చీటీల పేరుతో ఘరానా మోసం
* సిట్ పoడ్ కంపెనీ బోర్డ్ తిప్పేసిన నల్లసానిపల్లె శంకరయ్య
* 10 కోట్లతో ఉడాయిoచిన చీటీల వ్యాపారి
* రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ... క్యూ కడుతున్న బాధితులు
* ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రలలో ఎక్కువ సంఖ్యలో బాధితులు
చీటిల పేరుతో కొంత కాలం ప్రజలను నమ్మించడం, తరువాత బోర్డ్ తిప్పేయడం, పరారీ కావడం సాదారణంగా జరుగుతున్న సంఘటనలే. అయినా మోసపోవడం ప్రల వంతు. మోసం చేయడం మోసగాళ్ళ నైజం. ఇదే విషయం పలమనేరులో కూడా పునరావృతం అయ్యింది. నాలుగు చిటిలను నమ్మకంగా నడిపాడు. అదిక వడ్డీ చెల్లించాడు. అది నమ్మి పొలోమని జనాలు మళ్ళి చిటిలు ప్రారంభించారు. వాళ్ళ నమ్మకమే పెట్టుబడిగా రాత్రికి రాత్రే ఉదయించాడు. భాదితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్ళితే...
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, కీలపట్ల పంచాయతీ నల్లసానిపల్లె గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు శంకరయ్య పదేళ్లకు పైగా చిట్స్ నిర్వహించే వాడు. పలమనేరు బజారు వీధిలోని ఓ అద్దె గదిలో జ్యోతిశంకరయ్య పేరుతో చిట్ ఫండ్ కంపెనీ బోర్డ్ పెట్టాడు. ఇతని వద్ద ఇతర జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన చిట్టీలు కట్టినవాళ్ళు వంద మందికి పైగా ఉన్నారు. పలమనేరు, నల్లసానిపల్లి, తెట్టుమిట్ట, మేలుమాయి, గుండ్లపల్లి, బైరెడ్డిపల్లి, తదితర గ్రామాల్లో ప్రజల చేత లక్షలల్లో చిట్టీలు కట్టించుకొన్నారు. ఈయన చిట్టి వ్యాపారం ప్రారంభించిన కొత్తలో నాలుగు చిట్టీలు కట్టించుకోవడం అధిక వడ్డీతో తిరిగి చెల్లించడం లాంటిది చేయడంతో ప్రజలు బాగా నమ్మారు. ఆ తరువాత చిట్టీల డబ్బుతో గ్రామంలో దాదాపు రూ.50 లక్షలతో ఇంటి నిర్మాణం, పట్టణంలోని మారెమ్మ గుడి వీధిలో రూ. కోటికి పైగా వెచ్చించి చెప్పుల దుకాణం, పలు చోట్ల ఆస్తులు కూడేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ అస్థిలన్నింటిని బినామీ పేరిటా మర్చినట్లు సమాచారం. ఒక్కొక్కరికి10, 11, 6, 9 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉందని బాధితులు చెబుతున్నారు. ఆరు నెలలుగా చిట్టీ డబ్బు కోసం బాధితులు శంకరయ్య ఇంటి వద్దకు వెళ్లగా వాయిదాలు వేసుకొంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసుకోని కుటుంభంతో సహా పరారయ్యాడు. కొన్నాళ్ళు పాటు పలుచోట్ల గాలించిన బాధితులు అతని జాడ దొరక్కపోవడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయిoచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఎస్ ఐ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసు నమోదు చేసి శంకరయ్య కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.