20, ఏప్రిల్ 2025, ఆదివారం

చిత్తూరు జిల్లాలో తీవ్రమైన తాగునీటి సమస్య

 గత సంవత్సరం వర్షాలు పడకపోవడమే కారణం

980 గ్రామాలలో తాగునీటి సమస్య 

మునిసిపాలిటీల్లో రెండు రోజులకు ఒకసారి తాగునీరు 

టాంకర్ లతో తాగునీటిని సరఫరా చేస్తున్న అధికారులు 

కృష్ణా జలాల మళ్లింపుతో తగునితికి శాశ్వత పరిష్కారం 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

చిత్తూరు జిల్లాలో గత సంవత్సరంలో వరుణుడు ముఖం చాటేశారు. పడాల్సిన విధంగా జిల్లాలో వర్షాలు పడలేదు. జూలై, సెప్టెంబర్, నవంబర్ నెలలో తక్కువ వర్షపాతం నమోదయ్యింది. రుతుపవనాలు కాలంలో అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడగా, చిత్తూరు జిల్లాలో మాత్రం వర్షాలు పడలేదు. భూగర్భ జలాలు అడుగంటాయి. జిల్లాలోని 700 చెరువులకు చుక్కనీరు కూడా రాలేదు. మరో మూడు వేల చెరువులకు 25 శాతం నీళ్లు మాత్రమే వచ్చాయి. ఫలితంగా చిత్తూరు జిల్లాలోని 16 మండలాలను కరవు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది వర్షాలు తక్కువ పడటంతో ఈ ఏడాది ప్రారంభం నుండి తాగునీటి సమస్య ప్రారంభం అయ్యింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం ఎస్సీ కాలనీలో మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. తాగునీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గుడిపల్లి ప్రజలు కూడా ఖాలీ బిందెలతో నిరసన తెలిపారు. జిల్లాలోని  980 గ్రామాలలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే గుడిపల్లి, వి.కోట, పలమనేరు, గుడిపాల, విజయపురం, నిండ్ర మండలాలకు టాంకర్ల ద్వార నీటిని సరఫరా చేస్తున్నారు. 

*రూ. 13.57తో ప్రత్యామ్నాయ ప్రణాళిక*

వేసవిలో చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను నివారించడానికి జిల్లా అధికారులు 13.57 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించారు.  ఏప్రిల్ నెలలో 801 గ్రామాల్లో, మే నెలలో 857 గ్రామాలలో, జూన్ నెలలో 980 గ్రామాలలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని ప్రత్యామ్నాయ ప్రణాళికలో పొందుపరిచారు. జిల్లాలో తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి 845 గ్రామాలకు రోజుకు 6,280 ట్రిప్పుల వంతున  ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రతిపాదించారు. జిల్లాలో 102 గ్రామాలకు సంబంధించి 500 బోర్లను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుందని, ఎందుకు 53 లక్షల రూపాయలు అవసరమని పేర్కొన్నారు అలాగే జిల్లాలోని 46 బోర్లను ఫ్లషింగ్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు 25 లక్షల రూపాయలు అవసరమవుతాయన్నారు. జిల్లాలోని 82 బోర్లను లోతు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 107 లక్షల రూపాయలు అవసరమవుతాయని తమ నివేదికలో పొందుపరిచారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేయడానికి ఒక ట్రిప్పుకు 570 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నివేదికలో తెలిపారు. తాగునీటి నిమిత్తం బోర్లను స్వాధీనం చేసుకొనే ఒక్కొక్క బోరుకు రోజుకు 350 రూపాయలు చెల్లించాలని ప్రతిపాదించారు. జిల్లాలో 102 గ్రామాలకు సంబంధించి 500 బోర్లను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుందని, ఎందుకు 53 లక్షల రూపాయలు అవసరమని పేర్కొన్నారు అలాగే జిల్లాలోని 46 బోర్లను ఫ్లషింగ్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు 25 లక్షల రూపాయలు అవసరమవుతాయన్నారు. జిల్లాలోని 82 బోర్లను లోతు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 107 లక్షల రూపాయలు అవసరమవుతాయని తమ నివేదికలో పొందుపరిచారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేయడానికి ఒక ట్రిప్పుకు 570 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నివేదికలో తెలిపారు. తాగునీటి నిమిత్తం బోర్లను స్వాధీనం చేసుకొనే ఒక్కొక్క బోరుకు రోజుకు 350 రూపాయలు చెల్లించాలని ప్రతిపాదించారు. 

*మునిసిపాలిటీల్లో  రెండు రోజులకు ఒక సారి తాగునీరు*

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో వేసవిలో తాగు నీటి సమస్యను తీర్చడానికి 9.13 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించారు. వేసవిని తట్టుకోవడానికి ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవాలని, కొత్త బోర్లను తవ్వాలని, ప్రస్తుతం ఉన్న బోర్లు కొన్నింటిని లోతు చేయాలని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి, బోర్లను రిపేర్లు చేయడానికి నిధులు అవసరమని జిల్లా అధికారులు ప్రతిపాదించారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు, కుప్పం, నగరి, పలమనేరు, పుంగనూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో నగరి మున్సిపాలిటీలో మాత్రమే ప్రజలకు  ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. చిత్తూరు, కుప్పం, పుంగనూరు మున్సిపాలిటీలో రెండు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పలమనేరులో అయితే, మూడు రోజులకు ఒకసారి తాగునీటిని తరపున చేసే పరిస్థితి ఉంది. చిత్తూరు తాగునీటి అవసరాల కోసం ఎన్టీఆర్ జలాశయంను నిర్మించారు. నగిరికి ఎస్ఎస్ ట్యాంకు నుంచి నీటి సరఫరా అవుతుంది. కాల్వపల్లిలో నిర్మించిన వైయస్సార్ రిజర్వాయర్ నుంచి పలమనేరు మున్సిపాలిటీకి నీటి సరఫరా జరుగుతుంది. పలమనేరుకు నీటిని సరఫరా చేయు వైఎస్సార్ రిజర్వాయర్ లో మాత్రం పది రోజులకు మించి తాగునీరు లభించే పరిస్థితి లేదు. ఈ మూడు మున్సిపాలిటీలకు రిజర్వాయర్ల ద్వారా ప్రజలకు తాగునీటి సరఫరా అవుతుండగా, కుప్పం, పుంగనూరు మున్సిపాలిటీలో బోర్ల మీదనే ఆధారపడ్డారు. చిత్తూరు మున్సిపాలిటీలో ఒక మనిషికి రోజుకు 108 లీటర్ల నీటిని, నగిరిలో 107 లీటర్ల నీటిని సరఫరా చేస్తుండగా, కుప్పంలో 55 లీటర్లను, పలమనేరులో 75 లీటర్లను, పుంగనూరులో 70 లీటర్ల మాత్రమే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత అంచనాల మేరకు చిత్తూరు మున్సిపాలిటీలో జనాభా 2.5 లక్షలు, కుప్పంలో 54,000, నగరిలో 74,000, పలమనేరులో 58,000, పుంగనూరులో 64,000 ఉంటుందని అంచనా వేశారు. మొత్తం మీద ఐదు మున్సిపాలిటీలలో కలిపి 4.55 లక్షల మంది జనాభా ఉన్నారు. నాలుగు మున్సిపాలిటీలో ప్రస్తుతం కూడా తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. చిత్తూరు మున్సిపాలిటీలో 13 ట్యాంకర్లు, కుప్పంలో ఒకటి, నగరిలో రెండు, పలమనేరులో రెండు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అవుతుంది. రోజుకు అన్ని మునిసిపాలిటీలో కలిపి 143 ట్రిప్పులు నీటిని సరఫరా చేస్తున్నారు. రానున్న వేసవిలో తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి పలమనేరు మున్సిపాలిటీలో ఐదు ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవడానికి జిల్లా అధికారులు ప్రతిపాదించారు. చిత్తూరు మునిసిపాలిటీలో 100 బోర్లను, కుప్పంలో 18 బోర్లను, నగరిలో ఐదు బోర్లను, పలమనేరులో 40 బోర్లను, పుంగనూరులో 32 బోర్లను కొత్తగా తవ్వి, మోటార్లు బిగించి, నీటి సరఫరా చేయాలని ప్రతిపాదించారు. మరికొన్ని బోరుబావులను లోతు చేయాలని నిర్ణయించారు. 

*కృష్ణా జలాలతోనే శాశ్వత పరిష్కారం* 

కృష్ణా జలాలను గండికోట మీదుగా చిత్తూరు జిల్లాకు తాగునీటి పధకాల ద్వారా సరఫరా చేయడానికి  ఒక  బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది. 4000 కోట్ల రూపాయలతో జిల్లాలోని ప్రతి గ్రామానికి కృష్ణా జలాలను సరఫరా చేయడానికి ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. ఇక జిల్లా వాసులు తాగునీటికి బోర్లపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. రానున్న 30 సంవత్సరాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి రూపకల్పన జరుగుతోంది. గండికోట నుంచి కృష్ణా జిల్లాలను పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు మళ్లించడానికి  ప్రణాళిక సిద్ధమవుతోంది. అలాగే కండలేరు నుంచి నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాలకు  తాగునీటిని సరఫరా చేయనున్నారు. ఈ మేరకు  కూడా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అడవిపల్లి రిజర్వాయర్  నుంచి రూ. 275 కోట్లతో కృష్ణ జలాలను  చిత్తూరు మున్సిపాలిటీకి  తీసుకురావడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రతిపాదన తయారు చేయాల్సిందిగా తిరుపతి పబ్లిక్ హెల్త్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా మొత్తానికి కృష్ణాజలాలతో దాహార్తిని తీర్చే బృహత్తర పథకం అమలు చేయాలన్న ఉద్దేశంతో జిల్లాలో కొనసాగుతున్న జలజీవన్ మిషన్ పథకాలను ప్రభుత్వం రద్దు చేసింది.

పో రై. గంగ 1 చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *