8, అక్టోబర్ 2025, బుధవారం

భూముల స్వాధీనానికి కదిలిన ఎండోమెంట్ అధికారులు

 


 ఆంధ్రప్రభ వార్తకు స్పందన 

పెనుమూరు రామాలయ ఆస్తుల పరిశీలన 

ఆక్రమణ భూములు స్వాదీనం చేసుకోవడానికి ప్రయత్నాలు 

తొలుత భూ రికార్డులలో ఆక్రమణదారుల పేర్లు తొలగింపు

చిత్తూరు, అక్టోబర్ 8 ఆంధ్రప్రభ బ్యూరో : గంగాధర నెల్లూరు నియోజకవర్గ పెనుమూరు మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఎండోమెంట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గత నెల 26వ తారీఖున 100 ఎకరాల ఆలయ భూముల అన్యాక్రాంతం అనే శీర్షికన ఆంధ్రప్రభ దినపత్రికలో వార్త ప్రచురితమైన విషయం పాఠకులకు విధిత్రమే. వార్త వచ్చిన రోజే దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఆలయ ఈవో వెంకటరాయులు పెనుమూరు వెళ్లి ఆక్రమణకు గురైన ఆలయ భూములను పరిశీలించారు. ఎమ్మార్వో కార్యాలయంలోని  కబ్జా రక్కసుల చెరలోని కోదండ రామయ్య భూములను, రికార్డులను తనిఖీ చేశారు. ఆసామి రామయ్య ఆస్తి 1ఏ రికార్డులో ఇతరుల పేర్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ భూముల  ఆసామిగా కోదండరామయ్య పేరు మార్చి నివేదిక తయారు చేసి కలెక్టర్ కు సమర్పించాలని తాహసీల్దారును దేవాదాయ శాఖ అధికారులు కోరారు. ఆ రికార్డుల నకళ్ళను సేకరించారు. ఆ రికార్డులలో రాములోరి 99 ఎకరాల భూములు ఇతరుల ఆధీనంలె ఉన్నట్లు 1ఏలో నమోదు కావటాన్ని గుర్తించారు.ఆక్రమణ స్థలంలో కొంత స్మశానం ఉండగా, మరికొందరు పక్కా ఇళ్ళను నిర్మించుకున్నారు. ఇంకొందరు బోర్లు వేసి, వ్యవసాయం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం తొలుత శ్రీ కోదండ రామస్వామి పేరు ఉండగా తరువాత ఆక్రమణదారుడి పేరిట మారింది. ఈ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి 1ఏలో ఆక్రమణదారుల పేర్లను తొలగించి శ్రీ కోదండ రామస్వామి పేరును చేర్చాల్సిందిగా నివేదికను తయారుచేసి పెనుమూరు ఎమ్మార్వో ద్వారా జిల్లా కలెక్టర్ కు పంపించాలని నిర్ఱయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో వెంకటరాయులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రభలో వార్తకు స్పందించి ఆక్రమణదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవడానికి గట్టి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాతో ఈ భూములను స్వాధీనం చేసుకోవటానికి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *