జీడి నెల్లూరు నియోజకవర్గానికి రాజకీయ ప్రాధాన్యత
ప్రభుత్వ విప్ గా డా. థామస్
టిటిడి చైర్మెన్ గా బి ఆర్ నాయుడు
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్ బి సుధాకర్ రెడ్డి
పార్టు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా చిట్టిబాబు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు నియోజక వర్గానికి రాజాకీయంగా ప్రాధాన్యత పెరిగుతోంది. మంగళవారం ఇక్కడి టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ ను సిఎం చంద్రబాబు అసెంబ్లీ విప్ గా నియమించారు. ఏడాది క్రితం పార్టీ ఇంచార్జి పదవి స్వీకరించిన ఆయన అనూహ్యంగా పార్టీ టిక్కెట్టు వచ్చింది. విజయం సాధించారు. నియోజకర్గం ఏర్పడిన తరువాత టిడిపి అభ్యర్ధిగా గెలిచి ఆ వార్తల్లోకి ఎక్కారు. టిడిపికి ఎదురు లేదని నిరూపించారు. నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా డాక్టర్ థామస్ జరిపిన పోరాటం చంద్రబాబు నాయుడు దృష్టిని ఆకర్షించింది. దీంతో ప్రభుత్వ విప్ పదవి లబించింది.
జీడి నెల్లూరు నియోజకవర్గము టూరిజం కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది. పెనుమూరు దగ్గర శివలింగం ఆకారంలో ఉన్న పులిగుండు పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. నిత్యం పర్యాటకులు పులిగుండు దర్శనానికి వస్తుంటారు. అలాగే చిత్తూరుకు తాగునీటిన సరఫరా చేస్తే ఎన్టీఆర్ ప్రాజెక్టు కూడా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరులో ఉంది. కృష్ణాపురం రిజర్వాయర్ కార్వేటినగరం మండలంలో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కూడా పర్యాటక కేంద్రాలుగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. పర్యాటకాన పర్యాటకంగానే కాకుండా రాజకీయంగా గుండా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా పెనుమూరు మండలం పూనేపల్లికి చెందిన బిఆర్ నాయుడు నియమితులయ్యారు. క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ విప్ పదవి గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ థామస్ ను వరచింది. పెనుమూరుకు చెందిన డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ ఫైర్ బ్రాండగా పేరు తెచ్చుకున్నారు. పాలసముద్రం మండలానికి చెందిన భీమినేని చిట్టిబాబు నాయుడు టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గా ఉన్నారు. పెనుమూరుకు చెందిన అరుణ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. వెదురుకుప్పం మండలానికి చెందిన మునిచంద్రా రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా విధులను నిర్వహిస్తున్నారు. ఇదివరకు స్వర్గీయ పీఎస్ మనోహర్ నాయుడు తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. టిడిపి ఏర్పడిన తరువాత 1984 లో తలారి రుద్రయ్య, 1994 లో ఆర్ గాంధీ టిడిపి అభ్యర్థులుగా గెలిచారు. తలారి రుద్రయ్య టిటిడి పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. గాంధీ ఎస్ వి యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. 1985,1989, 1999, 2004 ఎన్నికల్లో డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ కాంగ్రెస్ టికెట్టుపై గెలిచారు. అప్పటి వరకు వేపంజేరి పేరుతో ఉన్న నియోజక వర్గం పునర్వ్యవస్థీకరణ తరువాత జి డి నెల్లూరుగా మారింది. తరువాత 2009 ఎన్నికల్లో తిరిగి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. కుతూహలమ్మ ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసారు. 2014, 2019 ఎన్నికల్లో కార్వేటినగరం మండలానికి చెందిన వైసిపి అభ్యర్థి కె నారాయణ స్వామి వైసిపి అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో ఉప ముఖ్య మంత్రిగా ఉన్నారు. అదే సమయంలో విజయానంద రెడ్డి ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. కాగా పెనుమూరుకు చెందిన మహా సముద్రం జ్ఞానేంద్ర రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. గతంలో ఆయన జి డి నెల్లూరు సమితి అధ్యక్షునిగా, రెండు సార్లు చిత్తూరు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు వెదురుకుప్పం మండలానికి చెందిన డాక్టర్ ఎన్ వాసుదేవ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు.
పో రై గంగ 1 బి ఆర్ నాయుడు
గంగ 2 థామస్
గంగ 3 సుధాకర్ రెడ్డి
గంగ 4 చిట్టి బాబు