12, నవంబర్ 2024, మంగళవారం

ఒకటి, రెండు రోజుల్లో మరిన్ని డైరెక్టర్ పదవులు !

ఆరు కార్పొరేషన్ లకు డైరెక్టర్ల ప్రకటన 
చిత్తూరు జిల్లాకు 11 డైరెక్టర్ పోస్టులు
కుప్పం నియోజక వర్గానికి గరిష్టంగా 6
చిత్తూరు, పూతలపట్టు నియోజక వర్గానికి శూన్యం

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

కూటమి ప్రభుత్వంలో పదవుల పందేరం జరుగుతోంది. కొంత ఆలస్యం అయినప్పటికీ 80 కార్పొరేషన్లకు చైర్మలను నియమించారు. కొన్నింటికి సభ్యులు, డైరెక్టర్ లను నియమించారు. అయితే 90 శాతం కార్పొరేషన్లకు డైరెక్టర్ లను నియమించలేదు. మంగళవారం 6 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించారు. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన కార్పొరేషన్ లో కూడా డైరెక్టర్లను నియమించే అవకాశం ఉంది ఈ మేరకు టిడిపి కార్యాలయంలో జోరుగా కసరత్తు జరుగుతుంది. ఒకసారి కాకున్నా, దశల వారీగా డైరెక్టర్ల నియామకం చేపట్టే అవకాశం ఉంది.

 మొదటి విడతలో 20 సంస్థలకు చైర్మన్ లను వేశారు. అందులో సగం సంస్థలకు డైరెక్టర్లను వేశారు. అయితే కొంత మంది తమ స్థాయికి తగవని పదవులను నిరాకరించారు. రెండవ విడత టిటిడి బోర్డు చైర్మన్ గా బి ఆర్ నాయుడుతో పాటు 29 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం 59 సంస్థలకు కేవలం చైర్మన్ లను మాత్రమే నియమించారు. మంగళవారం ఆరు కార్పొరేషన్ లకు డైరెక్టర్లను నియమించారు. కురబ కార్పొరేషన్ డైరెక్టర్లగా కుప్పం నియోజకవర్గ నుండి రాజగోపాల్, పలమనేరు నియోజకవర్గం నుండి సుబ్రహ్మణ్యం గౌడ్, పుంగనూరు నియోజకవర్గం నుంచి రమణకు స్థానం దక్కింది. వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ లో కుప్పం నియోజకవర్గం నుంచి బి రుద్రప్ప, ఎన్  చంద్రశేఖర, డివి అరుణాచలం, పెద్ద చిన్నప్ప, ఆర్ చంద్రశేఖర్, నగిరి నియోజకవర్గం నుంచి షణ్ముగం, ఎం శ్రీనివాసులు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుండి ఈ ఏం రాజేంద్రరెడ్డి స్థానం దక్కించుకున్నారు. చిత్తూరు జిల్లాకు మొత్తం 11 డైరెక్టర్ పదవి లభించాయి. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి ఆరు డైరెక్టర్ పోస్టులు తగ్గాయి. నగిరి నియోజకవర్గానికి రెండు డైరెక్టర్ పోస్టులు, గంగాధర నెల్లూరు, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలకు ఒక్కొక్క డైరెక్టర్ లభించింది. అయితే చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గానికి ఒక డైరెక్టర్ పదవి కూడా లభించలేదు. ఒకటి రెండు రోజుల్లో అన్ని సంస్థలకు డైరెక్టర్లను నియమిస్తారని తెలిసింది.  అందరూ కలసి 800 పైగా ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇందులో చిత్తూరు జిల్లాకు 40 వరకు డైరెక్టర్ పోస్టులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాను ఆయా సంస్థల చైర్మలు, అధికారులకు పంపుతారు. మంచి రోజు చూసి చైర్మన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ద్వితీయ శ్రేణి నాయకులు, యువకులు ఎక్కువగా ఉంటారు. మహిళలు, బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. జిల్లాకు చెందిన బి ఆర్ నాయుడు టిటిడి బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. సి ఆర్ రాజన్ వన్నె కుల క్షత్రియ  కార్పోరేషన్ అధ్యక్షునిగా ఉన్నారు. కటారి హేమలత చిత్తూరు అర్బన్ డెవలప్ మెంట్ చైర్ పర్సన్ గా నియమితులు అయ్యారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన మునిరత్నం ఆర్టీసీ వైస్ చైర్మన్ గా, సదాశివం టిటిడి బోర్డు సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు నియోజక వర్గాలకు ఒక పదవి కూడా దక్కలేదు. పూతలపట్టు నేతకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి ఇస్తారని తెలిసింది. అలాగే పుంగనూరు నేతకు బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ పదవి ఇస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏడు నియోజక వర్గాల నుంచి నియోజక వర్గానికి నలుగురు లేక ఐదుగురికి డైరెక్టర్ పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. మిగిలిన డైరెక్టర్ పోస్టుల జాబితా కోసం జిల్లాకు చెందిన ఆశావాహులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *