20, అక్టోబర్ 2024, ఆదివారం

ట్రాక్టర్ లలోనూ ఉచిత ఇసుక తరలింపుకు అనుమతి

ఇప్పటి వరకు ఎడ్ల బండికి మాత్రమే అనుమతి  

ఇసుక రీచ్‌లలో సొంతంగా లోడ్ చేసుకోవచ్చు.

ఎవరి అనుమతి అవసరం లేదు 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ

రాష్ట్ర  ప్రభుత్వం ఇసుక వినియోగదారులకు  విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుతం ట్రాక్టర్లకూ అవకాశం కల్పిస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేసారు. స్థానిక అవసరాల నిమిత్తమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇసుక పాలసీలో సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రజలకు ఇసుక కొరత రావదన్న ఉద్దేశంతో స్థానిక అవసరాలకు వాడుకునేలా ప్రభుత్వం ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించింది. ఇసుక లభ్యత లేదన్న కారణంతో ఇంటి నిర్మాణాలు ఆగిపోరాదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వుల్లో తెలిపారు. స్థానిక అవసరాలకు సరిపడేంత మోతాదులో ఇసుక రవాణాకు అనుమతించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని, అవసరమైనవారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలోనూ రవాణా చేసుకోవచ్చని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. వ్యక్తిగత అవసరాలకు వాగులు, వంకల్లోని ఇసుకను ఉచితంగా తవ్వుకొని తీసుకువెళ్లడానికి అనుమతించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ విషయమై ముక్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ  'ఇసుకను ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేశాం. రాష్ట్రంలో అనేకచోట్ల వాగులు, వంకలు ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా, ఎవరైనా తమ సొంత అవసరాల కోసం ఉచితంగా ఇసుకను తవ్వుకొని తీసుకువెళ్లవచ్చు అని అన్నారు. దీంతో ఎడ్ల బళ్లు, ట్రాక్టర్లతో రవాణా చేసుకోవచ్చు. వాటిని ఎవరూ ఆపరు. దానికి ఏ అనుమతి అక్కర్లేదు. ఎవరికీ పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. పెద్ద నదుల విషయంలో మాత్రం నిబంధనలు పాటిస్తాం. లారీలకు టన్నుల పరిమితి లేదు. వాటి సామర్ధ్యాన్ని బట్టి అనుమతి ఇస్తాం. ఇకపై ఇసుక తక్కువ ధరకు లభించాలి. పది రోజుల్లో ఈ తేడా కనిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా ఇసుకను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మితే ఊరుకొనేది లేదు. ఆన్లైన్ బుకింగ్ విధానం కొనసాగుతుంది' అని ఒక అధికారి  పేర్కొన్నారు. వాగులు, వంక నుంచి ప్రజలు ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్తుంటే పోలీసులు ఆపి, జరిమానా విధిస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. నదుల్లో ఇసుక లోడింగ్ కు కొంతమంది బాగా తక్కువ ధరకు టెండర్లు వేశారన్న ఫిర్యాదులపై కూడా చర్చించారు. ఇలాంటి వారివద్ద డిపాజిట్ భారీగా తీసుకోవాలని, చేయలేకపోతే ఆ డిపాజిట్ ను జప్తు చేయా లని సీఎం సూచించారు. ఏ ఊళ్లో ఇసుకను ఆ ఊరివాళ్లే తీసుకోవాలన్న నిబంధన లేదన్నారు. అయితే లారీల్లో ఇసుక తరలించడం నిషేధం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *