10, నవంబర్ 2024, ఆదివారం

విశిష్టమైన కార్తిక సోమవారాలు

శివాలయాల్లో దీపారాధనకు ప్రాముఖ్యత

రెట్టిపు ఫలితాలు ఇస్తారని భక్తుల నమ్మకం 

నదులలో స్నానానికి విశేష ప్రాధాన్యత  

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

కార్తీక సోమవారాలలో శివలింగానికి  అభిషేకాలు చేయడం, బిల్వ పత్రాలు సమర్పించడమే కాకుండా సోమవారపు రోజు సాయంకాలం దీపారాధన చేయడం ద్వారా శివుని కృప సులభంగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.  ఈ మాసంలో సోమవారాఉండే విశిష్టత అంతా ఇంతా కాదు. ఈశ్వరుని ఆరాధనకు చాలా ముఖ్యమైనది. దేశంలో ఉన్న వివిధ శివ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వ దళ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలా విశేష పూజలు చేసే భక్తులకు సదాశివుడు ప్రసన్నమై కొంగుబంగారమై వరాలు ఇస్తారని భక్తుల నమ్మకం. 

కార్తీక సోమవారం శివారాధన ఎలా చేయాలి అనేదానిపైన పురాణాలలో కూడా ఉంది.  కార్తీకమాసంలో  చంద్రుడు కృత్తికలో పూర్ణుడై ఉంటాడు. కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరం ఆరాధించాలి. అలాగే సోమవారం  స్నానం, పూజ, జపం చేస్తే, అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం పొందుతారని భక్తులు నమ్ముతారు. సోమవారాల్లో శివాలయ దర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా ఏక భుక్తం మంచిది పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలు ఇస్తుందని చెబుతారు. కావున  సోమవారం ఉపవాసం ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో శివున్ని పూజిస్తారు. కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శివయ్య పూజ చేసి తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. కార్తీక సోమవారం ఉపాసదీక్ష చేసి, పరమేశ్వరుడి అనుగ్రహం సొంతం చేసుకుంటారు. కార్తీకమసం సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోష కాల సమయంలో ఇంటిలోని పూజ గదిలోని దీపారాధన చేసిన తర్వాత శివాలయానికి వెళ్లి పరమా శివుని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయాలి. ఓం నమశ్శివాయ అంటూ శివ పంచాక్షిరి  మంత్రాన్ని పట్టించాలి. ఆ తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు చేసిన పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి . కార్తీక మాసంలో చేసే స్నానము ధూపము పూజ ధానము విశిష్ట ఫలితాలు ఇస్తాయని ప్రజల నమ్ముతారు. శివ శివ అంటూ శివ నామ స్మరణ చేస్తూ  దామోదరుడిని  కీర్తించిన శుభ జరుగుతుందని పండితులు చెబుతారు. కార్తీకమాసంలో చేసే స్నానం, ధూపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తుందని  ప్రజలు నమ్ముతారు. కార్తీక మాసం అనగానే సాధారణంగా పరమశివునికి ప్రీతి పాత్రం అని  భావిస్తారు. కానీ ఇది విష్ణుమూర్తి ఆరాధనకు అత్యంత ప్రధానమైన మాసం. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోళా శంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు.  కార్తీకమాసంలో దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం రెట్టింపు ఫలితాలు ఇస్తాయని పురాణాలు చెపుతున్నాయి.  పాపాలు నశింప చేసుకోడానికి, పుణ్యాన్ని సంపాదించడానికి , భక్తిని పెంపొందిచుకోడానికి, భక్తి ద్వార ముక్తి మార్గాన్ని పొందుటకు ఉత్తమమైన మాసమని పెద్దలు చెపుతారు. కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్టారు.  ఈ మాసంలో పవిత్ర స్నానాలు, దీపారాధనలు, ఉపవాసాలు, వ్రతాలు, సత్యనిష్ఠతో గడపడం అనేక పుణ్యాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక సోమవారాలలో ఉపవాసం చేయడం చాలా గొప్ప పద్ధతి. శివుడికి ప్రీతికరమైన ఈ వ్రతం ద్వారా శివ కృపను పొందవచ్చు. ఉపవాసం వ్రతం శరీర శుద్ధికి, మనస్సు శుద్ధికి తోడ్పడుతుంది. సోమవారంలో ఉపవాసం చేసి, సాయంత్రం శివాలయంలో పూజ చేయడం శివుని అనుగ్రహాన్ని పొందేందుకు మంచి పద్ధతిగా పరిగణించబడింది. కార్తీకమాసంలో భగవంతుడిని పూజించడం ద్వారా, మానసిక ప్రశాంతతను పొందడం, ఆధ్యాత్మిక ఉద్దీపనను పొందడం జరుగుతుందని భావిస్తారు. శివునికి, విష్ణువుకు సంబంధించిన పురాణాల ప్రకారం ఈ మాసం శివుని దైవత్వానికి పునరుజ్జీవితమని భావిస్తారు. అందుకే ఈ మాసంలో శివుణ్ణి ఆరాధించడం ద్వారా పాప విమోచనమని విశ్వసిస్తారు. దీపారాధన ద్వారా చేసే కర్మలతో మన లోకంలోనే కాదు, పితృలోకానికి కూడా పవిత్రత అందుతుందని నమ్మకం. కార్తీక మాసంలో ప్రతిరోజూ గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం అనేక పుణ్యాలను ఇస్తుంది. అలాగే దీపారాధన ద్వారా వ్రతాలు చేయడం వలన పాప విముక్తి పొందవచ్చు. ఉదయాన్నే నదుల్లో స్నానం చేసి, దేవాలయాలలో శివుని, విష్ణువుని పూజించడం ద్వారా కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద లభిస్తాయని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో దీపం వెలిగించడం అనేది భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు సాధించడానికి పూర్వీకులు చేసిన ముఖ్య పద్ధతి. కార్తీక మాసం పుణ్య కాలముగా పరిగణించబడుతుంది. అందుకే ఈ మాసం రోజుల్లో ఉదయాన్నే నదుల్లో లేదా శుద్ధ జలంతో స్నానం చేయడం ముఖ్యమైన ఆచారంగా ఉంది. ఈ కార్తీక స్నానం ద్వారా పాప విముక్తి పొందవచ్చని పురాణాలు చెబుతాయి. స్నానం చేసిన తరువాత దానం చేయడం ఈ మాసం లో విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసంలో ప్రత్యేకంగా గోదావరి, కృష్ణ, నర్మదా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని, ఈ స్నానాలు పాపాలను తొలగిస్తాయని, మనస్సును పవిత్రతో నింపుతాయని పురాణాలు చెబుతున్నాయి. కనుక కార్తీక మాసంలో చేసే స్నానం శరీరం, మనస్సు, ఆత్మలు పవిత్రమవుతాయని పెద్దలు చెబుతారు. కార్తీక మాసంలో చేసిన దానాలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా చెపుతారు. ముఖ్యంగా అన్నదానం, వస్త్ర దానం, దీప దానం చేయడం వల్ల పుణ్య ఫలితం అధికంగా లభిస్తుందని నమ్మకం. ఈ మాసంలో గో దానం, గాజుల పంపిణి చేయడం, బ్రాహ్మణులకు దానం చేయడం విశేష పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో కుల సంఘాలు కార్తిక వాన భోజనాలు నిర్వహించి శివారాధన చేస్తారు. కొన్ని సంఘాలు శివాలయాల్లో సామూహికంగా దీపారాధన చేసి శివుని కృపకు పాత్రులు అవుతారు. 

 గంగ 2 జంగం సంక్షేమ సంఘం ఆధ్యర్యంలో పలమనేరులో దీపారాధన ఫైల్ ఫోటో 

గంగ 3 చిత్తూరులో జంగం సంక్షేమ సంఘం ఆధ్యర్యంలో దీపారాధన 



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *