ఏడు జిల్లాలకు గ్యాస్ కష్టాలు మాయం
ఇక అడిగిన వెంటనే వంట గ్యాస్ సిలిందర్ డెలివరీ
పూతలపట్టులో ఐఓసీఎల్ బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం
ఏపిలో నాలుగు జిల్లాలకు పూతలపట్టు నుండి గ్యాస్ సరఫరా
తమిళనాడులో 2 జిల్లాలకు, కర్ణాటకలో 1 జిల్లాకు కూడా
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
మన రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు వంట గ్యాస్ సరఫరా కష్టాలు తీరనిన్నాయి. ఇక గ్యాస్ కోసం రెండు, మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అడిగిన వెంటనే డీలర్లు గ్యాస్ ను ఇళ్ళకు సరఫరా చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలకు ఇకనుంచి చిత్తూరు జిల్లా పూతలపట్టు నుంచి గ్యాస్ సరఫరా కానుంది. అలాగే తమిళనాడులో రెండు జిల్లాలకు, కర్ణాటకలో ఒక జిల్లాకు కూడా పూతలపట్టు నుంచి వంట గ్యాస్ సరఫరార్ అవుతుంది. పూతలపట్టు మండలం ఎర్ర చెరువు పల్లెలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించిన ఎల్పిజి బాట్లింగ్ యూనిట్ ను రెండు రోజుల కిందట దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, ఎర్ర చేను పల్లి గ్రామ పరిధిలో సుమారు రూ. 200 కోట్ల పెట్టుబడితో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎల్పిజి బాట్లింగ్ యూనిట్ ను నిర్మించింది. దీని వార్షిక సామర్థ్యం సుమారు 60,000 టన్నులు కాగా, రోజుకు సుమారు 20,000 సిలిండర్లు బాటిలింగ్ చేయగల సామర్థ్యం కలిగివుంది. ఈ ప్లాంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 4 జిల్లాలు, తమిళనాడు 2 జిల్లాలు, కర్ణాటకలో 1 జిల్లా మొత్తం 7 జిల్లాకు ఎల్ పి జీ సరఫరా చేయనుంది. ఇక్కడి నుండి సుమారు 7.2 లక్షల వినియోగదారులకు 80 ఎల్ పి జీ డిస్ట్రిబ్యూటర్లు ద్వారా పంపిణీ చేయాలని ప్రణాళికగా రూపొందించారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 130 మందికి ఉద్యోగులకు, అలాగే 80 ట్రక్ డ్రైవర్లుకి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమా రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లావాసులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. దీనితో పాటు ట్రాన్స్‌పోర్ట్, సిలిండర్ మెంటెనెన్స్, సెక్యూరిటీ, మెటీరియల్ హ్యాండ్లింగ్ వంటి రంగాల్లో స్థానిక వ్యాపారులు కూడా లాభపడనున్నారు. భవిష్యత్తులో ఈ ప్లాంట్ ను మరో రూ. 400 కోట్ల వ్యయంతో ఈ బాట్లింగ్ ప్లాంట్ ను విస్తరించే అవకాశం ఉంది. రోజుకు 60 వేల కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లను నింపే సామర్థ్యంతో ఈ ప్లాంట్ రూపుదిద్దుకోనుంది. గురువారం పూతలపట్టు మండలం పాటూరు గ్రామం ఎర్ర చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఐ ఓ సి ఎల్ బాట్లింగ్ ప్లాంట్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు నుండి వర్చువల్ గా ప్రారంభించగా, జిల్లాలో బాట్లింగ్ ప్లాంట్ నుండి చిత్తూరు ఎం పి తో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే కే. మురళిమోహన్, ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పియూష్ మిట్టల్, సీనియర్ ఇండియన్ ఆయిల్ అధికారులు, ఎల్పీజీ పంపిణీదారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు చిత్తూరు ప్లాంట్ ప్రాంగణంలో ఒక పెద్ద ఎల్ ఇడి వీడియో వాల్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎం పి దగ్గుమళ్ళ ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రజల జీవన విధానంలో వంట గ్యాస్ ఒక భాగంగా ఉందని, వినియోగదారులకు గ్యాస్ సరఫరాను మెరుగు పరచే విధంగా ఐ ఓ సి ఎల్ బాట్లింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గతంలో గ్యాస్ బుక్ చేసుకున్న రెండు లేక మూడు రోజులలో గ్యాస్ డెలివరీ అయ్యేదని, ఈ ప్లాంట్ నెలకొల్పిన అనంతరం గరిష్టంగా 24 గంట ల లోపు గ్యాస్ డెలివరీ అయ్యే అవకాశం ఉందన్నారు. గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు తో పూతలపట్టు మండలం అభివృద్ధి చెందడం తో పాటు 130 మందికి ప్రత్యక్ష ఉపాధి, 80 ట్రక్ డ్రైవర్ లకు ఉపాధి కలుగుతుందన్నారు. బాట్లింగ్ ప్లాంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 4, తమిళనాడు లోని 2, కర్నాటక లోని ఒక జిల్లాకు గ్యాస్ సరఫరా అవుతుందన్నారు. ఈ గ్యాస్ ప్లాంట్ కు గ్యాస్ సరఫరా చెన్నై నుండి అందుతుందన్నారు. పూతలపట్టు ప్లాంట్ లో ఒక రోజులో ఒక షిఫ్ట్ లో 20 వేల వరకు సిలిండర్ లు రీఫిలింగ్ అవుతుందన్నారు. ఐ ఓ సి ఎల్ ప్లాంట్ ఏర్పాటు కు సహకరించిన ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐ ఓ సి ఎల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
గంగ 1 పూతలపట్టులో ఐ ఓ సి ఎల్ ప్లాంట్ ప్రారంభం సందర్భంగా జిల్లాజిల్లా కలెక్టర్, చిత్తూరు ఎంపి,పూతలపట్టు ఎమ్మెల్యే, ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫైల్ ఫోటో)

