్ టెల్లర్లు, సస్యరక్షణ, చేతి, పవర్ స్ప్రేయర్లు, ట్రాక్టరుతో నడిచే బూమ్ వంటి పరికరాలను 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇవ్వనున్నారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి రైతులకు 5 ఎకరాలలోపు పొలం ఉండాలి. అంటే సన్న, చిన్న కారు రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చును. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులు అర్హులు. పట్టాదారు పాస్ పుస్తకంలో తమ పేరు ఉండాలని, అలాంటి వారే అర్హులుగా ఉంటారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆర్వోఎఫ్‌ఆర్ పొలాలు సాగు చేసే రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కుటుంబంలో ఎంత మంది రైతులు ఉన్నా ఒకరికి మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉంటుందన్నారు. అగ్రోస్ ద్వారా రైతులకు పరికరాలను అందజేస్తుండగా ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారులు కోరారు. ఇతర వివరాలకు అన్నదాతలు రైతు సేవా కేంద్రాలలో సంప్రందించాలని సూచించారు.

