భాజపాతో తెదేపా, జనసేన కలవకుండా జగన్ వ్యూహం
BJPతో పొత్తుకు TDP, జనసేన ఆశక్తి
TDP, జనసేనతో BJP కలవకుండా జగన్ వ్యూహం
8న విశాఖకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా
10న తిరుపతికి BJP అధ్యక్షుడు జేపీ నడ్డా
రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో పొత్తు రాజకీయాలు ప్రజల్లో ఆశక్తిని రేపుతున్నాయి. BJPతో పొత్తుకు TDP, జనసేన ఆశక్తి చూపుతున్నాయి. అయితే TDP, జనసేనతో BJP కలవకుండా జగన్ వ్యూహం అమలు చేస్తున్నారు. పొత్తు రాజకీయంలో భారీ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో YCP వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. జగన్ ను ఓడించాలంటే, పొత్తు ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇందుకు TDP, జనసేన, BJP కలిసి ఎన్నిక్సలలో పోటి చేయాలని భావిస్తున్నారు. జనసేన, BJP పొత్తు APలో కొనసాగుతుంది. పేరుకు పొత్తు ఉన్నా, ఎవరికీ వారె యమునా తీరే అన్నట్లు వ్యవహార శైలి ఉంది. జగన్ కు వ్యతిరేకంగా జనసేన, TDP పార్టీలు పొత్తుకు సిద్దమయ్యాయి. వీరితో పాటుగా బీజేపీని కలిసి రావాలని ప్రతిపాదిస్తున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. BJPని TDPతో కాలకుండా వ్యూహరచన చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పొత్తుల రాజకీయం వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి రానున్నారు.
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తయింది. దేశ వ్యాప్తంగా కేంద్ర మంత్రులు పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. కేంద్రం సాధించిన విజయాలను వివరిస్తున్నారు. అమలు చేస్తున్న పథకాల గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 8న విశాఖ రానున్నారు. నగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖ పైన ఈ సారి బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. గతంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన సమయంలోనూ భారీ బహిరంగ సభ నిర్వహించారు. అదే విధంగా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా 10వ తేదీన తిరుపతిలో జరిగే సభలో పాల్గొంటారు. ఇద్దరు నేతలు ఏపీలో పర్యటనకు రానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీతో పొత్తు గురించి జనసేనాని పవన్ కల్యాణ్ నేరుగా ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డాతో చర్చించారు. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగానే ఉన్నాయి. పొత్తుల వ్యవహారంలో అమిత్ షాది కీలక పాత్ర. ఏపీకి షా వస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ నేరుగా కలిసి ప్రతిపాదన చేస్తారా.. లేక నడ్డాతో సమావేశం అవుతారా అనేది తేలాల్సి ఉంది. ఢిల్లీ కేంద్రంగా కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ఏపీ సీఎం జగన్ కు ఇస్తున్న ప్రాధాన్యత చూసిన తరువాత ఇక టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసే అవకాశం లేదనే చర్చ వినిపిస్తోంది. ఆ విధంగానే బీజేపీ సంకేతాలు ఇస్తున్నట్లుగా టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. తాజాగా పార్టీ నేత సునీల్ థియెధర్ సైతం టీడీపీతో పొత్తు లేదని, జనసేనతోనే పొత్తు అని స్పష్టం చేసారు.
గతంలో ప్రధాని మోదీ విశాఖ వచ్చిన సమయంలో జనసేనాని కలిసారు. ఆ సమయంలోనే వచ్చే ఎన్నికలకు సంబంధించి రోడ్ మ్యాప్ పైన చర్చ జరిగింది. ఇప్పుడు అమిత్ షా వస్తున్న సమయంలో పవన్ కు అటువంటి ఆహ్వానం వస్తుందా లేదా.. నడ్డాతో సమావేశం ఉంటుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ నేతలు టీడీపీతో కలిసేందుకు సిద్దంగా లేని సమయంలో పవన్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. టీడీపీతోనే ముందుకు వెళ్తారనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత వారం సీఎం జగన్ ఢిల్లీలో అమిత్ షాతో సమావేశం... ఇప్పుడు ఏపీలో విశాఖలో అమిత్ షా పర్యటనతో.. ఏపీలో ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.