14, అక్టోబర్ 2025, మంగళవారం

మూడు మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వ రాయితీలు నిలుపుదల

మామిడి రైతులకు రూ. 4 ప్రభుత్వ సబ్సిడీ విడుదల  


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: మామిడి సీజన్ లో  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా రైతులను ఇబ్బంది పెట్టిన చిత్తూరు జిల్లాలోని మూడు మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం నుంచి అందే రాయితీలను నిలుపుదల చేస్తూ  జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా కలెక్టర్ అద్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ  సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయదారులకు సహకరించని మూడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమలకు ప్రభుత్వం అందించే రాయితీలు నిలుపుదల చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మామిడి సీజన్ లో ఆ మూడు ఫ్యాక్టరీలు జిల్లా యంత్రాంగానికి రైతులకు ఏమాత్రం సహకరించలేదని జిల్లా కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కొన్ని ఫాక్టరీలు రైతులకు పర్మిట్లను జారీ చేయడంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రైతులకు మద్దతు ధర కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించి ఐదు రూపాయల కన్నా తక్కువగా రైతులకు చెల్లిస్తున్నారు. మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు రైతులకు ఎనిమిది రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ఫ్యాక్టరీ యజమానులతో నేరుగా సమావేశం కోరారు. జిల్లాలో ఏ ఫ్యాక్టరీ కూడా రైతులకు ఎనిమిది రూపాయలు చెల్లించలేదు. చివరకు ఆరు రూపాయలు అయినా చెల్లించాలని అనధికారికంగా ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని కూడా పలు ఫ్యాక్టరీలు పట్టించుకోలేదు. ఒక ఫ్యాక్టరీ అయితే తన పరిధిలోకి ప్రభుత్వ అధికారులు ప్రవేశించకూడదని జిల్లా కలెక్టర్ కు  లీగల్ నోటీసులు జారీ చేసింది. వీటి పర్యవసానంగా జిల్లాలోని మూడు ఫ్యాక్టరీలకు తొలి విడత ప్రభుత్వ రాయితీలను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. 

*మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీ విడుదల*

మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలోని 31,929 మంది రైతుల ఖాతాలకు రూ.146.84 కోట్లు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. మంగళవారం రైతుల బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వ సబ్సిడీ మొత్తాలు జమ అయ్యాయి. మామిడి రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 సబ్సిడీ ప్రకటించింది. ఈ ప్రకారం జిల్లాలో 31,929 మంది రైతులకు సంబంధించి 3.67 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికి రూ.146.84 కోట్లను డిబిటి పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశారు. ఇందులో బంగారుపాలెం మండలానికి చెందిన రైతులకు ఎక్కువ మొత్తం జమ అయ్యింది. జిల్లాలో 20 వేల మందికి పైగా రైతులకు లక్ష రూపాయలకు మించి సబ్సిడీ జమ అయ్యింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో లేని విధంగా మామిడి రైతులకు సబ్సిడీ, మద్ధతు ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించింది.  ఈ–క్రాప్ బుకింగ్, క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం సబ్సిడీ పరంగా ఖచ్చితమైన నిర్ధారణకువచ్చారు. అర్హత కలిగి నగదు జమ కాని రైతులు అక్టోబర్ 30వ తేది వరకు తమ వినతులను ఆర్ ఎస్ కె, మండల, జిల్లా స్థాయి ఉద్యాన అధికారులకు సమర్పించవచ్చునని అధికారులు తెలిపారు. వారి అర్హతను 48 గంటలలో నిర్ధారించి, మొత్తాన్ని జమచేస్తామన్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *