13, జూన్ 2023, మంగళవారం

మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి: TDP

మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

ఉద్యానవన శాఖ డి డి కి వినతి
 

           మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం టీడీపీ నేతలు ఉద్యానవన శాఖ డెప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. 

           ఈ సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ మాట్లాతూ.. టన్నుకు 19 రూపాయలు జిల్లా కలెక్టర్  ప్రకటించినా.. గుజ్జు పరిశ్రమలన్నీ కూడా సిండికేట్ గా తయారయ్యి టన్నుకి కనీసం 10,000 కూడా ఇవ్వకపోవడంతో మామిడి రైతులు దిగాలు పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంట దాదాపు 1.36 లక్షల ఎకరాల్లో మామిడి పంట విస్తరించి ఉందన్నారు. దాదాపు ఒక లక్షకు పైగా రైతులు మామిడి పంటపైన ఆధారపడి బతుకుతున్నారనీ, గుజ్జు పరిశ్రమలు సిండికేట్ గా ఏర్పడి రైతును ధగా చేస్తున్నాయని ఆరోపించారు. 

         సాక్షాత్తు జిల్లా కలెక్టర్  ఇచ్చిన హామీ కూడా దిక్కు లేకపోవడం చాలా విచారకరంగా వర్ణించారు. చిత్తూరు జిల్లాలో 13 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా.. ఒక ఎమ్మెల్యే కూడా మామిడి రైతుల కష్టాల గురించి పట్టించుకోకపోవడం చాలా విచారకరం అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, ఉద్యానవన శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్  స్పందించి ప్రతి రైతుకి టన్నుకి కనీసం 19000/- గిట్టుబాటు ధర కల్పించాలని తెలుగు దేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. 

            జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొండకిందపల్లి నాగరాజు నాయుడు, బయటపల్లె నాగరాజు, టిడిపి నాయకులు ముత్తు, తవణంపల్లి బీసీ సెల్ అధ్యక్షులు వినాయక, ఎస్సీ సెల్ నాయకుడు నాగరాజు, పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *