8, జూన్ 2023, గురువారం

వారంలో మనకు వానలు

వారంలో మనకు ఋతుపవనాలు

చల్లపడనున్న  రాష్ట్రం

16 నుండి రోజూ వానలే       


                           ఎప్పుడప్పుడా అని వేచి చూస్తున్న రుతుపవనాలు వస్తున్నాయి. రుతుపవనాలు వారం రోజుల్లో  ఈ నెల 16 లేదా 17వ తేదీన  రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో మరో మూడురోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని బుధవారం హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం బలహీనపడిందని పేర్కొన్నది.  


             ఎండలతో మండతున్నవేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. లక్షద్వీప్‌, కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రుతువపనాల రాక వేళ గత 24 గంటలుగా కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో కేరళలోలని ఇతర ప్రాంతాలతో పాటుగా కర్ణాటక..తమిళనాడు మీదుగా ముందుకు కదలనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 19 నాట్ ల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నట్లు ఐఎండీ వివరించింది. ఈ ప్రభావంతో వారం రోజుల పాటు ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.


               వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. వాతావరణ శాఖ ( ఐఎండీ ) అధికారికంగా ఈ విషయాన్ని నిర్ధారించింది. అంచనా వేసిన దాని కంటే ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సారి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ప్రస్తుతం కేరళను తాకిన ఈ రుతుపవనాలు 16,17 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.


                     సాధారణంగా జూన్‌ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేస్తుంటాయి. అయితే వాతావరణ పరిస్థితుల ప్రతికూలత కారణంగా వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి వచ్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. గత ఏడాది మే 29న రుతుపవనాలు దేశంలోకి రాగా.. 2021 లో జూన్ 3న ప్రవేశించాయి. 2020లో జూన్ 1న తీరాన్ని తాకాయి. ఈ సారి సముద్రంపై ఎల్ నినో ప్రభావం కనిపిస్తున్నా..ఈ సీజన్ లో దేశంలో సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల రాక పైన వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది.


                    రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు , మెరుపులు, ఈదురు గాలులుతో (గాలి గంటకు 30 నుంచి 40 కి మీ వేగం) కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *