4, అక్టోబర్ 2024, శుక్రవారం

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

 కుప్పం ప్రాంతంలో గంజాయి సాగు 

చిత్తూరు కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా 

కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి సరఫరా

పల్లెలకు ప్రాకుతున్న గంజాయి సంస్కృతి 

రాజకీయ అండదండలతో విస్తరిస్తున్న వ్యాపారం

చిత్తూరు జిల్లాలో జోరుగా గంజాయి వినియోగం 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు జిల్లాలో గంజాయి సాగు, రవాణా జోరుగా సాగుతుంది. కుప్పం పరిసర ప్రాంతాలలో గంజాయి సాగవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి చిత్తూరు కేంద్రంగా జోరుగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది. చిత్తూరు నుండి వివిధ మార్గాలలో జిల్లా అంతటా సరఫరా అవుతోంది. గంజాయి ద్రవ రూపంలో, చాక్లెట్ రూపంలో, సిగరెట్ల రూపంలో కూడా లభిస్తుంది. తొలుత కళాశాల విద్యార్థుల లక్ష్యంగా గంజాయి వినియోగం జరుగుతున్నా, క్రమంగా పల్లెలకు కూడా విస్తరిస్తుంది. చిత్తూరులో కళాశాల విద్యార్థులు నిత్యం గంజాయి మత్తులో జోగుతున్నారు. చిత్తూరు రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలలో విద్యార్థులు గంజాయి సేవిస్తూ కనిపిస్తున్నారు. జిల్లాలో గంజాయి మత్తుకు యువత బానిసలుగా మారుతున్నారు. ఎస్.ఆర్.పురం మండలం, పాలసముద్రం మండలం, గుడిపాల మండలంలో పోలీసుల కన్నుల కప్పి గంజాయి రవాణా సాగిస్తున్నారు. కొందరు స్మగ్లర్స్. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంమైన తొట్టికండ్రిక గ్రామానికి చెందిన కొందరు యువకులు యథేచ్చగా గంజాయి సేవిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో, చిత్తూరు జిల్లాలో గంజాయి వినియోగం చర్చనీయాంశంగా మారింది. 


 తమిళనాడు, కర్ణాటక  సరిహద్దులు కలిగిన ఈ జిల్లాలో గంజాయిని విపరీతంగా రవాణా చేస్తుండటంతో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆంక్షలు విధించారు. అయినా వారి కన్ను గప్పి కొందరు గంజాయి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు.  కుప్పం  అర్బన్ పోలిస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో గంజాయి సాగు చేస్తున్నారని పక్కా సమాచారంతో ఈ మధ్యకాలంలో కుప్పం పోలీసులు అధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. వానగుట్ట పల్లి గ్రామానికి చెందిన శివప్ప అనే వ్యక్తి పొలములో గంజాయి పండించి అక్రమంగా, తరలించి అమ్ముతున్నాడన్న సమాచారం రావడంతో అతన్ని ఫాలో చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిదంగా పైపాల్యం పంచాయతీ తంగేడుకుప్పం గ్రామంలో కూడ పోలీసులు తనిఖీ చేస్తుండగా తంగేడుకుప్పంకు చెందిన నాగరాజు తన వ్యవసాయ పొలములో గంజాయి మొక్కలను పండిస్తున్న విషయం కనిపెట్టి పొలములోని 70 గంజాయి మొక్కలను తొలగించి, గంజాయి మొక్కలకు నిప్పు పెట్తారు. నాగరాజుపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. అయితే మూడు రాష్ట్రాల కూడలిలోని కుప్పంలో యువత మత్తు పదార్థాలకు బానిసలను చేస్తున్న గంజాయి విక్రేతలను, గంజాయి సాగు చేస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఇది ఒక ఎత్తుగా భావిస్తే మరొక ఎత్తు పలమనేరు పరిసర ప్రాంతాల్లో దినసరి కూలీ చేసుకోవడానికి మదనపల్లి నుండి వచ్చి గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. నిత్యం వేలాది మంది వ్యాపార నిమిత్తం రాకపోకలు రాగిస్తుంటారు. గంజాయి రవాణాకు చిత్తూరు జిల్లా నిలయంగా మారుతుంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన పాలసముద్రం మండలం మొదలుకొని గుడిపాల, ఎస్.ఆర్.పురం మండలం, గంగాధర నెల్లూరు మండలం, పుంగనూరు మండలం, పలమనేరు, కుప్పం, పుత్తూరు, నగరి ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతుండడంతో కొందరు రహస్య మార్గాల ద్వారా గంజాయి ఫ్యాకెట్లను జిల్లాకు తరలిస్తూ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అక్రమార్కులు డీలర్లను ఏర్పాటు చేసి వారి వద్ద నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థులు గంజాయి మత్తులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. గంజాయి సేవిస్తున్న వీడియోలను యువకులు సోషన్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. మరికొందరు యువకులు గంజాయి సేవించడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. గంజాయి సేవించిన కొందరు యువకులు విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారానికి ఒక్కసారి తమిళనాడు నుంచి కొందరు వాహానాల్లో వచ్చి గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు యువకులు గంజాయి సేవిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నప్పటికి పోలీసులు క్షేత్ర స్థాయిలో గట్టి నిఘా పెట్టడంలేదని విమర్శలు వస్తున్నాయి. గంజాయి అక్రమ రవాణాపై క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచాల్సిన పోలీసులు, అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గంజాయి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో గంజాయి నిషేధం కేవలం మాటలకే‌ పరిమితం అవుతోంది. పాలసముద్రం మండలం తొట్టకండ్రిక సమీపంలోని సాయినగర్ లో‌ ఉండే ఓ యువకుడు నిత్యం గంజాయి సేవించి స్థానికంగా ఉన్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులు, ఉద్యోగులు గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విప్లవం కనిపిస్తోంది. ఓ వైపు గంజయి మత్తులో మైనర్లు కూడా చెలరేగిపోయి దారుణాలకు పాల్పడుతూంటే పోలీసులు మాత్రం రాజకీయ కారణాలతో గంజాయి దొరికిందంటే, కొంత మందిపై కేసులు పెట్టేసి.. తమ బాసులను ఆనందపరుస్తున్నారు. వారి దగ్గర దొరికిదంటూ ఎంతో కొంత గంజాయి ని సైతం చూపిస్తున్నారు. ఏపీ గంజాయి క్యాపిటల్ గా మారిపోయిందన్న ఆందోళనతో నారా లోకేష్ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. గంజాయి మత్తులో కొందరు ఘోరాలు చేస్తున్నారు.  శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఈ గంజాయి మత్తులో చేస్తున్న నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు.. కవర్ చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల మద్యం మత్తు అని, మరో చోట పాత నేరస్తులు అని చెబుతున్నారు. కారణం ఏదైనా కానీ… ఏపీ వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా అమ్మకం జరుగుతోందన్నది మాత్రం కళ్ల ముందు కనిపిస్తున్న నిజం. కాలేజీల టార్గెట్‌గా యువత భవిష్యత్ పై దాడి జరుగుతోంది. అధికార పార్టీ నేతలు, వారి సానుభూతిపరులు ఎక్కువ మంది అక్రమ వ్యాపారాలపై దృష్టి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వారు చేసే వ్యాపారాల పట్ల పోలీసులు కూడా చూసీ చూడనట్లుగానే ఉంటున్నారు. ఈ కారణంగానే గంజాయి వ్యాపారం సాగుతోందని.. కాలేజీల్ని టార్గెట్ చేసుకుని … పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో నిఘాలు పెట్టామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెబుతున్నారు. ఎన్ని నిఘాలు పెట్టినా ఏం ప్రయోజనం ఉండటం లేదని.. యువత భవిష్యత్ గంజాయికి బానిసగా మారుతోందన్న ఆందోళన జిల్లాలో వ్యక్తమవుతోంది.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *