22, నవంబర్ 2024, శుక్రవారం

పేదల ఇళ్ళకు ఉచితంగా విద్యుత్తు ఉపకరణాలు

కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ జాయింట్ వెంచర్

 ఉచితంగా ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, బీఎల్‌డీసీ ఫ్యాన్లు

ఇళ్లల్లో విద్యుత్ ఆదా చేయడమే ప్రభుత్వం లక్ష్యం 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

  పేదల ఇళ్లల్లో విత్యుత్తు వెలుగులు పంచేందుకు, వారికీ విత్యుత్తు బిల్లులు తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 1.50 లక్షల ఇళ్లకు విద్యుత్ ఉపకరణాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌ తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో కూడా ప్రారంభం కానుంది. ఈ పధకం అమలు జరిగితే, విత్యుత్తు బిల్లులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.


 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలోని లక్షా 50 వేల ఇళ్లకు ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, బీఎల్‌డీసీ ఫ్యాన్లు అందించనున్నారు. విద్యుత్‌ను ఆదా చేసే ఉద్ధేశంతో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా తక్కువ ఆదాయం ఉన్న వారి కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన  కింద నిర్మిస్తున్న 1.50 లక్షల ఇళ్లకు ఇంధనాన్ని ఆదా చేసే ఉపకరణాలను సరఫరా చేస్తారు. ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఇడి బల్బులు, రెండు బాటెన్ ట్యూబ్ లైట్లు, రెండు 5-స్టార్  బిఎల్డిసి  ఫ్యాన్‌లు అందిస్తారు. వీటి వినియోగం ద్వారా లబ్ధిదారుల ఇళ్లల్లో విద్యుత్ ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరికరాల సేకరణ, పంపిణీని ఈఈఎస్ఎల్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది, దేశవ్యాపంగా ఇంధన ఆదా కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఏపీతో కేంద్రం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఏడాది మొత్తం అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి, ఉక్కపోత ఉండే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ బీఎల్‌డీసీ ఫ్యాన్లు కూలింగ్ కలిగిస్తాయని, అలాగే గది ఉష్ణోగ్రతలను కూడా తగ్గిస్తాయని ఏపీ విద్యుత్ అధికారి ఒకరు  తెలిపారు. అలాగే కరెంట్ ఆదా కూడా చేస్తాయన్నారు. ఎల్‌ఈడీ బల్బులు, బ్యాటెన్ ట్యూబ్ లైట్లు ఎక్కువ లైటింగ్ అందజేస్తాయని, అలాగే ఎక్కువ కాలం మన్నిక వస్తాయని మంత్రి వెల్లడించారు. సాధారణంగా ఉపయోగించే బల్బుల కంటే ఎక్కువ కాంతిని అందిస్తూ.. తక్కువ విద్యుత్ వాడుకుంటాయని వివరించారు. ఫలితంగా కరెంట్ బిల్లులు కూడా తక్కువగా వస్తాయన్నారు. ఈ విధానాల ద్వారా ఇంధన ఆదాలో దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. కార్తీక మాసం సమీపిస్తున్నా ఎండలు మండిపోతున్నాయి. అదే వేడి కొనసాగుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ బిఎల్డిసి ఫ్యాన్లు అమర్చుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇవి విద్యుత్ సైతం ఆదాచాయని తెలుస్తోంది. మరోవైపు ఎల్ఈడి బల్బులతో పాటు బ్యాటన్ ట్యూబ్ లైట్లు ఎక్కువగా లైటింగ్ ఇస్తాయి. ఎక్కువ కాలం మన్నిక కూడా ఇచ్చే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో టిడిపి ప్రభుత్వం వచ్చింది. అప్పట్లో కూడా చంద్రబాబు ఎల్ఈడి బల్బులను తెరపైకి తెచ్చారు. అంతవరకు వీధిలైట్లను సైతం ట్యూబ్లైట్లను వాడేవారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఎల్ఈడి లైట్లు అందుబాటులోకి తెచ్చింది. వాటితో విద్యుత్ వినియోగం కూడా తగ్గింది. స్థానిక సంస్థలపై ఆర్థిక భారం కూడా తగ్గుముఖం పట్టింది. అందుకే ఇప్పుడు తాజాగా పేదల ఇళ్లకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని తగ్గించే పనిలో పడింది సర్కార్. తద్వారా రాయితీ విద్యుత్ వినియోగం తగ్గుముఖం పట్టనుంది. పేదలపై విద్యుత్ భారం కూడా తగ్గనుంది. మొత్తానికైతే కూటమి సర్కార్ వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తుండడం విశేషం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *