25, అక్టోబర్ 2025, శనివారం

గాల్లో దీపాలు బస్సు ప్రయాణాలు

గమ్యం చేరే వరకు గ్యారెంటీ లేని ప్రయాణాలు 
చిత్తూరు జిల్లాలో ఏడాది కాలంలో మూడు ప్రమాదాలు 
ప్రాణాలు కోల్పోయిన 36 మంది ప్రయాణికులు 
నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులు 
తనిఖీలకు తిలోధకాలిచ్చిన రవాణా శాఖ అధికారులు 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

బస్సులో ప్రయాణం అంటే భయం వేస్తుంది. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా ప్రమాద భరితంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రైవేటు ట్రావెల్ బస్సులలో యజమానులు నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు. అనుభవం లేని డ్రైవర్లు, కండిషన్ లేని వాహనాల వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల పలు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.  వాహనాలను నిత్యం తనిఖీ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారు. ఫలితంగా బస్సు ఎక్కితే సురక్షితంగా గమ్యస్థానం చేరుతామన్న గ్యారెంటీ లేకుండా పోయింది. అయినా ప్రయాణం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి. ఏడాది కాలంలో చిత్తూరు జిల్లాలో మూడు ఘోర ప్రమాదాలు జరిగాయి. ఆర్టీసీ అధికారులు తప్పులు దిద్దుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న, ప్రైవేటు ఆపరేటర్లు నిర్వహణ నిబంధనలు పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి.

గత ఏడాది కాలంలో చిత్తూరు జిల్లాలోజరిగిన  బస్ ప్రమాదాలు జరిగి 36 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలి ఘాట్ లో ప్రయాణికుల బస్సుపై లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 11 మంది మరణించారు. పుంగనూరు సమీపంలో కోల్లాపురం నుంచి చెన్నై వెళుతున్న ప్రైవేట్ బస్సుకు అగ్నిప్రమాదం జరిగి 6 మంది మరణించారు. చంద్రగిరి మండలం రామినాయుడి పాలెం ప్రమాదంలో 5 మంది మరణించారు. ట్రాఫిక్ పోలీసుల విశ్లేషణ ప్రకారం గత ఏడాది జరిగిన బస్ ప్రమాదాలకు ప్రధానంగా ఈ కారణాలు అతి వేగవంతం వలనే జరిగాయి.  డ్రైవర్ విశ్రాంతి లేకుండా నిద్ర సమయంలో కూడా వాహనాన్ని నడపడం,  ప్రమాదాలను ఎదుర్కోలేని అనుభవం లేకపోవడం,  రోడ్డులు సరిగా లేకపోవడం,  బ్రేకులు సర్తిగా పనిచేయకపోవడం,  టైర్లు విషయంలో నిర్వహణ లోపాల కారణంగా జరిగినట్లు తెలుస్తుంది. కావున ప్రైవేట్ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పని సరిగా కొన్ని అంశాలను పరిశీలించాలని, భద్రత విషయంలో రాజీ పడవద్దని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు.ముఖ్యంగా బస్సుల్లో ప్రమాదాలు జరిగితే బయట పడే మార్గాలున్నాయా లేవా అన్నది ముందే చూసుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెప్తున్నారు. బస్సు రేటింగ్, రివ్యూలు చూసుకోవడంతో పాటు బస్సెక్కిన తర్వాత ఆపరేటర్లు కల్పించాల్సిన కనీస సదుపాయాలు ఉన్నాయా లేవా చూసుకోవాలంటున్నారు. ఈ చిన్న చిన్న అంశాలే మన ప్రాణాలను రక్షిస్తాయంటున్నారు. ప్రధానంగా ఆయా ఆపరేటర్ల ట్రాక్  రికార్డును పరిశీలించాలి. మంచి రేటింగ్ఉన్న బస్సుల్లోనే ప్రయాణించాలి. అలాగే, టికెట్ బుక్చేసుకునే సమయంలో ప్రయాణికుడి ఫోన్ నెంబర్ మాత్రమే ఇస్తుంటారు. అలా కాకుండా తల్లితండ్రుల నెంబర్ ఇస్తే ప్రమాద సమయంలో బంధువులకు వెంటనే సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బస్సులో అతి ముఖ్యమైన ఎమర్జెన్సీ గేట్  ఎక్కడుందో చూసుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు దాన్ని బద్దలు కొట్టే సుత్తి ఉందో లేదో కూడా గమనించడం ముఖ్యం. ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఫైర్  సేఫ్టీ పరికరాలు ఉంటే తప్పించుకోవచ్చు. వీటివల్ల అగ్ని ప్రమాదం పెద్దగా కాకుండా అడ్డుకోవచ్చు. బస్సులో ఫైర్  సిలిండర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎ క్కడున్నాయో చూసుకోవాలి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నడిపే డ్రైవర్లపై ఒత్తిడి ఉంటుంది. ప్రయాణికులను సరైన సమయంలో గమ్యం చేర్చాలన్న ప్రెషర్  ఒకటైతే, ఇతర బస్సు ఆపరేటర్లతో ఉన్న పోటీ కారణంగా బస్సును వేగంగా నడుపుతారు.  దీనికి తోడు ఇంకొందరు డ్రైవర్లు రాంగ్ డ్రైవింగ్  చేస్తుంటారు. ఎదుట, పక్కన వెళ్లే వాహనాలను ఢీకొడతారా అన్న రేంజ్లో వీరి డ్రైవింగ్ ఉం టుంది. ఇలాంటి పరిస్థితిలో  డయల్ 100కు గాని, సదరు ట్రావెల్స్కు చెందిన హెల్ప్ లైన్ నెంబర్ కు గాని కాల్చేసి చెప్తే ప్రయోజనం ఉంటుంది.  ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని బస్సులు తయారు చేసే సంస్థలు స్పీడ్ కంట్రోల్ డివైజ్లను అమర్చేవి. కొన్నేండ్ల పాటు ఇది కొనసాగినా రాను రాను తీసేశారు. దీంతో రాష్ట్రంలో స్పీడ్ మీద ఏ విధమైన నియంత్రణ లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లోని బస్సులు ఎక్స్‌ప్రెస్‌ వేలపై గంటకు 100 కిలోమీటర్లు, 4-లేన్ హైవేలపై గంటకు 90 కిలోమీటర్లు, మున్సిపల్పరిధిలోకి వచ్చే రోడ్లపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. కానీ, ట్రావెల్స్  డ్రైవర్లు ఎక్కడా తగ్గడం లేదు. మొదటి నుంచి చివరి వరకు ఒకటే స్పీడ్. ఈ స్పీడ్ కారణంగా  ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కర్నూలులో తాజాగా జరిగిన ప్రమాదం నేపథ్యంలో తెలంగాణలోనూ స్పీడ్ గవర్నర్ డివైజ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. లగ్జరీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఏసీ ప్రయాణాన్ని కోరుకుంటున్నారు. పలు సందర్భాల్లో ఈ ఏసీ బస్సులే ప్రమాదాలకు కారణమవుతున్నాయని, ఎక్కువగా ప్రాణనష్టం సంభవిస్తోందని అధికారులు చెప్తున్నారు. ఒక బస్సు 10 నుంచి 15 గంటలు ఏకధాటిగా ఏసీని ఆపకుండా నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఎందుకంటే కంప్రెషర్, కూలింగ్ ఫ్యాన్లు, ఆల్టర్నేటర్ వంటి భాగాలు ఓవర్‌లోడ్ అవుతాయని, విద్యుత్ కనెక్షన్లు బలహీనపడతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఏసీ బస్సుల్లో మంటలు ఎక్కువగా వ్యాపిస్తాయంటున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆపరేటర్లంతా ఎక్కువగా ఏసీ బస్సులనే నడుపుతున్నారు. వీటి అత్యధిక వేగం, వేగంగా బ్రేకులు వేసినప్పుడు కలిగే అధిక యాంత్రిక ఒత్తిడి వల్ల వైరింగ్ లూజ్ అవుతాయంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగితే మంటలు వ్యాప్తి చెంది నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు. బస్సును ఎంచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సుఖమయంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *