9, అక్టోబర్ 2025, గురువారం

జీడి నెల్లూరు నియోజకవర్గంలో మండల అధ్యక్షుల కోసం కసరత్తు

మండలాల వారిగా అధ్యక్ష అభ్యర్థిని ప్రతిపాదించిన అధిష్టానం 

ఆ పేర్లు ఆమోదమా, కాదా అంటూ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ 

మండల అధ్యక్షులు నియామకంలో పైచేయి సాధించన ఎమ్మెల్యే థామస్ 

ఎమ్మెల్యే మీద ఆరోపణలు విమర్శలను పట్టించుకోని అధిష్టానం

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు నియామకం మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టిని సారించింది శుక్రవారం ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పేరును ప్రతిపాదిస్తూ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మెసేజ్ పంపారు పార్టీ ప్రతిపాదించిన అధ్యక్షుడిని అంగీకరిస్తున్నారా లేక తిరస్కరిస్తున్నారా చేయాల్సిందిగా కోరారు మండలంలోని ఎక్కువమంది కార్యకర్తలు అధిష్టానం ప్రతిపాదించిన పేరును ఆమోదిస్తే అతనిని అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం ప్రకటించనుంది సగం కంటే ఎక్కువ మంది వ్యతిరేకిస్తే మరో అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించే అవకాశం ఉంది. నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులు ఎన్నికకు పరిశీలకులను నియమించి కసరత్తు చేసిన చివరకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ థామస్ ఇచ్చిన జాబితాన్ని అధిష్టానం కార్యకర్తల అభిప్రాయ సేకరణకు పంపడం విశేషం.

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షుల ఎన్నిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే థామస్ మండలానికి ఒక పేరును తొలినుంచి ప్రతిపాదిస్తున్నారు అయితే ఆయన వ్యతిరేక వర్గం ఆ పేర్లను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు పార్టీ నియమ నిబంధనలను పాటిస్తూ కొత్తవారికి అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య కు పలువురు ప్రత్యక్షంగా పరోక్షంగా ఫిర్యాదులు చేశారు స్థానిక ఎమ్మెల్యే మీద విమర్శలు ఆరోపణలు కుప్పించారు అయితే అధిష్టానం వాటినన్నిటిని పక్కన పెట్టింది ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థుల పేర్లే మండలంలోని పార్టీ కార్యకర్తలకు పంపి వారి ఆమోదాన్ని కోరింది ఈ మేరకు శుక్రవారం టిడిపి అధిష్టానం నుండి విడుదలైన అధికారిక మెసేజ్‌లలో ప్రతి మండలానికి ఒక్కొక్కరు మాత్రమే అధ్యక్షులుగా ప్రతిపాదిస్తున్నట్లు  సమాచారం అందింది. అభ్యర్థిని అంగీకరిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా అని ఓటింగ్ పద్ధతిలో అడిగి తెలుసుకుంటుంది. అయితే గతంలో నియోజకవర్గానికి 9 మంది పరిశీలకులను నియమించి మండలాల వారీగా వారి ద్వారా సమావేశాలు నిర్వహించి, స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఆ తరువాత కమిటీ ప్రతిపాదించిన కొన్ని పేర్లను అధిష్టానానికి పంపినట్లు తెలిసిందే. అయితే ఆ జాబితాను పక్కనపెట్టి, ఎమ్మెల్యే ఎం వి థామస్  స్వయంగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పేరును మాత్రమే అధిష్టానానికి ఫైనల్‌గా పంపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ పేర్లు, ఇప్పుడు అధికారికంగా ఆమోదం కోసం పంపిన పేర్లు ఒకటే ఉండటం గమనార్హం. మండలాల వారీగా  కార్వేటినగరంకు చెంగళలరాయ యాదవ్,  వెదురుకుప్పంకు మోహన్ మురళి,  ఎస్.ఆర్.పురంకు జయశంకర్ నాయుడు,  జి.డి.నెల్లూరుకు స్వామిదాసు,  పాలసముద్రంకు శివయ్య నాయుడు,  పెనుమూరుకు రుద్రయ్య నాయుడు టిడిపి అధ్యక్షుల నియామకాలకు ఈ పేర్లు అధికారికంగా టిడిపి కార్యకర్తలకు పంపిన లింక్‌ల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. లింక్‌ను ఓపెన్ చేస్తే, అంగీకరిస్తున్నాను లేదా వ్యతిరేకితున్నాను అనే ఆప్షన్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ విధంగా పార్టీ అధిష్టానం నేరుగా కార్యకర్తల నుంచి అభిప్రాయాన్ని సేకరించి అందుకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు అధిష్టానం ప్రతిపాదించిన అభ్యర్థిని ఎక్కువమంది అంగీకరిస్తే అతనే మండల పార్టీ అధ్యక్షుడిగా నియమితులవుతారు అలా కాకుండా ఎక్కువ మంది వ్యతిరేకిస్తే అధిష్టానం మరో పేరుతో మండల కార్యకర్తలు నుంచి అభిప్రాయాలను సేకరించే అవకాశం ఉంది పార్టీ అధిష్టానం మండల అధ్యక్ష పదవులకు పేర్లను ప్రతిపాదించడంతో ఒక వర్గం అనుకూలంగా కార్యకర్తలతో ఓటింగ్ వేయించడానికి మరొక వర్గం వ్యతిరేకంగా ఓటింగ్ వేయించడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *