పుంగనూరు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రేపు కొత్త రాజకీయ పార్టీ ప్రకటన
పుంగనూరు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రేపు కొత్త రాజకీయ పార్టీ ప్రకటన
భారత రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆదివారం పురుడుపోసుకోనుంది. విజయవాడలో ఆదివారం మాజీ ఐఏఎస్ అధికారి వి.జి.ఆర్ నారగోని, బీసీ నాయకులు అన్నా రామచంద్ర యాదవ్ లు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీలను ఐక్యం చేసే దిశగా ఈ పార్టీ నడవనుంది. ఇతర పార్టీల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు ఈ పార్టీ లోకి రానున్నారని భావిస్తున్నారు.
బహుజనుల హక్కుల కోసం నూతనంగా ఏర్పడే పార్టీ పని చేయనుంది. బీసీల నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఐక్యం చేయనున్నారు. వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంక్ గా ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని, రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని భావిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణ కోసం నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు.
బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం ఒకే పార్టీ, ఒకే జెండా ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. నూతన పార్టీ కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేస్తారు. వైసీపీ, టిడీపీలు బీసీలకు అన్యాయం చేశాయని వీరు భావిస్తున్నారు. ఆదివారం భారీ సభ ఏర్పాటు ఈ సభలోనే పార్టీ పేరు, అజెండాను ప్రకటిస్తారు.