పురుషోత్తం నాయుడును వెంటనే అరెస్టు చేయాలి
పురుషోత్తం నాయుడును వెంటనే అరెస్టు చేయాలి
పూతలపట్టు పోలీస్ స్టేషన్ వద్ద CPM ధర్నా
పూతలపట్టు మండలం వడ్డేపల్లికు చెందిన పురుషోత్తం నాయుడు 20 మంది పేదలకు ఉద్యోగాలు ఇస్తామని 40 లక్షలు వసూలు చేసే ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన ఇతనిపై చర్యలు తీసుకోవాలని బాధితులతో కలిసి సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం పూతలపట్టు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేందన్, పూతలపట్టు కార్యదర్శి జ్యోతిలు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల ముందు చిన్న కలికిరిపల్లెకు చెందిన కూలీల వద్ద పురుషోత్తం నాయుడు ఇస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు. అప్పటినుంచి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతూ చివరికి బెదిరించే పని చేస్తున్నాడనీ, స్థానిక శాసనసభ్యులు సిఫార్సు లేఖ తో ఉద్యోగులు తీసిస్తానని మోసం చేస్తున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సర కాలంగా మోసం చేసిన అతని పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పట్టించుకోకపోవడంతో మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేశారు. స్థానిక శాసనసభ్యులు కూడా తన పేరును ఉపయోగించి మోసం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా కేసు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ధర్నా చేయాల్సి వస్తున్నదని తెలిపారు. పేదలంటే లెక్క జమా లేకుండా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాధ్యతలు మాట్లాడుతూ అప్పు చేసి లక్షల రూపాయలు ఇచ్చిన వాటికి వడ్డీ కట్టలేక కొద్దిపాటి ఆస్తిని కూడా అమ్ముకోవడం జరిగిందన్నారు. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు శరణమంటూ మీడియా ముందు వాపోయారు ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ధర్నా కార్యక్రమంలో బాధితులు పాల్గొన్నారు.