8, అక్టోబర్ 2025, బుధవారం

గత ఎన్నికల్లో పెద్ద రెడ్డి కుటుంబం విజయ రహస్యం ఏమిటి?


సమీక్షలో ఆరా తీసిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి

కుటుంబ సభ్యులను గెలిపించుకోవడానికి టిడిపితో చేతులు కలిపారని ఆరోపణలు 

జగన్ కు, పెద్దిరెడ్డి కుటుంబానికి దూరం పెరుగుతోందని ప్రచారం 

మిథున్ రెడ్డి అరెస్టు అయిన పరామర్శించని జగన్


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాజకీయ చతురతపై రాష్ట్ర రాజకీయ వర్గాలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయనను వైసిపి అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దూరం పెట్టారని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్ కలవడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన బెయిల్ మీద విడుదల అయిన తర్వాత కూడా కలవలేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రామచంద్రార రెడ్డి కూడా జగన్ కు దూరంగా ఉంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే ఎలా విజయం సాధించారనే అనుమానం జగన్ ను పట్టిపీడిస్తున్నట్లు తెలుస్తోంది. కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడిస్తామని ప్రతిిజ్ఞ చేసినా, ఆయన విజయాన్ని అడ్డుకోలేకపోయారు. 9వ సారి చంద్రబాబు ఎమ్మెల్యేేగా విజయంం సాధించి ముఖ్యమంత్రిి అధిిరోహించారు. చంద్రగిరి, నగరిి నియోజక వర్గాలలో ఒక వర్గం వైైసీపి అభ్యర్థులను ఓడించడానికి కృషి చేశారన్న విమర్శలు లేకపోలేదు. స్థాానిక నేతలతో కుమ్మక్కై తన కుటుంబ సభ్యులను మాత్రమే గెలిపించుకున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

మొలకల చెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం సీజ్ చేసిన తరువాత తంబళ్లపల్లె ఇంచార్జి దాసరపల్లె జయచంద్రా రెడ్డిని టిడిపి అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు మరో టిడిపి నేత సురేంద్ర నాయుడును సస్పెండ్ చేసినప్పటికీ జయచంద్రా రెడ్డి వ్యవహారం కీలకంగా మారింది. అప్పటిలో ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను కాదని రామచంద్రా రెడ్డి సన్నిహితునికి తంబళ్లపల్లె టిడిపి టిక్కెట్టు ఇచ్చారు. జయచంద్రా రెడ్డి విదేశాలలో పెద్దిరెడ్డి వ్యాపారాలు నిర్వహిస్తుంటారని ఆరోపించారు. అయినా, ఆయనకు టిక్కెట్టు ఇచ్చారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయకుండా ఆయన ఓడిపోయి పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాథ రెడ్డి గెలుపునకు దోహదపడ్డారని పెద్ద ఎత్తున విమర్శలు చోటు చేసుకున్నాయి. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న రాజంపేట పార్లమెంటు నియోజక వర్గంలో కూటమి బలపరచిన బిజెపి అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పోటీ పెట్టారు. దీనివల్ల పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గెలుపు సులభం అయ్యింది. హ్యాట్రిక్ కొట్టారు. పుంగనూరు నియోజక వర్గంలో చల్లా రామచంద్రా రెడ్డి బలహీన అభ్యర్థి అని సర్వే రిపోర్టులు వచ్చాయి. అప్పటిలో నియోజక వర్గం పరిశీలకునిగా ఉన్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఇచ్చిన రిపోర్టులో అమరనాథ రెడ్డి లేదా అనీషా రెడ్డిలో ఒకరికి ఇవ్వడం మంచిదని పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చల్లా రామచంద్రా రెడ్డికి రామచంద్రా రెడ్డితో సంబంధం ఉన్నందున తాను పరిశీలకునిగా కొనసాగలేనని తప్పుకున్నారు. అయినా పట్టించుకోకుండా ఆయనకే టిడిపి టిక్కెట్టు ఇచ్చారు. దీనితో పెద్దిరెడ్డి పుంగనూరు నుండి కూడా హ్యాట్రిక్ కొట్టారు. అప్పట్లోనే పుంగనూరు రామచంద్ర యాదవ్ టిడిపి పెద్దలు, రామచంద్రా రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. ములకలచెరువు కల్తీ మద్యం వ్యవహారం బయట పడిన తరువాత టిడిపి సీనియర్ నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా  మీ కుటుంబ సభ్యులు మాత్రమే గెలిచారు, ఆ కిటుకేంటో అందరికీ చెప్పి ఉండవచ్చు కదన్నా అని ఎన్నికల ఫలితాల తర్వాత ఓ సమావేశంలో పెద్దిరెడ్డినీ ఉద్దేశించి జగన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు మీడియాలో వచ్చింది. వారు మాత్రమే ఎలా గెలిచారు.. అన్న అనుమానం ఆయనను పట్టి పీడిస్తోంది. వారు టీడీపీతో కుమ్మక్కయి జిల్లాలో వైసీపీని బలి చేశారని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆయన అనుమానాలకు బలం చేకూర్చేలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జ్ పెద్దిరెడ్డి అనుచరుడు తంబళ్లపల్లె నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేశాడు. ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరాడు. కానీ గెలవాల్సిన సీటును పోగొట్టారని ఆ తర్వాత చంద్రబాబు ఫైర్ అయ్యారు. నిజమే ఆయన పెద్దిరెడ్డి సోదరుడి కోసం ఓడిపోయారు. ఈ విషయం ఇప్పుడు స్పష్టతకు వస్తోంది. అయితే ఇదంతా పెద్దిరెడ్డి ఆడిన గేమ్ అని.. తంబళ్లపల్లె, పుంగనూరు, రాజంపేటఎంపీ స్థానాల్లో గెలవాడానికి మిగతా చిత్తూరు మొత్తం.. అలాగే తాను ఇంచార్జ్ గా చేసిన అనంతపురం జిల్లా మొత్తాన్ని పెద్దిరెడ్డి టీడీపీకి సరెండర్ చేశారన్న అనుమానాలు జగన్ లో పెరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మొదట పెద్దిరెడ్డినే ప్రకటించారు. కానీ తర్వాత మార్చేశారు. భూమనకు ఇచ్చారు. అప్పటి నుంచి పెద్దిరెడ్డి పెద్దగా కనిపించడం లేదు. ఆయనపై చాలా కేసుల్లో విచారణలు సరిగ్గా జరగడం లేదు. అందర్నీ అరెస్టు చేస్తున్నా పెద్దిరెడ్డిని మాత్రం పట్టించుకోలేదు. ఈ అంశంపై టీడీపీలోనూ అనుమానాలు ఉన్నాయి. ఇక జగన్ రెడ్డికి రాకుండా ఉంటాయా?. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా, జగన్ పట్టించుకోలేదు. రిలీజ్ అయినా పట్టించుకోలేదు. దానికి తోడు ఇప్పుడు ఆయనను కేంద్రం అమెరికా పంపుతోంది. ఇదంతా జగన్ లో మరిన్ని అనుమానాలు పెంచుతున్నాయి. పూర్తిగా ఆ కుటుంబాన్ని దూరం పెట్టాడానికి కారణం అవుతున్నాయి. కాగా తాజాగా ఐక్యరాజ్య సమితిలో జరిగే సమావేశానికి బిజెపి ఎంపీ పురంధేశ్వరి జట్టులో ఎపి నుంచి మిథున్ రెడ్డికి అవకాశం కల్పించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. లిక్కర్ స్కాంలో 71 రోజులు జైళ్లో ఉండి బెయిలుపై వచ్చిన ఆయనకు అవకాశం కల్పించడం వెనుకు బిజెపి, టిడిపి పెద్దల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *