10, అక్టోబర్ 2024, గురువారం

జిల్లాకు కొత్తగా 49 రేషన్ షాపులు మంజూరు

 ప్రతిపాదనలు సిద్దం చేసిన అధికారులు 

ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం 

15న కొత్త షాపులకు నోటిఫికేషన్ 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

జిల్లాలో కొత్తగా 49 రేషన్ షాపులు రానున్నాయి. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల అధికారులు ప్రతిపాదనలను సిద్దం చేశారు. ఈనెల 15వ తేదీ పైన ఈ దుకాణాలకు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు ఇందుకు ఇంటర్వ్యూలను నిర్వహించి డీలర్లను నియమించనున్నారు. దీంతో జిల్లాలో రేషన్ షాపుల సమాఖ్య 1,428 కి పెరగనున్నాయి. 


ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వెయ్యండి 1,379 రేషన్ దుకాణాల్లో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 5,43,202 తెలుపు రంగు  రేషన్ కార్డులకు ప్రతి నెలా 93,04,540 కిలోల బియ్యం, 29,1464 కిలోల చక్కెర, 5,43202 కిలోల పప్పు ధాన్యాలు, 5,41,678 కిలోల గోధుమపిండి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ దుకాణాలను విభజించాలని నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 800 కంటే ఎక్కువ కార్డులు ఉన్న దుకాణాలను విభజించాలని భావించారు. ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్న రేషన్ రేషన్ కార్డులకు ఆ గ్రామంలోని రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు సర్వే జరిపి జిల్లాలో 49 కొత్త దుకాణాలు ఏర్పాటు చేసిన అవసరం ఉందని గుర్తించారు. జిల్లా కలెక్టర్ ఈనెల 15వ తేదీ తర్వాత కొత్త రేషన్ షాపులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కొన్నిచోట్ల రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక రేషన్ షాపును ఏర్పాటు చేశారు. ఆ గ్రామస్తులు ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి నిత్యవసర వస్తువులను తీసుకుంటున్నారు. ప్రజలకు ఈ దూరాన్ని తగ్గించడానికి వారికి దగ్గరలోనే రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇంటింటికి రేషన్ పద్ధతిని కూడా నిలుపుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇంటింటికి రేషన్ సరఫరా విధానం మీద ప్రభుత్వం ఎప్పటికీ ఒక సర్వేను నిర్వహించింది. ఎక్కువ మంది కార్డుదారులు తమకు పాత విధానమే అనుకూలంగా ఉన్నట్లు తెలియజేశారు. పాత విధానం కారణంగా రేషన్ షాపులన్నీ ఒకేసారి ప్రారంభమవుతాయని, ఒకటవ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు తమకు అనుకూలం ఉన్న రోజులలో, అనుకూలంగా ఉన్న సమయంలో రేషన్ షాప్ కి వెళ్లి రేషన్ తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఇంటింటికి రేషన్ పద్ధతులు ఆ గ్రామానికి వాహనం వచ్చినప్పుడు లేకపోతే, ఆ నెల రేషన్ తీసుకోవడం కష్టం అవుతుంది. దీని వల్ల పలువులు రేషన్ లో నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కొందరు నిత్యవసర వస్తువులను తీసుకోకుండా నష్టపోతున్నారు. కావున ఈ పద్ధతికి స్వస్తి పలికి, గతంలో లాగానే రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కార్డుదారులకు దూరం తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా జిల్లా పౌరసరఫరాల  అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా పౌరసరఫరాల అధికారులు ఈ విషయంలో కసరత్తు  నిర్వహించి చిత్తూరు జిల్లాలో కొత్తగా 49 రేషన్ దుకాణాలను అదనంగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆమోదం తెలియజేసింది.


*త్వరలో కొత్త రేషన్ కార్డులు* 


కొత్తగా రేషన్ కార్డుల జారీపైన త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. వైసిపి ప్రభుత్వం కొంతకాలం పాటు కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఎన్నికలకు ముందు రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియను నిలుపుదల చేసిం.ది దీంతో ప్రస్తుతం ఎవరికి కొత్తగా కార్డులు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులను కూడా జారీ చేయాలని భావిస్తుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించడంలో పౌరసరఫరాల అధికారులు బిజీగా ఉన్నారు. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 10వేలు, పట్టణ ప్రాంతాల్లో 12వేలకి మించి ఆదాయం  కుటుంబానికి తెలుపు రంగు రేషన్ కార్డులను కట్ చేసింది. దీనితో అంగన్వాడీ కార్యకర్తలు, పొరుగు సేవల సిబ్బంది కూడా తెలుపు రంగు కార్డులను కోల్పోయారు. దీంతో వారు తమకు వస్తున్న ఆదాయమే చాలా తక్కువ అని, రేషన్ కార్డును కూడా నిలుపుదల చేస్తే ఎలా అని ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని, ఆదాయ పరిమితిని పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. విడిపోయిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను అందజేయడంతో పాటు, కుటుంబంలో సభ్యుల చేర్పును, తీసివేతను కూడా చేయనున్నారు. అలాగే చిరునామాను మార్చడం ఎవరైనా రేషన్ కార్డులను సరెండర్ చేయాలనుకుంటే వాటిని తీసుకోవడం వంటి విషయాలను అమలు చేయనున్నారు. గత ఆరు నెలలుగా రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తులను జిల్లా పౌరసరఫరాల అధికారులు సంబంధిత మండల రెవెన్యూ అధికారులకు అందజేశారు. వారు గ్రామ సచివాలయాల ద్వారా సర్వే నిర్వహించి అర్హుల జాబితాను తయారుచేసి సిద్ధంగా ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ మీద అంక్షలు విధించడంతో గత ఆరు నెలలుగా ఎవరికి రేషన్ కార్డులను జారీ చేయడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులను మంజూరు చేయనున్నారు. అలాగే రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయనుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *