26, నవంబర్ 2024, మంగళవారం

మామిడి రైతులకు శుభ వార్త

పంటల బీమా పరిధిలోకి మామిడి తోటలు 

ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి అచ్చెన్న 

జిల్లాలోని మామిడి రైతులలో హర్షాతిరేకాలు

విధివిధానాల కోసం ఎదురుచూపులు

చిత్తూరు బ్యూరో,  ఆంధ్రప్రభ.

మామిడి తోటలను కూడా ఈ ఏడాది నుంచి పంటల  బీమా పరిధిలోకి  తీసుకొని రావాలని కూటమి  ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ఈనెల 13వ తారీఖున అసెంబ్లీ సమావేశాలలో ఒక ప్రకటన చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం రబీ  రైతులకు పంటల బీమా పథకం వర్తించకుండా అన్యాయం చేసిందని, ఈ ఏడాది నుంచి ఖరీఫ్, రబీ పంటలు అన్నింటికీ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయంతో జిల్లాలోని మామిడి రైతులలో  హర్షాతిరేకాలు వ్యక్తం  అవుతున్నాయి. పంటల బీమా పథకం ద్వారా ప్రభుత్వం తమను ఆదుకుంటుందని మామిడి రైతులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో సుమారుగా లక్షా, 5వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇందులో 20వేల ఎకరాలు లేత తోటలు కాగా  లక్ష యాభై వేల ఎకరాల్లో కాపు వస్తుంది. జిల్లాలో సగటున 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్చిఉంది. .  సగటున జిల్లాలో సంవత్సరానికి 5 లక్షల టన్నుల మామిడి దిగిబడి రావల్చి ఉండగా, అయితే వ్యతిరేక వాతావరణం కారణంగా గత సంవత్సరం 10 శాతం పంట వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మామిడి పూత చాలా తగ్గువ వచ్చింది. వచ్చిన పూత కూడా నిలువలేదు. వచ్చిన పూత కూడా మూడు, నాలుగు దఫాలుగా వచ్చింది. వాతావరణం అనుకూలించక  మామిడి పూతంతా మాడిపోయింది. మరోవైపు పిందే  అడుగు భాగాన మచ్చలతో పంట కూడా  దెబ్బతింది. కాయ తోటిమ దగ్గర నుండి పాలు కారుతూ, కాయ రంగు మారి కింద పడిపోతుంది. మరో వైపు మామిడి తోటలను మంగు ముంచి ఎత్తింది. మంగు కారణంగా మామిడి ఆకులు నల్లగా మారి, దాని ప్రభావం కాయ మీద పడి, మామిడి పిందెలు కూడా నలుపు రంగులోకి మారాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలో సుమారుగా 90 శాతం మామిడి పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారుగా లక్షా, 5వేల ఎకరాల్లో మామిడి తోటలలో  సగటున 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్చిఉంది. అయితే పూత రాకపోవడంతో  గత సంవత్సరం 10 శాతం పంట వచ్చింది. అకాల వర్షం, ఎదురు గాలుల కారణంగా, పంట చాలా వరకు వేలరాలింది. తూర్పు మండలాల్లో  ఎక్కువగా విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పండిన పంటంతా చిత్తూరుదామలచెరువుబంగారుపాళ్యంపుత్తూరుతిరుపతి కేంద్రంగా  కలకత్తాఢిల్లీ వంటి కేంద్రాలకు ఎగుమతి అవుతోంది. మంచుఅకాలంగా వీచిన గాలుల వల్ల మామిడి పూత రాలిపోవడంతో పాటు పిందెలకు మచ్చలు ఏర్పడడంతో పూర్తిగా పంట దెబ్బతిన్న పరిస్థితి. ఇలా జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో మామిడి పంట నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.15 వేలు నుంచి రూ.20 వేలుకు లీజుకు తీసుకున్న సాగుదారుడుదుక్కులు దున్నడంపురుగు మందుల వాడకానికి ఎకరాకు మరో రూ.20 వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే ప్రతి ఎకరాకు రైతుకు రూ.40 వేలు వరకూ ఖర్చవుతోంది. అయితే  పెట్టు బడులు కూడా తిరిగి రావని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు నష్టపోయారని రైతు సంఘాలు ఆందోళ చేస్తున్నారు. మామిడి రైతు గత రెండేళ్లుగా వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో నష్టపోతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టికేలకు కూటమి ప్రభుత్వం మామిడి రైతుల మీద దృష్టిని సారించింది. జిల్లాలో ఇప్పటి వరకు టమేటా, వరి, వేరుశనగ పంటలకు మాత్రమే బీమా ఉంది. మామిడి తోటలను కూడా ఈ ఏడాది నుంచి పంటల  బీమా పరిధిలోకి  తీసుకొని రావాలని కూటమి  ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇప్పటివరకు విధివిధానాలను వెల్లడించలేదు. ఎకరాకు పంటల బీమా కింద ఎంత చెల్లించాలి అనేది స్పష్టత లేదు. గత సంవత్సరం వరకు పంటల బీమాను మొత్తాన్ని  ప్రభుత్వమే రైతుల తరఫున చెల్లించేది. ఈ సంవత్సరం నుంచి రైతులు చెల్లించాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మామిడి పంటలకు బీమాను జిల్లాను యూనిట్ గా తీసుకుంటారా లేక  మండలాన్ని యూనిట్ గా తీసుకుంటారా అనేదాని పైన కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మామిడి పంట దెబ్బతింటే ఎకరా మామిడి పంటకు ఎంత బీమా చెల్లిస్తారన్న విషయం మీద కూడా స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలను రూపొందిస్తుందోనని జిల్లాలోని మామిడి రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పంటల బీమా పథకం కింద మామిడి తోటలను  కూడా చేర్చడంతో తమ కష్టాలు గట్టెక్కుతాయని, తమకు గిట్టుబాటు ధర లభిస్తుందని మామిడి రైతులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *