6, అక్టోబర్ 2025, సోమవారం

అంబేద్కర్ విగ్రహం కాలిన కేసులో సర్పంచ్ గోవిందయ్య అరెస్టు






చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవళం పేట గ్రామంలో జరిగిన అంబేద్కర్ విగ్రహం కాల్చివేత కేసులో స్థానిక సర్పంచి గోవిందయ్యను పోలీసుల అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీ తుషార్ దూడి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టకపోయినా, పెట్టినట్లు సృష్టించి ఇరువర్గాలను రెచ్చగొట్టి తమ స్వార్ధ ప్రయోజనానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేసినందుకు గోవిందయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు పంపామని వివరించారు. అయితే కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, ఇంకా పలు విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. సొంత ప్రయోజనాల కోసం అల్లర్లను సృష్టించి శాంతి భద్రతలకు  విఘాతం కలుగాచేయడానికి గోవిందయ్య  ప్రయత్నం చేశారన్నారు. మూడవ తేదీ ఉదయం రెండు గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దేవళం పేట గ్రామంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 10 అడుగుల విగ్రహానికి ఆనుకుని ఉన్న టెంకాయ మట్టలతో నిర్మించిన ఒక షాపుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని ఎస్పీ తెలిపారు. ఫలితంగా అంబేద్కర్ విగ్రహానికి కూడా స్వల్పంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన తర్వాత రెండు గ్రూపుల మధ్య బలమైన విభేదాలను సృష్టించి, శాంతి భద్రతల సమస్య సృష్టించాలని ఉద్దేశంతో దేవళంపేటలో ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ విషయమై వెదురుకుప్పం పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా నేర స్థలాన్ని సందర్శించి అక్కడికి క్లూస్ టీం, డాగ్స్ స్వాడ్, ఎఫ్ఎస్ఎల్ టీంలను పిలిపించి కొన్ని నమూనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. దర్యాప్తు భాగంగా ఆ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ గోవిందయ్య అనే వ్యక్తి దేవలంపేట అంబేద్కర్ విగ్రహం ముందు టెంకాయ మట్టాలతో నిర్మించి, వ్యాపారం చేస్తున్న సులోచనమ్మ కు, ఆమె కూతురు మిన్నెలకు గత కొంతకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలిందన్నారు వారి వద్ద నుంచి గోవిందయ్య ఐదు లక్షల రూపాయలను కూడా తీసుకున్నట్లు తెలిసింది అన్నారు. కొట్టుకు నిప్పు అంటుకోగానే వారు గోవిందయ్యకు తెలియజేశారని, గోవిందయ్య వచ్చి ఈ విషయాన్ని తాను అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటించినట్లు సృష్టిస్తారని వారితో అన్నట్లు తెలిపారు. తర్వాత వారికి తన హయాంలోనే పక్క దుకాణాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారని తెలిసిందన్నారు. సంఘటన రెండు గంటల ప్రాంతంలో జరగగా, రెండు గంటల ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. విగ్రహం దగ్గర కొట్టు నడుపుతున్న వారికి  లబ్ది సేకూర్చాలని కుట్ర పన్నినట్లు తెలిసిందన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన నిప్పును ప్రతిపనికి తనకు అడ్డు వస్తున్నాడని సతీష్ నాయుడు అనే వ్యక్తి మీదికి ఆ నేరాన్ని తోసి, స్వలాభం పొందాలని భావించారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఉపయోగించుకొని తన శత్రువు అయిన సతీష్ నాయుడును రాజకీయంగా దెబ్బతీయాలని గోవిందయ్యతో సన్నిహితంగా ఉంటున్న సులోచనమ్మ మిన్నెలతో సమాలోచనలు జరిపినట్లు తేలిందన్నారు.  కుట్ర పన్ని, శతి భద్రతలకు విఘాతం కలుగచేసినందుకు గోవిందయ్యను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ వివరించారు. అయితే అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్న దుకాణానికి ఎవరు నిప్పు పెట్టారో తెలియాల్సి ఉందన్నారు. అలాగే దుకాణానిక అంటుకున్న నిప్పును అంబేద్కర్ విగ్రహం వైపు మళ్ళించి, విగ్రహం కాలునట్లు చేసిన వారి గురించి కూడా దర్యాప్తు జరుగుతోందని వివరించారు. తదుపరి వివరాలు దర్యాప్తులో తేలిన తర్వాత వివరిస్తామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో  అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ రాజశేఖర్ రాజు, నగరి డిఎస్పి అహ్మద్ అజీజ్, కార్వేటి నగరం సిఐ హనుమంతప్ప పాల్గొన్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *