13, అక్టోబర్ 2024, ఆదివారం

భారీ వర్షం హెచ్చరికతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం

  నేటి  నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం.. 

జిల్లా అదుకరులను  అప్రమత్తం చేసిన కలెక్టర్ 

జిల్లా, మండల అధికారుల శలవులు రద్దు 

మండల అధికారులు మండల కేంద్రంలో ఉండాలని ఆదేశం  

 ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ 


బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందన్న వాతావరణ శాఖ వారి హెచ్చరికలు నేపథ్యంలో జిల్లా యంత్రంగా అప్ప్రమత్తం అయ్యింది. ఈ నెల 14 నుండి 16 వరకు రాయలసీమ జిల్లా ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఈ  నేపథ్యంలోఅధికారులందరూ అప్రమత్తం గా ఉండాలని ప్రాణ,పశు,ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని టెలి కాన్ఫరెన్స్  ద్వారా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాఅధికారులను, ఆర్ డి ఓ లు, తహసిల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, సంబంధిత  అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ఎవరు సెలవుల్లో వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా అధికారులు సెలవుల్లో ఉంటే సెలవులను రద్దు చేసుకునే వెంటనే విధుల్లో చేరాల్సిందిగా కోరారు మండల అధికారులు అందరూ తమ తమ మండల కేంద్రంలోని విధిగా బత చేయాల్సిందిగా సూచించారు రాష్ట్ర హోం శాఖ మత్రి వంగలపూడి అనిత కూడా టెలికాన్పెంటర్ ద్వారా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ లను అప్రమత్తం చేశారు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు.

చిత్తూరు జిల్లా లో ఈనెల  14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ  హెచ్చరించింది. నేపథ్యంలో జిల్లాలోని జిల్లా అధికారుల నుండి మండల స్థాయి అధికారుల వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులందరూ వారి వారి ప్రధాన కార్య స్థానం నందు అందుబాటులో ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్నిముందస్తు చర్యలు చేపట్టాలనిమండల స్థాయిలోనిఅధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను, శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్నవారు పూరిగుడిసెల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకుతరలించాలన్నారు. సచివాలయ సిబ్బంది కూడా వారి పరిధిలో అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి ప్రమాదాలు జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించేలా భాధ్యత గా ఉండాలని ఆదేశించారు. చెరువులు, వాగులు, వంకలు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ రెవిన్యూ అధికారులను, భారీ వర్షాలకు విద్యుత్ సరఫరా అంతరాయం జరగకుండా మందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బంది అందుబాటులో ఉండాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశిస్తూ. జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, పశు నష్టం,ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అన్ని శాఖలు సమర్థవంతం గా బాధ్యతతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్  అధికారులను ఆదేశించారు.  భారీ వర్షాలకు  వరదలు వచ్చే అవకాశం ఉన్నందున డిడిలు, ఏడిలు హై అలర్ట్‌లో ఉండాలని జిల్లా పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. 

*పశుసంవర్ధక శాఖ  అప్రమత్తం* 

భారీ వర్షాల కారణంగా  ముందు జాగ్రత్త చర్యలను ఖచ్చితంగా పాటించాలని పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఎం. ప్రభాకర్ కింది స్థాయి అధికారులను అప్ప్రమత్తం చేశారు.  ఆమోదం లేకుండా సెలవులకు ఆస్కారం లేదన్నారు. ఎవరికీ  అనుమతి  సెలవులు మంజూరు చేయబడవన్నారు.  ప్రతి రోజూ సిబ్బంది అందుబాటును ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలనీ, సిబ్బంది అందరూ వారి నియమించబడిన ప్రధాన కార్యాలయంలో ఉండాలని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్‌లను ఏక్టివ్ గా ఉంచుకోవాలనీ,  మండల స్థాయి విపత్తు నిర్వహణ బృందంతో తహశీల్దార్/ఎం పి డి ఓ తో   సమన్వయం చేసుకోవాలని సూచించారు.   పశువుల భద్రత: భారీ వర్షాల సమయంలో తమ పశువులను బయట మేయకుండా చూసుకోవాలని పశువుల యజమానులకు వివరంగా, విస్తృతంగా సూచనలు ఇవ్వాలని చెప్పారు.  పశువులకు సంబంధించిన ఏదైనా అత్యవసర పరిస్థితులు లేదా ప్రాణనష్టం నివారణ కోసం అవసరమైన అన్ని మందులు తక్షణమే అందుబాటులో ఉండేలా ముందస్తుగా సిద్ధం చేసుకునే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవలన్నారు.  నష్టం నివేదన: పశుసంపద లేదా వైద్య శాల భవనాలకు  నష్టం జరిగినట్లయితే, జియో-ట్యాగ్ చేయబడిన ఫోటోలతో పాటు నిర్ణీత ఫార్మాట్‌లో తక్షణమే నివేదించాలని కోరారు. అవసరమైతే సహాయం కోసం జిల్లా మరియు డివిజన్ స్థాయిలలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్‌లు పనిచేస్తాయన్నారు. ఈ సంసిద్ధత చర్యలను పాటించడంలో ఏ స్థాయిలో వైఫల్యం చెందినా తీవ్రంగా పరిగణించబడడమే కాక , అట్టి వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టబడుతుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

*హోం మంత్రి టెలికాన్ఫరెన్స్*

తుపాను వల్ల ముప్పు  వాటిల్లకుండా చూడాలని  జిల్లా కలెక్టర్ ను హోం మంత్రి అనిత కోరారు. హోం మంత్రి అనిత  టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా అధికారులను  అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని తెలిపారు. పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24x7 అప్రమత్తంగా ఉండాలన్న కోరారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. దక్షిణకోస్తా, ఉత్తరాంధ్ర,రాయలసీమ జిల్లా ప్రాంతాలలో వర్షాలు కురవనున్న నేపథ్యంలో గండ్లు పడే కాలువలు,గట్లను గుర్తించి పర్యవేక్షించాలని ఆదేశించారు. పిడుగులు పడి, వాగులు పొంగే అవకాశమున్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెలకాపరులు, మత్స్యకారులు బయటకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.  రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఎస్డీఆర్ఎఫ్ శాఖలన్నీ సమన్వయంతో  ఎప్పటికప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నియంత్రించే చర్యలు చేపట్టేందుకు సంసిద్ధంగా ఉండాలన్న హోం మంత్రి అనిత జిల్లా కలెక్టర్ ను కోరారు. 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *