16, నవంబర్ 2024, శనివారం

నిధుల లేమితో నీరసపడ్డ గ్రంధాలయాలు

జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో గ్రంధాలయ సంస్థ  

పేరుకు పోయిన రూ. 32  కోట్ల బకాయిలు 

బకాయిలను చెల్లించని స్థానిక సంస్థలు 

62 మంది ఉద్యోగుల పోస్టులు ఖాళి

23 సంవత్సరాలుగా కొత్త పుస్తకాల ఊసే లేదు

సమస్యల వలయంలోనే  వారోత్సవాలు  

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

విజ్ఞాన భాండాగారాలుగా చెప్పుకునే గ్రంథాలయాలునిధుల లేమితో నీరసిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు వీటి గురించి పట్టించుకోకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ గాడితప్పుతోంది. పక్కా భవనాలు లేక.. పాఠకులకు మౌలిక సౌకర్యాలు కల్పించలేక.. పుస్తకాలూ పూర్తిస్థాయిలో అందించలేక.. గ్రంథాలయాల అధికారులు సతమతం అవుతున్నారు. గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి కరువైంది. వీటిని రాజకీయ పునరావాస కేంద్రలుగానే చూస్తోంది. చైర్మన్, సభ్యులను ప్రకటిస్తున్న ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్దికి పైసలు విదిలించడం లేదు. గ్రంథాలయాలకు  ప్రధాన ఆదాయ వనరు అయిన స్థానిక సంస్థల సెస్సును ఆ సంస్థలు గ్రంథాలయాలకు చెల్లించడం లేదు.  దీంతో గ్రంథాలయాల అభివృద్ధి పూర్తిగా పడకేసింది.

జిల్లా కేంద్రమైన చిత్తూరులో జిల్లా గ్రంధాలయ సంస్థకు సొంత భవనం కూడా లేదు. ఇదివరకు ఎన్జీవో హోం పక్కన ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని రోడ్డు వెడల్పు చేయడానికి కూల్చివేశారు. గత రెండు సంవత్సరాలుగా జిల్లా గ్రంథాలయం సంస్థ అద్దె భవనంలో చిత్తూరు మిట్టూరులోని రాఘవ చేయుట ఎదురుగా మిద్దె పైన నడుస్తోంది. గ్రంథాలయం మిద్దపైన ఉండడంతో వికలాంగులు, వృద్ధులు గ్రంథాలయానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 71 గ్రంథాలయాలు ఉన్నాయి. ఇందులో 54 గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. 12 గ్రంథాలయాలు అద్దెలేని ఉచిత భవనాల్లో నడుస్తున్నాయి. ఐదు గ్రంథాలయాలకు అద్దె కడుతున్నారు. జిల్లా గ్రంధాలయాలకు స్థానిక సంస్థల సెస్ ముఖ్యమైన ఆదాయం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు సెస్ వసూలు చేసే పన్నులలో  8 శాతం జిల్లా గ్రంథలయాలకు అందజేయాలి. పలువురు గ్రంధలయ సెస్ ను వసూలు చేయడానికి ముందుకు రావడం లేదు. మరికొన్ని స్థానిక సంస్థలు వసూలు చేసినా, జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించడం లేదు. చిత్తూరు జిల్లాలో 32 కోట్ల రూపాయలు జిల్లా గ్రంధాలయ సంస్థకు స్థానిక సంస్థలు బకాయిలుగా ఉన్నాయి. తిరుపతి మున్సిపాలిటీ మాత్రమే 28 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. ఈ విషయమై జిల్లా గ్రంథాలయ అధికారులు పలుమార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపగా, కొంత మొత్తం మాత్రం చెల్లించారు. అలాగే స్థానిక సంస్థలు కూడా నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రంధాలయసేస్ బకాయిలుగా ఉన్నాయి. సగటున ప్రతి సంవత్సరం ఐదు కోట్ల రూపాయలు గ్రంథాలయ సెస్ గా వసూలు కావాల్సి ఉంది. వీటి మీద ప్రభుత్వం కానీ, జిల్లా అధికారులు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపకపోవడంతో గ్రంథాలయ సెస్ఎక్కడికక్కడే పేరుకు పోతుంది. ఫలితంగా గ్రంథాలయాల అభివృద్ధి కుంటుపడుతోంది. కొత్త పుస్తకాలు కూడా కొనడానికి కుదరడం లేదు. 2007 సంవత్సరం నుంచి  గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలను కొనలేదు. 2021 వ సంవత్సరం మాత్రం కొత్త పుస్తకాల కొనుగోలుకు కోటి రూపాయలన్న ప్రభుత్వం విడుదల చేసింది. తర్వాత ఇప్పటివరకు కొత్త పుస్తకాలు ఊసే లేదు. 23 సంవత్సరాలుగా కొత్త పుస్తకాలను కొనుగోలు చేయకపోవడంతో ఉన్న పాత పుస్తకాలతోనే సర్దుబాటు చేయాల్సి వస్తుంది. గ్రంథాలయాలకు దినపత్రికలు, వార పత్రికలు, మాస పత్రికల బిల్లులను చెల్లించడం కూడా కష్టమైపోతుంది. జిల్లాలోని 71 గ్రంథాలయాలకు 116 మంది ఉద్యోగులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం 42 మంది మాత్రమే జిల్లాలో పనిచేస్తున్నారు. 62 మంది గ్రంథాలయ ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. చిత్తూరు, మదనపల్లి, తిరుపతిలో మాత్రమే గ్రంధాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. చిత్తూరు పట్టణంలో పాత గ్రంథాలయ సంస్థ స్థలంలోని కొత్తగా గ్రంధాలయాన్ని భవనాన్ని నిర్మించడానికి మూడు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో 75 లక్షల రూపాయలను నిర్మాణ సంస్థకు అందజేశారు. సంవత్సరం రోజులలో భవన నిర్మాణం పూర్తి కావాలని నిర్దేశించారు. అయితే గ్రంధాలయ సంస్థ ఇందుకు కావలసిన నిధులను సమకూర్చుకోగలుగుతుందా అన్న సందేహం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈనెల 14వ తారీఖు నుండి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. 14వ తారీఖున గ్రంథాలయ వారోత్సవాలను బాలల దినోత్సవం రోజున ప్రారంభించారు. 15వ తేదీన పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసి, మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించి, పుస్తక పఠనం ప్రాధాన్యతను వివరించారు. 16వ తేదీన గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించుకున్నారు. 17వ తేదీన కవి సమ్మేళనం జరగనుంది. 18 వ తేదీన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నారు. 19వ తేదీన మహిళలకు రంగవల్లులు, అల్లికల పోటీలను నిర్వహిస్తారు. 20వ తేదీ న విద్యార్థులకు డిజిటల్ గ్రంథాలయాలపై అవగాహన సాముహిక పఠనం గురించి తెలియజేస్తూ వారోత్సవాలను ముగించనున్నారు.

పో రై గంగ 1 అద్దె భవనంలోని చిత్తూరు గ్రంధాలయ సంస్థ 
గంగ 2 గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా రచయిత్రి డా. రామలక్ష్మికి సన్మానం 







అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *