జిల్లాలో జీఎస్టీ రిటర్నుల పేరుతో 118.70 కోట్లు స్వాహా
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో గత అయిదేళ్లుగా 118.70 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొందరు గేటు గాళ్లు జీఎస్టీ రిటర్న్స్ పేరుతో స్వాహా చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి, నకిలీ కొనుగోళ్లు, నాకు ఇండియా అమ్మకాలను చూపించి, నకిలీ రిటర్నులను దాఖలు చేశారు. 39 లావాదేవీలు నకిలీవి జరిగినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారం చిత్తూరు, పలమనేరు, తిరుపతి, గూడూరు కేంద్రాలుగా జరిగాయి. ఇందులో ఒకే వ్యక్తి అత్యధిక శాతం మొత్తాన్ని చేజెక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యక్తికి జిఎస్టి విభాగానికి చెందిన కొందరు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించినట్లు సమాచారం. ఇప్పటికీ ఆ సహకారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తనకు సహకరించినందుకు అధికారులకు భారీ ఎత్తున నగదు బహుమతులు మొట్టచెప్పినట్లు తెలుస్తోంది. ఇంత మొత్తంలో ఖజానాకు గండిపడిన జీఎస్టీ అధికారులలో చలనం లేదు. ఇందుకు సంబంధించి కేసులు నమోదు కాలేదు. ఎవరిని అరెస్టు చేయలేదు. ఎవరిమీద అనుమానం కూడా వ్యక్తం చేయలేదు.
ఈ కుంభకోణంలో అమ్మకాలు, కొనుగోలు కాగితాల మీదనే జరిగాయి. జిఎస్టి అధికారులు సంబంధిత రిటర్న్స్ దాఖలు చేసిన స్థలాన్ని పరిశీలించలేదు. అంత మొత్తంలో లావాదేవీలు జరగడానికి అక్కడ ఉన్న వసతులను పరిశీలించలేదు. వస్తువుల జాడ లేదు. రవాణా రికార్డు లేదు. గోదాములు లేవు. తోకం యంత్రాలు లేదు. కోట్ల రూపాయల్లో వచ్చిన జీఎస్టీ రిటర్న్స్ ను గుడ్డిగా ఆమోదించారు అంత మొత్తాన్ని మంజూరు చేయాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేశారు .ఈ మొత్తం దందాకు తిరుపతి కేంద్ర బిందువుగా కేంద్రబిందువుగా నిలుస్తోంది. ఇక్కడే పెద్ద పెద్ద సంస్థలు వందల కోట్ల జిఎస్టి క్రెడిట్‌ను కాగితాల మీదే తిప్పి స్వాహా చేశాయి. అర్హాన్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ సొల్యూషన్స్ పేరుతో రెండు విడతలలో కలిపి 11.43 కోట్లు స్వాహా చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇదే తిరుపతిలో మదీనా స్టీల్స్ అనే సంస్థ మూడు వేర్వేరు సంవత్సరాలలో వేసుకున్న రిటర్నులు కలిపేసరికి 7.55 కోట్లు దాటాయి. ఎం ఆర్ మెటల్స్ కూడా పెద్దగానే దోచేసి, మూడు కోట్లకు పైగా స్వాహా చేసింది. చిన్నపాటి పేర్లలో పెద్ద చెల్లాచెదురు కనిపించిన వాటిల్లో ఐబి ట్రేడర్స్ రెండు సార్లు కలిపి దాదాపు 4.21 కోట్లు, తాజ్ ట్రేడర్స్ ఒకే సారి సమర్పించిన కొనుగోలు రిటర్న్‌లోనే 13.37 కోట్లు రాష్ట్ర ఖజానాకు బండరాయిలా పడిపోయింది. అక్రమ్ ఎంటర్ప్రైజెస్, హెచ్ జెడ్ ట్రేడర్స్, ఎస్ ఎన్ ట్రేడర్స్ లాంటి పేర్లు కూడా ఒక్కో కోటి దాటి తిరుపతిని దందాల వీధిగా మార్చేశాయి.
చిత్తూరు పట్టణం కూడా ఈ గజదొంగతనంలో తన పాత్ర పోషించింది. ఏ ఆర్ స్టీల్స్ మూడు విడతలుగా వేసుకున్న లెక్కలు కలిపితే 5 కోట్లు చుట్టేసాయి. మహాదేవ్ ఎంటర్ప్రైజెస్ 9.54 కోట్లు, ఆర్ పి ఎంటర్ప్రైజెస్ 15.98 కోట్లు, మిత్తల్ ట్రేడర్స్ 1.69 కోట్లు, కేయం ట్రేడర్స్ 4.42 కోట్లు, జెడ్ ఎఫ్ ట్రేడర్స్ 4.59 కోట్లు, ఎన్ ఆర్ ఎంటర్ప్రైజెస్ 2.29 కోట్లు. ఇలా చిత్తూరు ఒకే పట్టణంలో ఎన్ని నకిలీ బిల్లులు తయారయ్యాయో లెక్కపెట్టడానికి సాధ్యం కాదు. లిమ్రా ట్రేడర్స్ కూడా దాదాపు 1.66 కోట్లు కాగితాలమీదే తిప్పేసింది. బాలాజీ లక్ష్మీ మెటల్ మార్ట్ 2.23 కోట్లు, గురుకృప గ్రానైట్స్ 2.06 కోట్లు, బలాజీ లక్మీ మెటల్ మార్ట్, సూర్యన్ గ్రానైట్స్, శ్రీ సాయి లక్ష్మీ గ్రానైట్ ఇలాటి పేర్లు చూస్తూ పోతే చిత్తూరు టౌన్ మొత్తం నకిలీ వ్యాపారాల హాట్‌స్పాట్‌గా మారినట్టే తెలుస్తుంది.
పలమనేరు వద్ద దందా మరో ఎత్తుకు చేరింది. వి ఎన్ ఆర్ ఎంటర్‌ప్రైజెస్ రెండు సార్లు సమర్పించిన రికార్డులు కలిపితే 4.43 కోట్లు మాయం అయ్యాయి. ఎల్ ఆర్ ట్రేడర్స్ 2.94 కోట్లు, ఎన్ ఆర్ ట్రేడర్స్ 2.15 కోట్లు, ఏ టీ ట్రేడర్స్ 1.91 కోట్లు, టిజే ఎంటర్‌ప్రైజెస్ 1.79 కోట్లు, అల్జామా ట్రేడర్స్ 2.36 కోట్లు. ఇదంతా చూస్తే పాలమనేరు జోన్ మొత్తాన్ని జి ఎస్ టి దందాదారులు రాతి గ్రానైట్‌కన్నా కఠినంగా పిండేశారు అన్న అనుమానం తప్పదు. అదీగాక నాయుడుపేట దగ్గర మహాలక్ష్మీ గ్రానైట్స్ కూడా 1.65 కోట్లను నకిలీ పిల్లలతో సహా చేశాయి.
గూడూరు పరిధిలో కనిపించిన లెక్కలు తక్కువైనా, మోసపు తీవ్రత మాత్రం తక్కువ కాలేదు. కస్తూరి అండ్ కో 88 లక్షలే అయినా, తిరిగి దానికదే పెరిగి సంవత్సరాల మీద సంవత్సరాలు దందాను నడిపింది. సరికొత్తగా శ్రీకాళహస్తి పరిధిలో భైరవ ఎంటర్ప్రైజెస్ 85 లక్షలు, ఏ ఎల్ ఎఫ్ ఇంజినీరింగ్ 77 లక్షలు జిఎస్టి రిటర్నుల పేరుతో ఖజానాకు గండి కొట్టాయి.
ఈ మొత్తం లెక్కల్ని ఒక దగ్గర చేర్చితే తిరుపతి, చిత్తూరు, పాలమనేరు, గుడూరు, శ్రీకాళహస్తి ఈ ఐదు పట్టణాల నుంచే 118.70 కోట్లు గత ఐదేళ్లలో ఎన్జీపిటి పేరుతో మాయం అయ్యాయి. ఇటువంటి దందా ఏ జిల్లాలో జరిగినట్లు దాఖలాలు లేవు. ఇంతటి కుంభకోణం బయటపడినా, ఒక్క ఎఫ్ ఐ ఆర్ లేదు. ఒక్క అధికారి సస్పెండ్ కాలేదు. ఒక్క యజమాని అరెస్టు కాలేదు. దర్యాప్తు ప్రారంభమయ్యిందన్న మాట అధికార పూర్వకంగా లేదు. జిల్లాలో ఐదు సంవత్సరాలలో ఎంత మాత్రం నకిలీ రిటర్న్స్ పేరుతో సహా చేశారు అధికారులు జాబితాను రూపొందించారు. కేటుగాళ్లు ఇచ్చిన చిరునామాకు వెళ్లి అక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు లావాదేవీలు జరగలేదని చెప్పి ఈ కుంభకోణాన్ని అటకెక్కించడానికి జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

