చుడా చైర్మన్ గా కటారి హేమలత
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు నగర పార్టీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్న కటారి హేమలతను చుడా చైర్మన్ పదవి వరించింది. ఇది వరకు ఆమె చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు మొదటి జాబితాలో ఆమెకు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేసిన ఆమె డైరెక్టర్ పదవిని స్వీకరించలేదు. దీంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. ఆమెకు స్థాయికి తగిన విధంగా చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో చిత్తూరు పట్టణంలో పండుగ వాతావరణం ఏర్పడింది. చిత్తూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. శనివారం సాయంకాలం కటారి హేమలత చిత్తూరు గాంధీ గ్రామం వద్ద నివాళులర్పించారు. అంతకుముందు స్వర్గీయ అత్తమామలు కటారి అనురాధ, కటారి మోహన్ లకు నివాళులర్పించారు. ఆమెను అభిమానులు చిత్తూరు పట్టణంలో భారీ ఎత్తున బాణాసంచ కాల్చి హర్షాన్ని వ్యక్తం చేశారు.
కటారి హేమలత ఇదివరకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చిత్తూరు పట్టణ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. హేమలత అత్తమామలు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. మామ కటారి మోహన్ టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో కాంగ్రెస్ ఎం ఎల్ ఏ గా సికె బాబుకు, కటారి మోహన్ మధ్య విభేదాలు తలెత్తాయి. చివరకు సికె బాబు మిఫా హత్యాయత్నం చేసే స్థాయికి విభేదాలు వెళ్ళాయి. సీకే బాబు మీద జరిగిన హత్యాయత్నం కేసులు ప్రధాన నిందితుడు. కొంతకాలం అజ్ఞాతంలో కూడా గడిపారు. అజ్ఞాతం నుండి వచ్చిన తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కటారి వర్గం భారీ మెజారిటీ సాధించింది. ముసిపాల్ మేయర్ స్థానాన్ని మహిళలకు రిజర్వు చేస్యడంతో మోహన్ సతీమణి అనురాధ మేయర్ పీటం ఎక్కారు. ఈ సమయంలో సొంత బావమరిది చింటూతో విభేదాలు తలెత్తాయి. దీంతో చింటూ మున్సిపల్ కార్యాలయంలోని ఇద్దరినీ కాల్చి చంపారు. దీంతో వారి కుమారుడు కటారి ప్రవీణ్ రాజకీయ అరంగ్రేటం చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో భార్య హేమలతను గంగనపల్లి నుండి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించుకొన్నారు. ఆమెను మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కొంతకాలం పాటు మేయర్ గా పనిచేశారు. భర్త ప్రవీణ్ కోరోనాతో కన్ను మూయడంతో, హేమలత ప్రత్యక్ష రాజకిల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షురాలిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేశారు. కటారి కుటుంబం పార్టీ కోసం చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకొని చంద్రబాబు చిత్తూరు పర్యటనలో హేమలత ఇంటికి వెళ్లి పరామర్శించారు. హేమలత నగర పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనుచరుల మీద పోలీసులు తప్పుడు కేసులు బనాయించాలని ప్రయత్నం చేసినప్పుడు, ఆమె తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఒక దశలో పోలీసు జీబు కింద పడుకొని నిరసన తెలియజేస్తుండగా పోలీసు జీపు ఆమె కాళ్ళ మీద ఎక్కింది. దీంతో తీవ్రంగా గాయపడి, కొంతకాలం పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అత్తమామల రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కటారి హేమలత ఎన్నికలలో చిత్తూరు అసెంబ్లీ టికెట్టును ఆశించారు. అనుకోని విధంగా టికెట్ ను కమ్మ సామాజిక వర్గానికి ప్రకటించినా, కటారి హేమలత చిత్తూరులో టిడిపి అభ్యర్థి విజయానికి తన శాయశక్తుల ప్రయత్నించారు. ఆమె కుటుంబ త్యాగాలను, ఆమె పార్టీ పటిష్టత కసం కోసం చేస్తున్న ప్రయత్నాలను గుర్తించిన అధిష్టానం తొలుత టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చినా, తర్వాత చిత్తూర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమిస్తారు నియమించారు. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి 457 గ్రామాలు, 23 మండలాలు వస్తాయి. మొత్తం 3895 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చుడా విస్తరించి ఉంది. ఈ పరిధిలోని మండలాల్లో చుడా ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతాయి. చుడా పరిధిలోకి చిత్తూరు, బంగారుపాళ్యం, గుడిపాల, యాదమరి, ఐరాల, తవణంపల్లి, గంగాధర నెల్లూరు, పాలసముద్రం, శ్రీరంగ రాజపురం, సోమల, సదం, చౌడేపల్లి, పులిచెర్ల, రొంపిచర్ల, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కేవీ పల్లి, గుర్రంకొండ, కనకడ, నిమ్మనపల్లి మండలాలు వస్తాయి.
పో రై గంగ 3 కటారి హేమలత
గంగ 4 కటారి హేమలత కార్యాలయంలో సంబరాలు