24, ఏప్రిల్ 2025, గురువారం

మద్యం కుంబకోణంలో చిత్తూరు జడ్పి చైర్మన్ సోదరుడు బాలాజీ

మద్యం ముడుపుల కేసులో ప్రధానపాత్ర  

గోవిందప్ప బాలాజీ భారతి సిమెంట్ లో 15 ఏళ్లుగా  డైరెక్టర్ 

వై ఎస్ భారతికి నమ్మినబంటు

చార్టెడ్ అకౌంటెంట్ గా ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ 

బాలాజీ కారణంగానే శ్రీనివాసులకు దక్కిన చైర్మన్ పీఠం

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

 మద్యం ముడుపుల కేసులో చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు సోదరుడు గోవిందప్ప బాలాజీ కీలకపాత్ర పోషించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడయింది. గోవిందప్ప బాలాజీ చార్టెడ్ అకౌంటెంట్. భారతి సిమెంట్స్ లో ఆయన 2010 ఏప్రిల్ 30 నుంచి పూర్తికాలపు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోలు, ఐటి వ్యవహారాల భాధ్యతలు అన్నీ బాలాజీ  చూస్తున్నారు. ఆయన కారణంగానే వి కోట జడ్పిటిసిగా  విజయం సాధించిన గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు.


 వి.కోట మండలానికి చెందిన గోవిందప్ప బాలాజీ జగన్ సతీమణి భారతికి అత్యంత నమ్మినబట్టు. ఆయన వైయస్ భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు జరుపుతున్నారు. వైయస్సార్ ప్రభుత్వ పాలనలో అత్యధికంగా మద్యం సరఫరా టెండర్లను దక్కించుకున్న కంపెనీలు, డిస్టర్బ్ చేసిన నుంచి ప్రతినెలా వసూలు చేసిన 50-60 కోట్ల ముడుపులను రారాజ్ కేసి రెడ్డి  భారతి సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీకి, జగన్మోహన్ రెడ్డి వద్ద వైఎస్ జగన్ కృష్ణ మోహన్ రెడ్డికి అందజేసే వారిని సిట్ దర్యాప్తులో వెల్లడయింది. మద్యం ముడుపుల ద్వారా వచ్చిన మొత్తాల తరలింపు, మళ్లింపు విషయంలో గోవిందప్ప బాలాజీ కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ సొమ్మును ఏ ఏ రూపంలో ఏ ఏ దేశాలకు తరలించారు? అనేదానిమీద ఇప్పటికే కీలక ఆధారాలను సిట్ సేకరించింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓఎస్డిగా  పని చేసిన కృష్ణమోహన్ రెడ్డికి అందజేసిన ముడుపులు సొమ్ము ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడికి చేరవేశారు? అన్న విషయం మీద కూడా సిట్ దర్యాప్తు జరిపింది. ఈ విషయంలో కూడా ఒక అవగాహనకు వచ్చింది. ఈ మొత్తం కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, హవాలా జరిగినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ మొత్తం వ్యవహారంలో వి కోటకు చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు సోదరుడు గోవిందప్ప బాలాజీ కీలకపాత్ర పోషించినట్లు గుర్తించింది. ఆయన వైయస్ జగన్ కు, అలాగే ఆయన సతీమణి వైయస్ భారతికి నమ్మినబంటు. భారతి సిమెంట్ లో గత 15 సంవత్సరాలుగా డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. మద్యం కుంభకోణం కుట్ర రూపకల్పనలో కూడా గోవిందప్ప బాలాజీ ప్రమేయం ఉన్నట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. అలాగే ముడుపుల వసూలు నెట్ వర్క్ నిర్వహణ, రాజ్ కేసి రెడ్డి, వాసుదేవ రెడ్డి, మిధన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, సీఎం కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్టీగా పనిచేసిన కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి చార్టెడ్ అకౌంటెంట్  అయిన బాలాజీ కుట్రకు వ్యూహారచన చేసినట్లు గుర్తించంది. ఈ విషయాన్ని రాజ్ కేసి రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించింది. పాపులర్ మద్యం బ్రాండ్లను అణగతొక్కడం, ముడుపులు ఇచ్చిన కంపెనీల బ్రాండ్ లను ప్రోత్సహించడం ద్వారా 3,200 కోట్ల మేర ముడుపులు వసూలు చేయడంలో రాజ్ కేసీఆర్ రెడ్డితో పాటు బాలాజీ పాత్ర కూడా ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఈ విషయం చిత్తూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు  సోదరుడు గోవిందప్ప బాలాజీ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పో రై. గంగ 1 గోవిందప్ప బాలాజీ 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *