26, జులై 2024, శుక్రవారం

అప్రకటిత విద్యుత్ కోతలతో విలవిలలాడుతున్న ప్రజలు

పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా కోతలు 

చినుకు పడ్డా, మెరుపు కనిపించినా కోత తప్పదు 

లోడ్ రిలీఫ్ పేరుతో గంటల తరబడి కోతలు 

విత్యుత్తు లేకపోవడంతో విజ్రుంభిస్తున్న దోమలు 

 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు)

జిల్లాలో వానా కాలంలో కూడా  విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. వాన చినుకు పడినా, మెరుపు మెరసినా విత్యుత్తును కట్ చేస్తున్నారు.పట్టణ ప్రాంతాల్లో గంటల తరబడి విత్యుత్తు కోతలు విధిస్తున్నారు. పల్లెల్లో వాన పడితే ఆ రోజు విత్యుత్తు ఉండదు. వాన తగ్గినా, విత్యుత్తు రావడం లేదు. అప్పుడప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విత్యుత్తు లేక రాత్రిళ్ళు పల్లెవాసులు జాగారం చేస్తున్నారు. ఇలా అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎప్పుడు విద్యుత్‌ ఉంటుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో వినియోగదారులు తల్లడిల్లుతున్నారు. ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ పేరిట అనధికారిక విద్యుత్‌ కోతలు అమలు అవుతున్నాయి. 


జిల్లా కేంద్రంలో కూడా  విద్యుత్‌ కష్టాలు తప్పడం లేదు. అర్థరాత్రి మంచి నిద్రలో ఉన్నపుడు విత్యుత్తు కట్ చేస్తున్నారు. కరెంటు లేక ఫ్యాన్లు తిరగక, ఏ సి లు పనిచేయక పెద్దలు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఎడాపెడా విద్యుత్‌ కోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  రాత్రి వేళల్లో ఎడాపెడా విద్యుత్‌ కోతలను అనధికారికంగా అమలు చేస్తున్నారు. విద్యుత్‌ ఆధారంగా నడిచే పలు చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమల యజమానులు విద్యుత్‌ కోతతో పనులు చేయలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు విద్యుత్‌ కోత కారణంగా కూలి డబ్బులు సైతం అందని పరిస్థితులు నెలకొన్నాయి. భవిష్యత్తులో విద్యుత్‌ కోతల తీవ్రతతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జిల్లా  అన్నీ మండలాల్లో రాత్రి పగలు తేడా లేకుండా కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు కట్ కావడంతో ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఒకపక్క కరెంటు చార్జీల మోత,ఒక పక్క ఉక్క పోత,మరో పక్క దోమల మోత,ఒకపక్క పవర్ కట్.ఎప్పుడూ ఈ విధంగా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ ఆలోచించకుండా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోవడంపై విద్యార్థులు, తల్లి దండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సంబంధిత విద్యుత్ అధికారులకు ఫోన్ చేసినా వారు ఫోన్ ఎత్తి సమాధానం చెప్పే పరిస్థితి లేదు.  విద్యుత్ కోతలతో ఆసుపత్రిలో రోగుల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది.   ఇక ఆసుపత్రుల్లో వైద్యులు సైతం కరెంటు కోతల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చీకట్లోనే ఒక్కోసారి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆపరేషన్లు చెయ్యాలంటే కరెంట్ కోతలతో వైద్యులు సైతం ఇబ్బంది పడుతున్నారు. అసలే అనారోగ్యం, ఆపై పవర్ కట్స్ తో రోగులు నరకాన్ని చవి చూస్తున్నారు. గ్రామాల లోనే కాదు ప్రధాన పట్టణాల్లోనూ, నగరాలలోనూ విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి.  జిల్లా అంతటా  ఒకే విధంగా పరిస్థితి కనిపిస్తుంది. నగరాల్లో కూడా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్ శాఖ అధికారులు కోతలను విధిస్తున్నారు. ప్రతి రోజూ అర్ధరాత్రి సమయంలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో ప్రజలు సరిగా నిద్ర కూడా పోలేని పరిస్థితి నెలకొంది. ఇక అధికారులు చెబుతున్న సమయం కంటే, ఎక్కువ సమయం విద్యుత్ కోతలు విధిస్తూ ఉండడం గమనార్హం. విద్యుత్ కోతల వల్ల రాష్ట్ర రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పంటలు కరెంట్ కోతల నేపధ్యంలో నీళ్ళు సరిగ్గా లేక ఎండిపోతున్నాయి. ఇక ఈ క్రమంలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ ఇప్పటికే అనేకమార్లు అనేక సబ్ స్టేషన్ల వద్ద రైతులు ఆందోళనలు తెలియజేశారు. చిరు వ్యాపారులు సైతం తమ వ్యాపారాలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక విద్యుత్ కోతలపై ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. కాల్ చేసి ఫిర్యాదులు చేస్తున్నవారు కొందరైతే, కరెంట్ ఆఫీస్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తున్న వారు మరికొందరు. మొత్తంగా అందరూ ఎన్ని గంటల పాటు విద్యుత్ కోత విధిస్తారు అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ ఎక్కువ కావటం , కొరత ఉండటం .. కరెంట్ కోతలకు కారణం సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం  విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ప్రజలు ఏసీ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక రైతులు పంట పొలాలను కాపాడుకునే క్రమంలో అధిక మొత్తంలో మోటార్లను వినియోగిస్తున్నారు. రైతులు కూడా ఎక్కువ కరెంటు ను వినియోగిస్తున్న క్రమంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే డిమాండ్ కు తగినంతగా విద్యుత్తు ఉత్పత్తి లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం అప్రకటిత విద్యుత్ కోతలకు దిగుతోందని సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *