27, నవంబర్ 2024, బుధవారం

జిల్లా నుండి రాజ్యసభ రేసులో ఇద్దరు నాయకులు

 బిజెపి కోటాలో మజీ  సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

మళ్ళి రాజకీయంగా క్రియాశీలకం కోసం గల్లా జయదేవ్ 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

రాజ్యసభ ఎన్నికల నగారా మోగడంతో చిత్తూరు జిల్లాలో ఇద్దరు నాయకులు రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కోటర్లు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పెద్దల సభకు పంపాలని ఆ పార్టీ వ్యవహరచన చేస్తుంది. అలాగే గత ఎన్నికల్లో గుంటూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలుపొందిన గల్లా జయదేవ్ కూడా తిరిగి రాజకీయంగా క్రియాశీలకం కావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు నాయకులు ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిచారు. ఈ సందర్భంగా రాజ్యసభ విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బుధవారం చంద్రబాబు ముఖ్యనాయకులతో బిజెపితో కూడా సంప్రతించి, అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. దీంతో బిజెపికి ఒక స్థానం దక్కవచ్చానే ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

 

అధికారం కోల్పోయిన తర్వాత వైసిపికి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య తమ పదవులకు రాజీనామాలు చేశారు. అవి ఖాళీ అయ్యాయి. ఎన్నికల సంఘం ఉపఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 20 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆ సీట్లు ఎవరికి కేటాయిస్తారన్నదానిపై టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒక స్థానం జనసేనకు, మరో స్థానం బిజెపికి  కేటాయిస్తారని చెబుతున్నారు. జనసేన నుంచి నాగబాబుకుస్థానం దగ్గర భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికలలో రాజంపేట నుండి పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి  రాష్ట్ర రాజకీయాలలో అంత క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయిన కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన హోదాకు తగిన విధంగా రాజ్యసభకు పంపాలని బిజెపి అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. రెండు నెలల  కిందట కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిసి పలు విషయాలను చర్చించారు. అందులో ప్రధానంగా రాజ్యసభ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి కేంద్ర అధిష్టానం ఆదేశానుసారం కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. ఇటీవల వైసిపికి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యత్వానికి, ఆ పార్టీకి రాజీనామా చేశారు. అందులో ఒక స్థానం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేటాయిస్తారని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. రాజ్యసభ సభ్యునిగా కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికైన ఆయనకు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని భావిస్తున్నారు. అలాగే రాష్ట్ర బిజెపి బాధ్యతలు కూడా కిరణ్ కుమార్ రెడ్డి అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది.



గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి. తండ్రి పాటూరు రాజగోపాల్ నాయుడు వారసురాలుగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అరగ్రేతం చేసి, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పిసిసి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1989 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1999, 2004, 2009 ఎన్నికలలో చంద్రగిరి నుంచి వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆమె వైద్య విద్య, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు.  రాష్ట్ర విభజన తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు 2014 ఎన్నికలలో చంద్రగిరి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో మనస్థాపం చెందిన ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  గల్లా జయదేవ్ గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. పార్లమెంటులో పదునైన మాటలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టారు. దీంతో వైసిపి గల్లా కుటుంబం మీద కక్ష గట్టింది. వారి ఫ్యాక్టరీకి పర్యావరణ అనుమతులు లేవంటూ కొద్దిరోజులు ఫ్యాక్టరీని మూసివేసింది. చిత్తూరు సమీపంలో ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన స్థలాన్ని తిరిగి ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఫ్యాక్టరీకి విద్యుత్తును కూడా కట్ చేశారు. ఇలా వ్యాపార మనుగడను దెబ్బ కొట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫల ప్రయత్నం చేశారు. కోర్టులు గల్లా కుటుంబానికి అండగా నిలవడంతో, తిరిగి స్థలాన్ని కూడా దక్కించుకున్నారు. ఫ్యాక్టరీ విస్తరణను సొంత రాష్ట్రంలో కాకుండా చెన్నై, తెలంగాణలో చేపట్టారు. తాను రాజకీయ నాయకుడుగా ఉండడం కారణంగానే తమ పరిశ్రమ అమరరాజా అభివృద్ధికి నిరోధకంగా మారుతున్నదని గల్లా కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండాలని  నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై  గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉండడం ద్వారా వివాదాలు వస్తున్నాయనిఅందుకే తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్ లో మౌనంగా ఉండలేక పోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే తన వ్యాపార విధులను కూడా  పూర్తి స్థాయిలో నిర్వహించ లేకపోతున్నానని తెలిపారు. రెండేళ్ల క్రితం వ్యాపారాల నుంచి తన తండ్రి గల్లా రామచంద్ర నాయుడు రిటైర్ అయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజకీయాలువ్యాపారాన్ని సమన్వయం చేయడం కష్టంగా మారిందని వివరించారు. అందుకే రాజకీయాల నుంచి వైతొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు మాజీ  ఎంపీ గల్లా జయదేవ్ వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గల్లా జయదేన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గల్లా జయదేవ్ సేవలను డిల్లీలో ఉపయగించుకోవాలని భావిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మూడు స్థానాలు ఖాళి కావడంతో చంద్రబాబు మీద వత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎవరికీ ప్రాధాన్యత ఇస్తారో వేచి చూడాలి.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *