8, అక్టోబర్ 2024, మంగళవారం

అధినేత ఆదేశాలు పట్టించుకోని తెలుగు తమ్ముళ్ల

మద్యం టెండర్ల దాఖలులో బిజీ బిజీ 
సిండికేట్ అవుతున్న మద్యం వ్యాపారస్తులు 
గండిపడుతున్న ప్రభుత్వ ఆదాయం 
అస్మధీయులు టెండర్లు వేయకుండా బెదిరింపులు

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

మద్యం, ఇసుక, అక్రమ రవాణా విషయంలో కలగజేసుకోవద్దని తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఇందువల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని, రానున్న ఎన్నికల్లో గెలుపు కష్టమవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శాసనసభ్యులు మద్యం, ఇసుక, కలప వ్యాపారాలకు  ఉండాలని కోరారు. అయితే మద్యం టెండర్లలో పరిస్థితి ఎందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత మాటలను సైతం మన్నించడం లేదు. జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్లు వేయడంలో బిజీబిజీగా ఉన్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మద్యం సిండికేట్ తయారు చేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు మద్యం టెండర్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఒక్కొక్క మద్యం షాపుకు రెండు నుంచి మూడు టెండర్లు మాత్రమే దాఖలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఒకరిద్దరు మినహా అందరూ శాసనసభ్యుల అనుచరులు మద్యం టెండర్లువేయడంలో బిజీబిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ్యులు ఈ విషయంలో నేరుగా జోక్యం చేసుకోకపోయినా, వారి కనుసన్నల్లో మద్యం టెండర్లు సిండికేట్ జరుగుతున్నది మాత్రం వాస్తవం. ఈ మద్యం సిండికేట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు  జిల్లాలో ఎమ్మెల్యేల మద్దతుతో కొందరు సిండికేట్లుగా ఏర్పడి ఇతరులను టెండర్లు వేయనీయడం లేదని తెలిసింది. 

అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాప్‌లకు లాటరీలు నిర్వహిస్తారు. జిల్లాలో 104 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలని ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు. మూడు విధానాల్లో దరఖాస్తుల స్వీకరిస్తామని చెప్పారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల మధ్య ఉంటుందని స్పష్టం చేశారు. ఆరు రోజుల వ్యవధిలో చాలా తక్కువ టెండర్లు దాఖలయ్యాయి. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాల కంటే తక్కువగా మద్యం టెండర్లు దాఖలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేల కనుసన్నల్లో సిండికేట్లు ఏర్పడ్డాయని అంటున్నారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా నియోజక వర్గంలోని అన్ని మద్యం షాపులు తన నియంత్రణలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.  ఒక్కో శాపుకు 10 నుంచి 15 మంది టెండర్లు వేస్తారని అధికారులు భావించారు. అంటే ఒక్కో షాపుకు 20 నుంచి 30 లక్షల రూపాయలు వస్తుందని అంచనా వేశారు. ఇప్పుడు అందులో పదో వంతు మాత్రమే వచ్చే పరిస్తితి ఉంది. ఇదిలా ఉండగా తమ మాట కాదని ఎవరైనా టెండర్ దక్కించుకున్నా తమకు వాటా లేదా కమీషన్ ఇవ్వ వలసిందేనని కండీషన్ పెడుతున్నట్టు తెలిసింది. ముఖ్య మంత్రి చంద్రబాబు ఇదివరకే హెచ్చరించినా ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే లు అందినవరకు దండుకునే పనిలో బిజీ, బిజీ గా వుంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యే లను  ఏమి అనలేని పరిస్థితి. మాకు మంత్రి పదవులు రావు, మొన్న ఎన్నికలలో కోట్లు ఖర్చు పెట్టాం, మళ్ళీ ఎన్నికలలో పోటీచేయాలంటే కోట్లు కావాలి, అందుకే వ్యాపారాల పై దృష్టి పెట్టాం, సంపాదన కోసం ఆరాటపడుతున్నాం అని కొంతమంది ఎమ్మెల్యే లు, తమను కలిసివారికి కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారట.  పెట్టిన సొమ్ము సంపాదించుకోపోతే, వున్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారట. అసలు విషయానికొస్తే, లిక్కర్ వ్యాపారం పై మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యే లు దృష్టిపెట్టారు. బినామీ పేరులుతో వైన్ షాప్ లును సొంతం చేసుకునేందుకు, బెదిరింపులుకు కూడా దిగుతున్నారు. ఒక వేళ వైన్ షాప్ లు తమ బినామీలకు రాకుంటే, వచ్చిన వారి పై వత్తిడి తెచ్చి కానీ, బెదిరింపులు చేసైనా, 20 శాతం భాగస్వామ్యం డిమాండ్ చేయాలనీ అనుకుంటున్నారట. అందుకే మద్యం షాప్ లు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పలానా వారు షాప్ లు కోసం దరఖాస్తు చేస్తున్నారని, ఎమ్మెల్యే లకు తెలిసిందంటే చాలు, వారిని పిలిసి బెదిరిస్తున్నారట. వాటాలు కోసం, సిండికెట్ దిశ గా ప్రయత్నాలు చేయబోతున్నారట. ప్రభుత్వ ఆడయానికి "గండి" పడినా పర్వాలేదు, మా సొంత ఆదాయనికి గండి పడకుండా, ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే లు. జిల్లాలోని కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే లు, మినహా, మిగతా వారందరూ, లిక్కర్ వ్యాపారం తో కోట్లు సంపాదించాలని ఆరాట పడుతున్నట్లు సమాచారం. మద్యం టెండర్లు ఇసుక అక్రమ రవాణా విషయంలో అధిష్టాన వర్గం చాలా అప్రమత్తంగా ఉంది. రెండు, మూడు మార్గాల ద్వారా ప్రతి నియోజకవర్గంలోని సమాచారాన్ని అధిష్టానం నిత్యం తెప్పించుకుంటుంది. నియోజకవర్గంలోని శాసనసభ్యులు, నాయకులు ఎవరెవరు ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అనే విషయం మీద నిఘా నేత్రాన్ని పెట్టారు. నియోజకవర్గాల నుంచి అందిన నివేదికలను కంప్యూటరైజేషన్ చేస్తున్నారు. ఈ విషయాల మీద శాసనసభ్యులకు మార్కులను కూడా వేస్తున్నారు. ఈనెల ఆఖరు లేదా నవంబర్ నెలలో శాసనసభ్యుల సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో శాసనసభ్యులపై అందిన సమాచారాన్ని వారికి వివరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరించనున్నారు. అప్పటికే వారు తమ తీరును మార్చుకోకపోతే,  క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయం కూడా అధిష్టాన పరిశీలనలో ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *