13, జూన్ 2023, మంగళవారం

అక్రమ సంబంధం వద్దు అన్నందుకు మహిళ హత్య

అక్రమ సంబంధం వద్దు అన్నందుకు మహిళ హత్య



      పిల్లలు పెద్దవారు అయ్యారు, ఒక అక్రమ సంబంధం వద్దు అన్నందుకు మహిళను హత్య చేసిన సంఘటన గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం మండలం, పచ్చికాపలం పంచాయతీ, దాసరి కాలనీ జరిగింది.  వివాహేతర సంబంధం ఇక వద్దన్నందుకు మహిళను కత్తితో పొడిచిన ప్రియుడు పరారీలో ఉన్నాడు.

వెదురు కుప్పం మండలం పచ్చికాపలం గ్రామం దాసరి కాలనీకి చెందిన గీత (28) రేణిగుంట కు చెందిన చంటి (35) తో గత 10 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.

గీత మొదటి భర్తకు కలిగిన ఇద్దరు పిల్లలతో దాసరి కాలనీలో జీవనం సాగిస్తోంది.

16 సంవత్సరాలు కలిగిన  పిల్లల ముందర వివాహేతర సంబంధం ఇక వద్దని గీత చంటికి హితవుపలికింది.

పెళ్లి కూడా చేసుకోకుండా తనను నమ్ముకుని రేణిగుంట నుంచి  పచ్చికాపలం వచ్చి జీవిస్తున్న నన్ను ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావని ప్రియుడు చంటి ఆగ్రహించాడు. అలా కుదరదని తెగేసి చెప్పాడు.

ఇద్దరి మధ్య వాగ్వాదం మాట మాట పెరిగి గీతను ప్రియుడు చంటి కత్తితో పొడిచి పరారయ్యాడు.

గాయపడిన గీతను  స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి  వెదురు కుప్పం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు చంటి పరారీలో ఉన్నాడు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *