చిత్తూరు జిల్లాలో మంగళవారం విస్తారంగా వర్షాలు
జీడి నెల్లూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు
కుప్పం నియోజకవర్గంలో అత్యల్ప వర్షపాతం
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు
చిత్తూరు, అక్టోబర్ 28 (ఆంధ్రప్రభ బ్యూరో): మెందా తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో మంగళవారం రోజంతా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధిక వర్షపాతం కార్వేటి నగరం మండలంలో 14.2 మిల్లీమీటర్లు నమోదు కాగా, దాని తరువాత శ్రీరంగరాజపురం, నగరి మండలాల్లో చెరువులు, వాగులు పొంగేంతగా వర్షం కురిసింది. వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కార్వేటి నగరం 14.2 మి.మీ., శ్రీరంగరాజపురం 12.6 మి.మీ., నగరి 12.6 మి.మీ., విజయపురం 12.6 మి.మీ., రోంపిచెర్ల 13.0 మి.మీ., నిండ్ర 11.6 మి.మీ., పూతలపట్టు 10.4 మి.మీ., పాలసముద్రం 9.8 మి.మీ., వెదురుకుప్పం 9.6 మి.మీ., తవణంపల్లి 8.4 మి.మీ., పెనుమూరు 8.6 మి.మీ., పులిచెర్ల 8.6 మి.మీ., సదం 7.8 మి.మీ., సోమల 6.0 మి.మీ., గంగాధరనెల్లూరు 5.2 మి.మీ., యాదమరి 5.2 మి.మీ., పెద్దపంజాణి 5.2 మి.మీ., చిత్తూరు అర్బన్ 3.2 మి.మీ., పలమనేరు 3.4 మి.మీ., గుడిపల్లి 2.6 మి.మీ., గంగవరం 2.6 మి.మీ., ఇరాల 3.0 మి.మీ.గా నమోదు అయ్యాయి. కుప్పం, రామకుప్పం, వెంకటగిరికోట, శాంతిపురం, బైరెడ్డిపల్లె మండలాల్లో వర్షం నమోదు కాలేదు. మొత్తం జిల్లావ్యాప్తంగా సగటు వర్షపాతం 6.0 మిల్లీమీటర్లుగా నమోదైంది.
*సోమవారం రాత్రి 6.9 మిల్లీమీటర్లు*
మెందా తుపాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో మంగళవారం పలు మండలాల్లో వర్షపాతం నమోదయింది. ఉదయం నుంచి ఆకాశం మబ్బులతో కమ్ముకొని కొన్ని ప్రాంతాల్లో చినుకులు, మరికొన్ని మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 6.9 మిల్లీమీటర్లుగా నమోదయింది.
జిల్లాలో అత్యధికంగా విజయపురం మండలంలో 26.0 మి.మీ., నిండ్రలో 25.6 మి.మీ., నగరిలో 22.6 మి.మీ., కార్వేటినగరం 12.8 మి.మీ., ఐరాలలో 11.6 మి.మీ., వెదురుకుప్పంలో 9.2 మి.మీ., పులిచెర్లలో 9.8 మి.మీ., శ్రీరంగరాజపురంలో 9.0 మి.మీ., వెంకటగిరికోటలో 9.0 మి.మీ. వర్షం పడింది.మరోవైపు గుడిపల్లె, చౌడేపల్లె మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. కుప్పం, రామకుప్పం, బంగారుపాలెం, యాదమరి, గూడిపాల, పాలసముద్రం, చిత్తూరు రూరల్, తవనంపల్లె, గంగవరం, సదం, పెనుమూరు, పుతలపట్టు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 32 మండలాల్లో వర్షపాతం నమోదవగా, పశ్చిమ ప్రాంతాలతో పోలిస్తే తూర్పు మండలాల్లో కొంత ఎక్కువ వర్షం పడింది. వాతావరణ శాఖ ప్రకారం తుపాన్ ప్రభావం కొనసాగుతున్నందున రానున్న 24 గంటల్లో కూడా జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో రానున్న 24 గంటల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

