18, జూన్ 2023, ఆదివారం

మామిడికి గిట్టుబాటు ధర ఇవ్వాలి

 మామిడికి గిట్టుబాటు ధర ఇవ్వాలి
* బంగారు పాళ్యంలో  తెదేపా నిరసన
* రేపు చిత్తూరులో జిల్లా కలెక్టర్ కు వినతి


         మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ ఎదురుగా ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జ్ మురళీమోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కిలోకు 80 రూపాయల ధర నిర్ణయించాలని కోరారు.

         రైతులు మామిడి పరిశ్రమల యాజమాన్యులు దళారులు వ్యాపారులతో అత్యవసర సమావేశం నిర్వహించి రైతుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇప్పటివరకు మామిడికాయలు నేలరాలి పంట నష్టపోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

           మామిడి రైతులకు తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రేపు చిత్తూరులో కలెక్టర్ కు వినతి

          సోమవారం ఉదయము 10 గంటలకు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ లో స్పందన కార్యక్రమంలో పాల్గొనేందుకు మామిడి రైతులందరూ రావలసిందిగా భారతీయ జనతా పార్టీ నేత కొత్తూరు బాబు కోరారు.  మామిడికాయలకు ధరలు 19 రూపాయలు ఇస్తామని చెప్పి పది రూపాయల నుంచి 11 రూపాయలు ఇస్తూ  రైతులను మనోవేదన గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు సోదరులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మరో పర్యాయము ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు  తెలియచేసి,   గిట్టుబాటు ధర ఇవ్వకపోతే ప్రభుత్వమైన మిగిలిన పైకాన్ని రాయితీగా చెల్లించి, రైతులను ఆదుకోవాలని కోరడానికి సోమవారం మామిడి రైతులు అందరూ కలెక్టర్ ఆఫీస్‌కు రావాలని విజ్ఞప్తి చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *