5, అక్టోబర్ 2025, ఆదివారం

భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు


 


శుక్రవారం రాత్రి జిల్లావ్యాప్తంగా భారీ వర్షం నమోదయింది. జిల్లాలో అత్యధికంగా సదం మండలంలో 126.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుగా, విజయపురం మండలంలో మాత్రం వర్షం పడలేదు. జిల్లా సగటున  59.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. శుక్రవారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి జిల్లాలో వంకలు, వాగులు పారుతున్నాయి. చిత్తూరు సమీపంలోని  కలవకుంట జలాశయంలో ఒక గేటు ఎత్తి, నీటిని కిందికి వదులుతున్నారు. కార్వేటి నగరం మండలం కృష్ణాపురం జలాశయం గేట్లను శనివారము రాత్రికి ఎత్తనున్నారు. భారీ వర్షాల కారణంగా తవణంపల్లి మండలం గాజులపల్లి బోయపల్లి మధ్య ఉన్న వాగు పొంగి పోర్లుతోంది.  నీటి ప్రభావం రోడ్డు మీద ప్రవహించడంతో చెర్లోపల్లి, గొల్లపల్లి గ్రామాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. అలాగే కాణిపాకం సమీపంలోని పుణ్యసముద్రం మధ్య ఉన్న వంకలో రాత్రి పడిన వర్షానికి వర్షపు నీరు బ్రిడ్జ మీద  ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రొంపిచర్ల మండలంలో 52.4 మిల్లీమీటర్లు, సదం 126.2, పులిచర్లలో 64.6, వెదురుకుప్పంలో 40.4, నిండ్రలో 64.2, విజయపురంలో 0, నగిరిలో 17.2, కార్వేటి నగరంలో 23.4, పెనుమూరులో 86.8, పూతలపట్టులో 96.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఐరాల మండలంలో 22.2, సోమలలో 70.4, చౌడేపల్లిలో 20.2, పుంగనూరులో 28.4, పెద్దపంజాణి 108.2, గంగవరంలో 99.4, తవణంపల్లిలో 82.4, ఎస్ఆర్ పురంలో 72.4, జీడి నెల్లూరులో 83.6, చిత్తూరు రూరల్ లో 41, పలమనేరులో 102.2, బైరెడ్డిపల్లిలో 51.2, వెంకటగిరి కోటలో 58.4, శాంతిపురంలో 26.6, గుడిపల్లిలో 42.4, కుప్పంలో 30, రామకుప్పంలో 40.4, బంగారుపాలెంలో 88.4, యాదమరిలో 90.4, గుడిపాలలో 42.8 పాలసముద్రంలో, 56.4 చిత్తూరు అర్బన్ లో 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *