రేపటి నుంచి రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు.
రేపటి నుంచి రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు.
నైరుతీ రతుపవనాలు గతంలో అన్నట్టుగానే చాలా ఆలస్యం అయ్యింది. ఒక వైపున ఏమో ఎల్-నినో ప్రభావం తీవ్రంగా ఉండటం వలన రుతుపవనాలు ఆలస్యం అయ్యి, జూన్ 17 (నేడు రాత్రి) రాష్ట్రంలో ప్రవేశించనుంది.
కాబట్టి నేడు రాత్రి । అర్ధరాత్రి దక్షిణ ఆంధ్ర జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలను చూడగలము. కానీ రేపటి నుంచి వర్షాల జోరు మరింత పెరగనుంది. రేపు (జూన్ 18) తెల్ల్వారి నుంచి సాయంకాలం వరకు వేడిగా ఉండి, సాయంకాలానికి అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనుంది.
మరో వైపున ఈ వర్షాలు రాత్రి । అర్ధరాత్రికి కడప జిల్లాలోని పలు భాగాలు, చిత్తూరు జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు, తిరుపతి జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు కురవనుంది. అలాగే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని భాగాల్లో వర్షలను చూడగలము.
మిగిలిన భాగాల్లో
రాష్ట్రంలోని మిగిలిన భాగాల్లో నేడు, రేపు మొత్తం వేడిగా ఉంటుంది. నేడు మాత్రం ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీల వరకు ఉండనుంది. కానీ జూన్ 20 తర్వాత మాత్రం వర్షాలు మరింత జోరందుకోనుంది. కాని ప్రస్తుతానికి రానున్న మూడు రోజుల వరకు సాయంకాలం । రాత్రి వర్షాలు అక్కడక్కడ కొనసాగనుంది. దీని గురించి అప్డేట్ తర్వాత ఇస్తాను. తెలంగాన రాష్ట్రంలో జూన్ 22 న రుతుపవనాలు ప్రవేశించనుంది.