25, అక్టోబర్ 2025, శనివారం

ఒకనాడు బావకు వీరవిదేయుడు నేడు హంతకుడు

బావ కోసం ఇంజనీర్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు 

బావ కళ్ళలో అనందం కోసం సికే బాబు మీద హత్యాయత్నం 

నేడు బావను, అత్తను హత్య చేసిన నేరస్తుడు 

చింటూ అనే చంద్రశేఖర్ నేర ప్రస్థానం 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

 

చింటూ అలియాస్ చంద్రశేఖర్ మెరైన్ ఇంజనీర్. ఆయన స్వయానా మృతుడు కటారి మోహన్ మేనత్త కొడుకు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కటారి మోహన్ కు అన్యాయం జరిగిందని, ఆయన మీద అక్రమకేసులు పెట్టి  వేధిస్తున్నారని చింటూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన బావ కటారి మోహన్ కళ్ళలో ఆనందాన్ని చూడడానికి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మీద రెండు మార్లు హత్యాయత్నం చేశారు. ఒకసారి పలమనేరు రోడ్డులోని చిత్తూరు క్లబ్ వద్ద బీహార్ కి చెందిన వ్యక్తులు సీకే బాబు మీద కాల్పులు జరిపారు. ఆ కాల్పులు సికే బాబు తృటిలో తప్పించుకున్నారు. ఆ కాల్పుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. ఆ ప్రయోగం విఫలం కావడంతో మరోమారు కట్టమంచి సాయిబాబా గుడి నుంచి సీకే బాబు ఇంటికి వెళ్లే దారిలో బాంబు పెట్టాడు. బాంబు పేలిన సంఘటనలో కూడా సీకే బాబు సురక్షితంగా బయటపడ్డారు. ఈ రెండు కేసులు కటారి మోహన్, చింటూ మీద నమోదయ్యాయి. పోలీసులు నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కటారి మోహన్, చింటూ చాలాకాలం అజ్ఞాతంలో గడిపారు. అప్పట్లో తాలూకా స్టేషన్ సిఐగా ఉన్న రవి మనోహర్ ఆచారి చేకచక్యంగా వీరిని అరెస్టు చేశారు. అనంతరం బెయిలు  మీద బయటకు వచ్చారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కటారి మోహన్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు అయ్యారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన స్థానిక ఎన్నికలలో చిత్తూరు మున్సిపాలిటీ బాధ్యతలను తీసుకున్నారు. ఆయనకు చేదోడు వాదోడుగా చింటూ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. ఫలితంగా చిత్తూరు మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మున్సిపల్ మేయర్ పదవిని బీసీ మహిళలకు కేటాయించడంతో కటారి మోహన్ సతీమణి కటారి అనురాధా మున్సిపల్ మేయర్ అయ్యారు. అప్పటి వరకు కటారి మోహన్ కు చింటూకు సంబంధాలు బాగానే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరువురి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. మున్సిపాలిటీ కాంట్రాక్టు పనులు ఇవ్వడం, కూరగాయల మార్కెట్ టెండర్లు, క్వారీలు తదితర ఆర్థిక విషయాలలో ఇరువురికి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో మున్సిపల్ కూరగాయల మార్కెట్ కాంట్రాక్టర్ గా ఉన్న ప్రసన్న వర్గానికి, చింటూ వర్గానికి గొడవలు జరిగాయి. ఈ గొడవలలో కటారి మోహన్ ప్రసన్న వర్గానికి మద్దతు ఇవ్వడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాను చేస్తున్న ఉద్యోగం, లక్షలాది రూపాయల జీతం వదిలి బావకు న్యాయం చేయడానికి కోసం చిత్తూరుకు వచ్చాడు. బావ కళ్ళల్లో ఆనందం చూడానికి  సీకే బాబు మీద రెండు పర్యాయాలు హత్యాయత్నం చేశారు. ఈ కేసుల్లో చింటూకు యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడింది. మున్సిపల్ ఎన్నికలలో ముందండి కార్పొరేటర్ల విజయానికి కృషి చేశాడు. ఇన్ని చేసిన, తన మాటకు విలువ ఇవ్వకపోవడంతో  కటారి మోహన్ ఆయన భార్య మున్సిపల్ మేయర్ కటారి అనురాధ  మీద ద్వేషం పెరిగింది. తన సహాయంతో అధికారంలోకి వచ్చిన వారు తనను తక్కువగా చూడడం సహించలేకపోయాడు. దీంతో వారి హత్యకు పధక రచన చేశాడు. అనుకున్న ప్రకారం 2015 నవంబర్ 17వ తేదీన తన పథకాన్ని అమలుపరచారని నిర్ణయించుకున్నాడు. ఆరోజు సోమవారం కావడంతో మేయర్ కటారి అనురాధ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఆమె భర్త కటారి మోహన్ కూడా పక్కనే ఉన్నారు. చింటూ తో పాటు మరో నలుగురు బురఖాల ధరించి మారణాయుధాలతో మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు గ్రీవెన్స్ డే కావడంతో మున్సిపల్ సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోలేదు. మేయర్ ఛాంబర్ లోకి వెళ్లి ఒక ఉదుటన మేయర్ దంపతుల మీద కాల్పులు జరిపారు.ఈ కాల్పులలో అక్కడికక్కడే మేయర్ అనురాధ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కటారి మోహన్ ను చికిత్స నిమిత్తం వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కూడా తుది శ్వాస విడిచారు. దీంతో ఇరువురిని ఒకేరోజు, ఒకే దగ్గర ఖననం చేశారు. తర్వాత గంగనపల్లి వార్డుకు  జరిగిన కార్పొరేటర్ ఉప ఎన్నికలలో కటారి అనురాధ కోడలు కటారి హేమలత కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత ఆమెను మేయర్ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీంతో కటారి అనురాధ వారసురాలిగా కటారి హేమలత మేయర్ పీఠం అధిష్టించారు. కటారి హేమలత భర్త కటారి ప్రవీణ్ కరోనా సమయంలో మృతి చెందారు. గత ఎన్నికలలో కటారి హేమలత చిత్తూరు ఎమ్మెల్యే టికెట్లు ఆశించారు. ఊహించిన విధంగా చిత్తూరు టికెట్టు గురజాల జగన్మోహన్ కు కేటాయించడంతో, కటారి హేమలతను చుడా చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. శుక్రవారం మేయర్ దంపతుల మధ్య కేసులు తీర్పు వెలువడింది. ఈ విషయమై చుడా మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ న్యాయం గెలిచిందని అభిప్రాయపడ్డారు. తీర్పు వెలువడిన వెంటనే బెయిలు మీద ఉన్న చింటును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులుగా నిర్ధారణ ఐదు మందికి ఈనెల 27వ తారీఖున న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది.

గంగ 2 చింటూ

గంగ 3 కటారి హేమలత

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *