రైతన్నకు సహకరించడానికే పొలం పిలుస్తోంది కార్యక్రమం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
వ్యవసాయంలో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబ డులు సాధించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘‘పొలం పిలుస్తోంది’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వారంలో ప్రతి మంగళ, బుధవారాల్లో రోజుకు రెండు గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించేలా ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖలైన మత్స్య, ఉద్యాన, పట్టు, పరిశ్రమ,సేంద్రియ, మార్కెటింగ్ శాఖల అధికారులు పొలంబాట పట్టే దిశగా ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఆధునిక పంటలపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టడంతో పాటుగా సంబంధిత వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నదాతలను కలిసి సాగు కష్టాలు తెలుసుకుని, నూతన దిగుబడులపై అవగాహన కల్పిస్తారు. ఖరీఫ్, రబీ సాగుల్లో నాలుగు నెలల వం తున ‘‘పొలం పిలుస్తోంది’’ నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. అధికారులు రైతు వద్దకు వెళ్లి పంటల పరిశీలనతో పాటు లోపాలు గుర్తిస్తారు. ఈ వివరాలు రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలించనున్నారు. పంట దిగుబడి తగ్గడానికి కారణాలు తెలుసు కోవడం, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించి భూసారం పెంచేలా సూచనలు చేయడం, భూసార కార్డుల పంపిణీ, తుంపర, బిందు సేద్యం పఽథకం దిశగా ప్రోత్స హించడం చేస్తారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ, రైతు మిత్ర సంఘాల ఏర్పాటు, వ్యవసాయ సంఘాల ద్వారా రుణాలు మంజూరు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న 14 శాఖల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచి ంచింది. సరైన సూచనలు లేక అధిక పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా చేతికి పోతున్నారని భావించిన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో గత ప్రభుత్వాలు లోపాలను సవరిస్తూ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ రైతు ముందుకు వస్తోంది శాస్త్రవేత్తలు వ్యవసాయ అనుబంధ శాఖలైన మధ్య ఉద్యానవన పట్టు పరిశ్రమ సేంద్రియ మార్కెటింగ్ అధికారులు అన్నదాతను కలిసి సాగు కష్టాలు తెలుసుకోవడమే కాకుండా దిగుబడి పరిస్థితులపై అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా నిధులు కేటాయింపు, ఆధునిక పంటలపై దృష్టిలో సాధించేలా చర్యలు చేపట్టింది. పంట దిగుబడికి కారణాలు విశ్లేషించడం, సూష్మపోషక లోపాన్ని గుర్తించి భూసారం పెంచడం, భూసార కార్డుల పంపిణీ, తుంపర, బిందు సేద్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారి, రైతుమిత్ర సంఘాల ఏర్పాటు, వ్యవసాయ సంఘాల ద్వారా రుణాలు మంజూరు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గాలా అవగాహన కల్పిస్తారు. గతంలో రైతులకు పంట దిగుబడి పెంచడానికి పధకాలు అమలు చేసినప్పటికీ సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడం, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూడకపోవడం కారణంగా రైతులకు నష్టమే మిగిలింది. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా పకడ్బందీగా కార్యక్రమాలను అభివృద్ధిగా చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం నిధులను కేటాయించింది. ఈ విషయమై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి అధికారి రైతు వద్దకు వెళ్లి పంట పరిశీలనతో పాటు లోపాలను గుర్తిస్తారన్నారు. అధికారులు రైతుల వద్ద సేకరించిన వివరాలను రాష్ట్రస్థాయి అధికారులకు పరిశీలిస్తారనీ, దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం రైతులు పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు తోడ్పడుతుందని తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక సంకేతిక పద్ధతులపై వ్యవసాయ అనుబంధ శాఖ, అనుబంధ శాఖల అధికారులు అంతా రైతులకు వివరిస్తారని పేర్కొన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని రైతులను ఆయన కోరారు.
పో రై గంగ 3 ఐరాల మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
పో రై గంగ 4 వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ