5, డిసెంబర్ 2025, శుక్రవారం

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చదువుల పండగ సందడి

జిల్లావ్యాప్తంగా మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాలు విజయవంతం 

 చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

చిత్తూరు జిల్లా అంతా శుక్రవారం ఒకటే సందడి. పాఠశాల దర్గాల్లో అడుగుపెడితే పండగ వాతావరణం… మామిడి తోరణాలు కట్టి, రంగురంగుల నూలు దారాలు వేసి, పూలతో అలంకరించేసి చదువుల జాతరలా తీర్చిదిద్దారు. జిల్లా మొత్తం మీద నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ మీట్‌కి వచ్చిన స్పందన చూసి అధికార్లో, ఒళ్లంతా ఉప్పొంగిపోయింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలు, దాతలు, పాఠశాల కమిటీ సభ్యులు  అందరూ వచ్చి పిల్లల చదువుపై చూపిన శ్రద్ధ మరపురాని ఘట్టంగా నిలిచిపోయింది. సమావేశం అయిపోయాక అతిథులన్నీ పిల్లలతో కలసి వరుసలో కూర్చుని భోజనం చేయడం మరీ శోభానందం.


 చిత్తూరు రూరల్ మండలం తమ్మింద పాఠశాలకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా రాగా అక్కడే మొత్తం వాతావరణం మారిపోయింది. ఆయనతోపాటు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చైర్మన్, డిప్యూటీ మేయర్ రాజేష్, డిప్యూటీ డీఈఓ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు పి సి ఆర్ హైస్కూల్‌లో జిల్లా ఎస్పీ తుషార్ డూడి విద్యార్థులతో భోజనం చేయడం ఆ పాఠశాల విద్యార్థులకే కాదు, గ్రామానికి కూడా గౌరవంగా నిలిచింది. చిన్నకమ్మపల్లి జడ్పీ హైస్కూల్‌లో సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మద్దిపట్ల వెంకటరమణ విద్యార్థులను అభినందిస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. గంగాధర నెల్లూరు మండలం తుంగుండం హైస్కూల్‌కి ప్రభుత్వ విప్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డా. ఎం.వి. థామస్ రావడంతో అక్కడి పిల్లల ముఖాల్లో వెలుగులు కనిపించాయి. మాజీ మంత్రి, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల కార్యక్రమానికి హాజరై చదువుల ప్రాధాన్యంపై సూటిగా మాట్లాడారు. రొంపిచర్ల హైస్కూల్‌లో పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొనడం ఆ ప్రాంతంలో చర్చగా మారింది. కార్వేటినగరం డైట్‌లో జిల్లా విద్యాశాఖాధికారి వరలక్ష్మి స్వయంగా పాఠశాల పర్యవేక్షణ చేసి చదువుల ప్రమాణంపై దృష్టి పెట్టారు. కస్తూరిబా విద్యాలయ సమావేశంలో ఎమ్మెల్సీ కల్చర్ల శ్రీకాంత్ బాలికల చదువుల గురించి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు. నగిరి బాలికల పాఠశాలలో వెస్ట్ బెంగాల్ కు చెందిన డి ఐ జి అనంత నాథ్, చిన్న మధ్య తరహా పరిశ్రమల డైరెక్టర్  చిన్నబాబు పిల్లలకు పరిశ్రమలపై అవగాహన కల్పించారు. పూతలపట్ట నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ హాజరై పిల్లలతో మమేకమయ్యారు. జిల్లాలో ఎక్కడ చూసినా చదువు–సంబంధమైన చర్చలు, పిల్లల భవిష్యత్తుపై ఆశలు, ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల మధ్య మంచి అర్థం… ఇలా ఒకరోజు చిత్తూరు జిల్లా మొత్తాన్ని చదువుల పండుగలో ముంచెత్తేసింది. పిల్లల నవ్వులు, పెద్దల భాగస్వామ్యం, అతిథుల సందడి ఇవన్నీ కలిపి ఈ కార్యక్రమాన్ని జిల్లా చరిత్రలో నిలిచిపోయే మహాసమ్మేళనంగా మలిచాయి.

గుడిపాల మండలం కమ్మ తిమ్మపల్లి పాఠశాల సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరమణ 

డైట్ సమావేశంలో పాల్గొన్న డీఈఓ వరలక్ష్మి



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *