25, అక్టోబర్ 2025, శనివారం

కోదండ రామునికి తిరుపతి వెంకన్న శటగోపురం

విలువైన స్థలంలో కళ్యాణ మండపం నిర్మాణం 

రామ్మయ్యకు అద్దె కూడా ఇవ్వని వైనం 

నిత్య పూజకు కూడా నోచుకోని రామయ్య  

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు. 

ఒకరి భూమిని మరొకరు కబ్జా చేస్తే కోర్టును ఆశ్రయిస్తారు. ఏ దిక్కూ లేకపోతే దేవుడే దిక్కు అనుకుంటారు. అయితే చిన్న చెప్పాను పెద్ద చేప మింగినట్లు  చిన్న దేవుని మాన్యం పెద్ద దేవుడు అక్రమించుకుంటే ఎవరికి చెప్పాలి అని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. అది కూడా ఇదే మండలానికి చెంది బి ఆర్ నాయుడు టిటిడి బోర్డు చైర్మన్ గా ఉండగా ఇలా జరగడంతో ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో పురాతనమైన కోదండ రామాలయం ఉంది. ఆలయానికి  చుట్టుపక్కల గ్రామాలలో వంద ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. అలాగే పెనుమూరు బస్టాండ్ వద్ద 1.15 ఎకరాల ఖరీదైన భూమి ఉంది. ఇందులో కొంత భాగాన్ని ఆక్రమించుకొని కొందరు వ్యక్తులు దుకాణాలను నిర్మించారు. కొంత స్థలంలో టిటిడి అధికారులు ఆధునిక హంగులతో కళ్యాణ మండపం నిర్మితున్నారు. అయితే, ఎవరు కూడా కోదండరామ స్వామికి అద్దెలు ఇవ్వకపోవడంతో ఆలయంలో నిత్యపూజలు కూడా జరగడం లేదు. భారీగా ఆస్తులు ఉన్న కారణంగా ఈ దేవునికి నిత్య దూప నైవేద్యం పధకం కూడా వర్తించలేదు.


పెనుమూరు బస్టాండు ఎదురుగా సర్వే నెంబర్ 502లో 50 కోట్ల విలువ గల 1.15 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఒక్క అడుగు  స్థలం రూ.15000 ధర పలుకుతోంది. ఇందులో 15 సెంట్ల భూమిలో పలుకుబడి కల కొందరు 40 ఏళ్ల క్రితం షాపులు కట్టుకున్నారు. మొదటిలో నెలకు కొంత మొత్తం ఆలయానికి ఇచ్చేవారు. రాను రాను పట్టించుకోవడం మానేశారు. రిజిస్ట్రార్ ఆఫీసులో అధికారులను ప్రలోభ పరచి క్రయ విక్రియాలు జరుపు కుంటున్నారు. రెండేళ్ల క్రితం వైసిపి పాలనలో మిగిలిన ఎకరం స్థలాన్ని టిటిడి వారు స్వాధీనం చేసుకుని అందులో కళ్యాణ మండపం కడుతున్నారు. గ్రామస్తులు అడ్డు పడినప్పటికీ అప్పటి డిప్యూటీ ఉపముఖ్యమంత్రి  కె నారాయణ స్వామి దగ్గర ఉండి, పోలీసుల రక్షణలో పునాదులు వేశారు.రూ. 40 కోట్లు భూమిని స్వాధీనం చేసుకున్న  వేంకటేశ్వర స్వామి దేవస్థానం ( టిటిడి ) అధికారులు కనీసం నాలుగు రూపాయలు కూడా కోదండ రామునికి ఇవ్వలేదు.  ప్రస్తుతం కోదండ రాముని గుడిలో దీపం పెట్టే దిక్కు కూడా లేదు. గతంలో ఒక పూజారి రోజూ దీపం పెట్టే వారు. ఇప్పుడు వారానికి ఒక సారి  దీపంతో నైవేద్యం పెడుతున్నారు. దీని దుస్థితిని మండల టిడిపి అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు, రాష్ట్ర లోకనాధ నాయుడు, జిల్లా నాయకుడు తలారి రెడ్డప్ప రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనితో ఆయన విచారణకు ఆదేశించారు. కాగా రైతుల ఆక్రమణలో ఉన్న భూములను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి, స్థానిక నేతలు రామకృష్ణ నాయుడు, విశ్వప్రకాశ్ నాయుడు పలు సార్లు అధికారులకు విజ్ఞప్తులు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. పెనుమూరు మండలానికి చెందిన బి ఆర్ నాయుడు ఇప్పుడు టిటిడి పాలకమండలి చైర్మన్ గా ఉన్నారు. ఆయన అయినా స్పందించి కోదండ రాముని కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండలంలోని కలికిరి కొండను స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి వారు రామాలయాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కోదండ రామాలయానికి పూర్వ వైభవం తీసుకుని రావడానికి కృషి చేస్తానని గ్రామానికి చెందిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి చెప్పారు.

గంగ 2 రామయ్య స్థలంలో నిర్మిస్తున్న టిటిడి కళ్యాణ మండపం 

గంగ 3 ప్రజలు ఆక్రమించుకొని నిర్మించిన దుకాణాలు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *