కిలో మామిడికి రూ.12 ఇవ్వాల్చిందే
* మామిడి కిలోకు రూ.12 ఇవ్వాల్చిందే
* తగ్గితే ఒప్పుకొనేది లేదు.
* ఫిర్యాదు వస్తే ఫ్యాక్టరీ సీజ్ చేస్తాం
* ఫ్యాక్టరీల సిండికేట్ ఒప్పుకోనేది లేదు
* రైతులకు అనుకూలంగా ప్రభుత్వం
* జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరిక
జిల్లాలో మామిడి రైతులకు మేలు చేసే రీతిలో తోతాపురి మామిడి పంటకు గిట్టుబాటు ధర దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోందని, ఒక కేజీ తోతాపురి మామిడి ధర రూ.12.00 గా నిర్ణయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో మామిడికి గిట్టుబాటు ధర పై సంబందిత అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ మామిడి సీజన్ లో జిల్లాలోని మామిడి ప్రాసెసింగ్ యూనిట్లకు ఇప్పటి వరకు మన జిల్లాతో పాటు సరిహద్దులోని రాష్ట్రాలు, జిల్లాల నుండి మామిడి పంటను దిగుమతి చేసుకోవడం జరిగేదన్నారు. వీటి ధర తక్కువగా, నాణ్యత కాస్త మెరుగ్గా ఉన్న కారణంగా గతంలో రెండు మార్లు తోతాపురి మామిడి పంటకు జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ధరలు స్థిరంగా కొనసాగించడం వీలుపడలేదని తెలిపారు. ప్రస్తుతం మన జిల్లా సరిహద్దులో ఉన్న ప్రాంతాలలో మామిడి పంట కోత పూర్తి అయ్యిందన్నారు. మన జిల్లాలో పంట దిగుబడి పూర్తిగా ఉన్నందున, మామిడి రైతులు, ఫ్యాక్టరీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
ట్రాన్స్ పోర్టేషన్ చార్జీలు కాక, ఒక కేజీ తోతాపురి మామిడి గిట్టుబాటి ధర రూ.12.00గా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిర్ణయించడం జరిగిందన్నారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను విడుదల చేశారు. గతంలో నిర్ణయించిన ధరలు అమలు కాలేదని తెలిసినా, ఇతర ప్రాంతాల నుండి కాయలు వస్తుండడంతో సడలింపు ఇచ్చామన్నారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుండి కాయలు రావడం లేదనీ, ఇక్కడి కాయలు బాగా ఫక్వానికి వచ్చాయని వివరించారు. జిల్లాలో 80 శాతం పంట పూర్తి అయ్యిందన్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి 25-30 రూపాయలు పలికిందన్నారు. అయిన ఫ్యాక్టరీలి సిండికేట్ అయి ధరలను నియంత్రణ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నియంత్రణను ఒప్పుకొనేది లేదన్నారు.
జూలై 1 నుండి ఈ ధరలు అమలులో ఉంటాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులను నియమించి ధరల అమలును పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. ఉల్లంఘించిన వారి ఫ్యాక్టరీ, మండీలను, ర్యాoప్ లను సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.