10, అక్టోబర్ 2025, శుక్రవారం

అమానుష సంఘటనతో ఉల్కి పడ్డ జిల్లా

నిరసన, ప్రదర్శనలు దండాలతో దద్దరిల్లిన దేవళం పేట

కూటమి, వైసిపి నేతలు, దళిత సంఘాలు భారీగా మోహరింపు

హుటాహటిగా దేవళం పేట చేరుకున్న జిల్లా ఎస్పీ, కలెక్టర్ 

ఫోన్లో పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 

తొందరగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు

ప్రభుత్వం విగ్రహం ఏర్పాటు చేస్తుందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి


ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.


చిత్తూరు జిల్లా  గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురు కుప్పం మండలంలో అమానుష్య సంఘటనతో చిత్తూరు జిల్లా ఉల్కిపడింది.  దేవళం పేట ప్రధాన కూడలిలోని ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో  దళిత సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకియపార్టీలు నిర్ఘాంతపోయాయి. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని జిల్లావ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. మరో వైపు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగాయి. దేవళంపేట నిరసన ప్రదర్శనలతో, ధర్నాలతో దద్దరిల్లిపోయింది. అధికార ప్రతిపక్ష నాయకులు ఒకచోట చేరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే థామస్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్, నియోజకవర్గ జనసేన ఇంచార్జి మాల కార్పోరేషన్ డైరెక్టర్ యుగంధర్  అనుచరులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఆయన కుమార్తె నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి  కృపాలక్ష్మీ తన అనుచరులతో దేవళంపేట చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దళిత సంఘం నాయకులు కూడా చేరుకున్నారు. పోటాపోటిగా ఆందోళనలకు దిగారు. దేవళంపేటలో పరిస్థితి ఉద్విక్తతగా మారడంతో జిల్లా ఉన్నతాధికారులైన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. ఈ విషయం తెలియగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు పరిస్థితులను సమీక్షించారు. తొందరగా నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేసి నిందితులను గుర్తించాలని ఆదేశించారు. జాతీయనాయకులకు అవమానం జరగకుండా చూడాలన్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో అంబేడ్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న అంశంపై స్పందించిన మంత్రి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పందిస్తూ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఎస్పీ, కలెక్టర్ ఇప్పటికే సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారని, దోషులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత  అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.  సాయంత్రం లోపు  కొత్త అంబేద్కర్ విగ్రహాన్నిప్రభుత్వం తరపున  ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ మాట్లాడొద్దని కట్టడి చేశారు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆందోళనకారులను సముదాయించారు. మధ్యాహ్నం వరకు  దేవళం పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచి ఆందోళనతో అట్టుడుకిపోయింది. స్థానిక సర్పంచ్ చొక్కా గోవిందయ్య ఉదయం నుంచి ఆందోళనకు దిగారు. దేవళంపేటలో నిరసన ప్రదర్శన నిర్వహించి, ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాల్సిందిగా డి.ఎస్.పి., ఎస్.ఐ కాళ్లకు మొక్కారు. ఈ ఘటనను హేయమైన చర్యగా గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ఎంవి థామస్ వర్ణించారు దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ఇందులో కుట్ర కోణం దగుందన్నారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని జీడి నెల్లూరు వైసీపీ ఇన్చార్జి కృపా లక్ష్మి డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.  ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేవళం పేటకు దళిత సంఘాలు, దళితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ధర్నాతో ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, దళితులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించి దళితుల మనోభావాలను దెబ్బతీయాలని ఉద్దేశంతో ఈ అకృత్యానికి పాల్పడ్డారని దళితులు ఆరోపించారు. కొంతమంది కుల ద్రోహులు తమ కులాలను అడ్డుపెట్టుకొని. దళితులను దెబ్బతీయాలని ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని ఆవేశం వెళ్లగక్కారు. రాజకీయ పార్టీలకు అతీతంగా దోషులను వెంటనే అరెస్టు చేయాలని జీడీ నెల్లూరు దళితులు, బడుగు బలహీనవర్గాలు డిమాండ్ చేశాయి. దోషులను వెంటనే అరెస్టు చేసి తగిన బుద్ధి చెప్పాలని మన డీఎస్పీ, సీఐ, వెదురుకుప్పం ఎస్ఐకి అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఎం రవి విన్నివించారు. దోషులను శిక్షించాలని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి నేసనూరు మునిచంద్రా రెడ్డి కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం పై  చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు స్పందిస్తూ ప్రపంచ మేధావిని అవమానపరుస్తూ. ఆ మహనీయుని విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగలను గుర్తించి, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడొద్దని ఆయన పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ సంఘటనను జీడి నెల్లూరు సీనియర్ వైసీపీ లీడర్ డాక్టర్ గుమ్మడి కూతుహలమ్మ తనయుడు డాక్టర్ ఆనగంటి హరికృష్ణ  తీవ్రంగా ఖండించారు ,బాద్యులపై తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. విగ్రహానికి నిప్పుపెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ నూర్ బాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.జి. గఫూర్ డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు.  నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని జీడి నెల్లూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి మరకాల సుధాకర్ డిమాండ్ చేశారు. విగ్రహానికి  నిప్పు పెట్టడం హేయమైన చర్యగా పెనుమూరు  సీనియర్ టీడీపీ నాయకులు  తలారి నాగరాజ వర్ణించారు. ఈ పని చేసిన వ్యక్తులని చట్ట పరంగా శిక్షంచాలన్నారు.  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి తగలబెట్టడం చాలా బాధాకరమని, ఈ చర్యలను చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని బిజెపి జిల్లా అధ్యక్షులు యస్.జగదీశ్వర నాయుడు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా,ప్రజల్లో ఒక విధమైన భయాందోళనలు కలిగించే  ఇటువంటి చర్యలు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని చిత్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు.  నిరంతరం మహిళలపై దళితులపైన బడుగు బలహీన వర్గాల పైన దాడులు జరుగుతున్న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.  పార్టీలకతీతంగా ఇలాంటి ఘటనలపై పోలీసు అధికారుల నిష్పత్తిపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని, లేదంటే అంబేద్కరిస్టుల దాడి ఎలాగుంటదో రుచి చూపిస్తామని చిత్తూరు జిల్లా వైసిపి అధికారప్రతినిధి.డి.కొందండన్  అన్నారు. 






 

 





అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *