17, అక్టోబర్ 2024, గురువారం

జిల్లాలో కొనసాగుతున్న అప్రమత్తత

 నేడు కూడా పాటశాలలకు సెలవులు 

తూర్పు మండలాల్లో భారీగా వర్షం 

పశ్చిమ మండలాల్లో చెదురుమదురుగా వర్షాలు 


ఆంధ్రప్రభ, చిత్తూరు బ్యూరో 

భారీ వర్షాలు నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో అప్రమత్తత కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు జిల్లాలోని ముఖ్య విభాగాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ట్రాన్స్ కో విభాగాలతో సమీక్షలు జరిపి   ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు పడితే తీసుకోవాల్సిన చర్యలు గురించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం కూడా జిల్లా కలెక్టర్ సెలవును ప్రకటించారు, వాయుగుండం మంగళవారం రాత్రి  ప్రాంతంలో సూళ్ళూరు పేట దగ్గర తీరం దాటి అవకాశం ఉందని జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో భారీ వర్షం, గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది. చిత్తూరు జిల్లాలో ఒక మోస్తరు  నుండి భారీగా గాలులు గంటకు 40 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 


తూర్పు మండలాల్లో భారీగా వర్షం పడుతుండగా, పశ్చిమ మండలాల్లో మాత్రం  చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుండి బుధవారం ఉదయం వరకు అన్ని మండలాల్లో వర్షపాతము నమోదయ్యింది. నిండ్ర మండలంలో 117.4 మిల్లిమీటర్లు, కార్వేటినగరంలో 77.6, నగరిలో  77.2, విజయపురంలో 68.4, సదంలో 60.8, పులిచెర్లలో 58, రొంపిచర్ల లో 56.8, ఎస్ఆర్ పురంలో 43.8, పెనుమూరులో 43.2, ఐరాలల్లో 37.8, సోమలలో 37.8, చౌడేపల్లిలో 37.4, పాలసముద్రంలో 35.2, పూతలపట్టులో 34.4, పుంగనూరులో 33.2, చిత్తూరు రూరల్ లో 31.2, జీడి నెల్లూరులో 28.2, వెదురుకుప్పంలో 26, తవణంపల్లిలో 26, గుడిపాలలో 25.8, గంగవరంలో 23.8, చిత్తూరులో 23, గుడిపల్లిలో 22.6, రామకుప్పంలో 22.6, వీకోటలో 22.4, పెద్దపంజనిలో 21.6, శాంతి పురంలో 21, పలమనేరులో 18.8, యాదమరిలో 17.8, బంగారుపాలెంలో 15.2, బైరెడ్డిపల్లిలో 13.6, కుప్పంలో 11.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. చిత్తూరు జిల్లాలో నిండ్ర మండలంలో గరిష్టంగా వర్షపాతం నమోదుకాగా, కుప్పం మండలంలో కనిష్టంగా వర్షపాతం నమోదయింది. జిల్లాలో సగటున్న 37.2 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది.

జిల్లాలో బుధవారం ఉదయం 8:30 నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు చిత్తూరు జిల్లాలో 28 మండలాల్లో వర్షపాతం నమోదయింది. చిత్తూరు రూరల్ మండలం, రామకుప్పం, గుడిపల్లి, శాంతిపురం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. రొంపిచర్లలో 22.2 మిల్లిమీటర్లు, సదంలో 13, వెదురుకుప్పంలో 23.2, నిండ్రలో 24.4, విజయపురంలో 13, నగరిలో 19.4, కార్వేటి నగరంలో 41.8, పెనుమూరులో 19.2, పూతలపట్ల 16.4, ఐరాలలో 9.4, సోమలలో 19.6, చౌడేపల్లిలో 13.2, పుంగనూరులో 10.6, పెద్దపల్లిలో 15.4, గంగవరంలో 5.4, ఎస్ఆర్ పురంలో 17.2, జిడి నెల్లూరులో 5, చిత్తూరులో 1, పలమనేరులో 6, బైరెడ్డిపల్లిలో 28, వీకోటలో 1.2, కుప్పంలో 1, బంగారుపాళ్యంలో 2.6, యాదమరిలో 1.2 , గుడిపాలలో 1, పాలసముద్రంలో 28.6, మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. జిల్లాలో సంఘటన 11 మిల్లీమీటర్ల వర్షపాతం బుధవారం నమోదయింది,

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *