రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా సి ఆర్ రాజన్
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న డాక్టర్ సి ఆర్ రాజన్ రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం నామినేటెడ్ పోస్టుల జాబితా విడుదల అయింది. సినీ నిర్మాత, వన్నికుల క్షత్రియ సంఘం రాష్ట్ర కోశాధికారి అయిన సిఆర్ రాజన్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న తర్వాత చిత్తూరులోలో భారీ ఎత్తున జిల్లా బీసీ సదస్సు నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుపునకు దోహదపడ్డారు. జిల్లా అధ్యక్షుని హోదాలో పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎన్నికల సమయంలో ఆయన చిత్తూరు అసెంబ్లీ టికెట్టుకోసం ప్రయత్నం చేశారు. అనివార్య కారణాలు వల్ల టికెట్టును ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడుకు కేటాయించారు. దీంతో సి ఆర్ రాజన్ ను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించారు. ఎన్నికల సమయంలో సిఐ ఆర్ రాజన్ క్రియాశీలకంగా వ్యవహరించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్నె కుల క్షత్రియ సామాజిక వర్గం ఒక బలమైన సామాజిక వర్గం. ఈ కులానికి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల పైగా ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఎక్కువగా కుప్పం, శ్రీకాళహస్తి, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు, నగిరి నియోజకవర్గాలలో వీరి ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పం, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ఈ సామాజిక వర్గం నిర్ణయిస్తుందంటే అతిశయోక్తి కాదు. శ్రీకాళహస్తి నియోజకవర్గ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మునిరామయ్య గతంలో పోటీ చేసి గెలుపొందారు. అయిన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్నారు. వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పెద్దపీట వేసింది. కుప్పం నియోజకవర్గానికి చెందిన భరత్ ను, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన సిపాయి సుబ్రహ్మణ్యంలను ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. కుప్పం ఇన్చార్జిగా ఎమ్మెల్సీ భరత్ ను నియమించింది. ఎన్నికల్లో కుప్పం నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భరత్ పోటీ చేశారు. అలాగే ఆయన జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ఉండిన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీలో చేర్చుకొని వెంటనే ఎమ్మెల్సీగా అందలం మెక్కించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి జిల్లాలో పెద్దపీట వేయడంతో తెలుగుదేశం పార్టీ కూడా తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుచానూరుకు చెందిన మాజీ సర్పంచ్ డాక్టర్ సిఆర్ రాజన్ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడును కలిసి తన అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చిత్తూరుకు చెందిన న్యాయవాది త్రిమూర్తి కూడా చేరారు. ఈ సందర్భంగా జిల్లాలో వన్నె కుల క్షత్రియ వర్గానికి ఒక స్థానాన్ని జిల్లాలో కేటాయించాలని ప్రతిపాదన వచ్చింది. అందుకు చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే, కమ్మ సామాజికవర్గానికి చెందిన గురుజాల జగన్మోహన్ కు చిత్తూరు టిక్కెట్టు ఇచ్చారు. దీంతో సి ఆర్ రాజన్ ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఎన్నికల సమయంలో ఆయన పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో కూడా వర్ణికుల క్షత్రియ ఓటర్లు 20 లక్షలు పైగా ఉంటారని అంచనా. వైసిపి పార్టీ వన్నికుల క్షత్రియ వర్గానికి పెద్దపీట వేయడం, అసబ్లీ ఎన్నికలలో చిత్తూరు టికెట్టును సి యర్ రాజన్నకు ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనను వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సి ఆర్ రాజన్ కు వన్నెకులక్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ లభించడం పట్ల ఆ కమ్యూనిటీ కి చెందిన నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
పో రై గంగ 1 సి ఆర్ రాజన్
గంగ 2 సి ఆర్ రాజన్ కు కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానిస్తున్న సిఎం ఫైల్ ఫోటో