కరెంటు చార్జీలు తగ్గించకపోతే విద్యుత్తు ఉద్యమం తప్పదు
కరెంటు చార్జీలు తగ్గించకపోతే విద్యుత్తు ఉద్యమం తప్పదు
సిపిఐ, సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శులు ఎస్ నాగరాజు, వాడ గంగరాజు హెచ్చరిక
విద్యుత్ చార్జీలను తగ్గించాలని, ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో వినియోగదారులపై భారం మోపడాన్ని ఉపసంహరించుకోవాలని CPI, CPM నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ రోడ్ లోని విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. సామాన్య మధ్య తరగతి ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజులు పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు గాంధీ రోడ్డులోని విద్యుత్తు ఈఈ కార్యాలయం వద్ద విద్యుత్ బిల్లులతో కరెంట్ షాక్ కరపత్రాలు వినియోగదారులతో కలిసి విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నాగరాజు గంగరాజు లు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సర్దుబాటు చార్జీల భారం పేరుతో ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వ మోపడం దారుణం అన్నారు. అప్పుల కోసం వైసీపీ ప్రభుత్వం కేంద్రం లోని మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచడం దారుణం అన్నా రు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పై ఆధాని కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఎందుకు డిమాండ్ చేయరని ప్రశ్నించారు. ప్రపంచంలో సోలార్ విద్యుత్ రేట్లు యూనిట్ కి రూపాయి 50 పైసలు పడిపోయిందని కానీ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీలు పెంచడం తగదన్నారు. విద్యుత్ బారాలపై సిపిఎం, సిపిఐ ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్య పరుస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అని విమర్శించిన సీఎం జగన్మోహన్ రెడ్డి బాదుడులో అందరిని మించిపోయారని విమర్శించారు. విద్యుత్ సంస్కరణలతో కార్పొరేట్ కంపెనీలు బాగుపడ్డాయని విద్యుత్తు రంగం నాశనం అయిందని ఫలితంగా ప్రజలపై తీవ్రమైన బారాలు పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గేంతవరకు మరో విద్యుత్ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కే సురేంద్రన్, బాలసుబ్రమణ్యం, సిపిఐ నాయకులు మణి, దాసరి చంద్ర, విజయ గౌరీ, రమాదేవి, జమ్మిలాబి, బాలాజీరావు, రఘ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ తగ్గించాలని కరెంట్ చార్జీలు తగ్గించాలని, ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో వినియోగదారులను దగా చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా 24వ తేదీన సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఎస్టియు కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.