కుప్పంలో భువనమ్మ పర్యటనకు అపూర్వ ఆదరణ
అడుగడుగునా మంగళ హారతులతో స్వాగతం
భారీగా వినతులు
పార్టీ శ్రేణులలో భరోసా నింపిన పర్యటన
రెండు గ్రామాల దత్తత
మూడు నెలలకు ఒక మారు వస్తానని హామీ
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు
కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజులపాటు పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరికి అపూర్వ ఆదరణ లభించింది. అడుగడుగునామహిళలు, కార్యకర్తలు ఘన ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడవున పూల వర్షం కురిపిస్తూ, మంగళ నిరాజనలతో, గజ మాలలతో తమకున్న విధేయతను చాటుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా మహిళలు పసుపు రంగు చీరలు ధరించి భారీ ఎత్తున తరలివచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పడానికి, వారిలో మనో ధైర్యం కల్పించడానికి నాలుగు రోజుల పర్యటన వినియోగించుకున్నారు. ఆమె ఒక పరిమితి చెందిన రాజకీయ నాయకురాలిగా ప్రసంగించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఆమె ప్రసంగాలకు మంచి ఆదరణ లభించింది. పలు సంఘాలు ఈ సందర్భంగా భువనేశ్వరిని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా మనవి చేశారు. అందరినీ సాధనంగా పలకరిస్తూ, సమస్యలపై వినతులు స్వీకరిస్తూ కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ భువనేశ్వరి పర్యటన నాలుగు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా అత్యధిక మెజారిటీ వచ్చిన రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు.
కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి విచ్చేసిన సందర్బంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వెంకటాపురం గ్రామస్తులు భారీ గజమాలతో నారా భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని మహిళలు పసుపు చీరలు కట్టుకుని ఆమెకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. గుడుపల్లి మండలం కుమ్మగుట్టపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లతో పాటు విశేషా ఆహ్వానం పలికారు. గత ఎన్నికల్లో ప్రచారం లో నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గం లో అత్యధికముగా మెజార్టీ తెచ్చే గ్రామాన్ని దత్తత తీసుకొంటానని తెలియజేయడంతో మంగళవారం నాడు ఆమె కమ్మగుట్ట పల్లి బూత్ అత్యధిక మెజార్టీ రావడంతో ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ సందర్బంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబుని భారీ మెజారిటీ తో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్య వాదాలు తెలియజేశారు. మంగళవారం కుప్పం నియోజకవర్గం, గుడుపల్లి మండలం కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో మాట్లాడారు. భువనేశ్వరి మాట్లా డుతూ 2024 ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు, ఓటరుకు భువనేశ్వరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రతి రెండు, మూడు నెలలకు నేను కుప్పం వస్తానని కుప్పం ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. కుప్పం ప్రజలకు నేను చేయగలిగిన సాయం చేస్తానన్నారు . ఎన్నికల ప్రచారం సమయంలో నేను చెప్పిన విధంగా కుప్పం నియోజకవర్గానికి 3 పెద్ద పరిశ్రమలు తెచ్చి, ఇక్కడి యువతకు ఇక్కడే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చంద్రబాబును ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. గుడిపల్లి మండలంలోని గుత్తార్లపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కుప్పం ప్రజలు 8 పర్యాయాలుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్న సందర్భంగా ఆమె కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఆమె వద్దకు క్యూ కకట్టారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా వింటూ వినతులు నారా భువనేశ్వరి స్వీకరించారు. రెండవ రోజు పర్యటన లో భాగంగా తెదేపా శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెండవ రోజు ఎన్.కొత్తపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రసంగించారు.వైసీపీ పాలనలో కుప్పం ప్రజలు, రాష్ట్ర ప్రజలు అనేక అరాచకాలు ఎదుర్కొన్నారని, ఈ అరాచకాలను అంతం చేసేందుకు కూటమి ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలిపారు. కుప్పం నియోజకవర్గం రూరల్ మండలం పైపాళ్యం బూత్ అత్యధికముగా తెదేపా కు ఓట్లు రావడంతో ఆ గ్రామన్ని నారా భువనేశ్వరి దత్తత తీసుకోని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని అతిది అధ్యాపకులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. బుధవారం అధ్యాపకులు గత ప్రభుత్వం రెండేళ్ల నుంచి జీతాలు చెల్లించలేదని తమ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమెకు వినతిపత్రం ద్వారా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1072 మంది 472 కళాశాలల్లో పని చేస్తున్నారని, గత 10 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ కేవలం 10 వేలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారని వివరించారు. మూడవ రోజు కుప్పం టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో కీలక ఉపన్యాసం చేశారు. ఆమె మాట్లాడుతూ రాజకీయాలు, వ్యాపార రంగాల్లో టీమ్ వర్క్ అనేది చాలా ముఖ్యం అన్నారు. గెలుపు ఫలాలను ప్రజలకు అందించేందుకు నేడు సమన్వయ కమిటీ కంకణ బద్దులు కావాలన్నారు. కుప్పం న్యాయవాదుల సంఘ ప్రతినిధులు నారా భువనేశ్వరిని కలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతోషం వ్యక్తం చేశారు. నాలుగో రోజు శాంతిపురం మండల పరిధిలోని కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని నిర్మిస్తున్న ఇంటి పనులను సందర్శించారు. శాంతిపురం మండలం బొడుగుమాకులపల్లి మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో స్త్రీనిధి కింద మఠం గ్రామ పంచాయతీలోని 137 మంది మహిళలకు స్వయం ఉపాధికోసం రూ.1.10కోట్లు చెక్కును డ్వాక్రా మహిళలకు అందించారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి 250 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని తెలిపారు. ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు తమ ప్రాణాలను పార్టీకోసం పణంగా పెట్టారని గుర్తుచేశారు. పార్టీకోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు. కష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందన్నారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక మ్యానిఫెస్టోను చంద్రబాబు తప్పకుండా అమలు చేస్తారని భువనేశ్వరి స్పష్టం చేశారు.
పో రై గంగ 2 భువనేశ్వరి
మొదటి రోజు గుడుపల్లెలో పర్యటించారు. గిస్కెపల్లి, పెద్దూరు, చిన్నూరు, సోమాపురం, వెంకటాపురం గ్రామాల వద్ద మహిళలు, కార్యకర్తలు నారా భువనేశ్వరికి ఘనస్వాగతం పలికారు. గజమాలలు వేసి పూల వర్షాన్ని కురిపించారు. ఎన్నికల సమయంలో కుప్పం ప్రాంతంలో ఉత్తమ మెజార్టీ సాధించిన గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు రెండు గ్రామాలను ఆమె దత్తత తీసుకోనున్నారు. గుడుపల్లె మండలంలోని కంచిబందార్లపల్లె, కుప్పం మండలం పైపాళ్యం గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక వసతులు కల్పించనున్నారు.
భువనేశ్వరి పర్యటనతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. "కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ నాకు బిడ్డలతో సమానం. వారి అభివృద్ధికి ఎంతవరకైనా పోరాడతా. కుప్పం నియోజకవర్గంలో నేను దత్తత తీసుకున్న రెండు ఊర్లతో పాటుగా మిగతా అన్ని గ్రామాలనూ అభివృద్ధి చేసేలా పనిచేస్తా" అని నారా భువనేశ్వరి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నారా భువనేశ్వరి విస్తృతంగా ప్రచారం చేసి ఎన్నికల సమయంలో కీలక భూమిక పోషించారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును మరోసారి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు నారా భువనేశ్వరి కుప్పానికి వెళ్లారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా కుప్పంలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. మహిళలతో ముఖాముఖి సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను మెుత్తం ఖాళీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఖజానాలో పైసా లేకపోగా, లక్షల కోట్లు అప్పులు మిగిల్చారని దుయ్యబట్టారు.
క్లిష్ట పరిస్థితుల్లోనూ చంద్రబాబు రాష్ట్ర పాలనను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పింఛన్ల సాయాన్ని పెంచి ఒకటో తేదీన ఇంటి వద్దకు వచ్చి ఇస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు అనే ఆయుధంతో వైసీపీను తరిమికొట్టారని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కష్ట కాలంలో చంద్రబాబు వెన్నంటే నిలిచిన తెలుగుదేశం కార్యకర్తల రుణాన్ని తీర్చుకుంటామని భువనేశ్వరి పేర్కొన్నారు.
ఏపీలో జరిగిన అకృత్యాలకు, దౌర్జన్యాలను చూసి మహిళలు కసితో ఓటేసి టీడీపీని గెలిపించారన్నారు. అలాంటి మహిళల రుణం తీర్చుకోలేమన్న భువనేశ్వరి.. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక కుప్పంలోని నిరుద్యోగ యువత ఉపాధి కోసం బయట ప్రాంతాలకు వెళ్లకుండా.. కుప్పంలోనే పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.
కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తన బిడ్డలాంటి వారేనన్న నారా భువనేశ్వరి.. వారి ఎదుగుదల కోసం ఎంతవరకైనా పోరాడతానని అన్నారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో తాను దత్తత తీసుకున్న రెండు ఊర్లతో పాటుగా అన్ని గ్రామాలను అభివృద్ధిచేసేలా పనిచేస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనైనా కొట్లాడతానంటూ నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన నాలుగు రోజులు పాటు కొనసాగనుంది.
‘మేము ఏనాడూ అవినీతి సొమ్ముకు ఆశపడలేదు. అవినీతి సొమ్ము ఎంత సంపాదించినా పాపాలను మూటగట్టుకోవడం తప్ప అది చేతిలో నిలవదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మూడో రోజైన గురువారం ఆమె శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ.. తమ కుటుంబం కోసం హెరిటేజ్‌ను స్థాపించామని, ప్రజల సొమ్ము తమకు అవసరంలేదన్నారు. రాజకీయాలపైనే తమ కుటుంబం అధారపడాలన్న ఉద్దేశం చంద్రబాబుకు ఏ కోశానా లేదన్నారు. ప్రజాధనం దోచుకోవాలని ఆయన ఏనాడూ అనుకోలేదన్నారు. చంద్రబాబుపైన, హెరిటేజ్‌పైన అనేక కేసులు పెట్టి గత ప్రభుత్వం అవినీతి అంటించడానికి ఎంతగానో ప్రయత్నించిందని గుర్తుచేశారు. వారి ప్రయత్నాలు ఫలించలేదని, చంద్రబాబు నిజాయితీ ఎన్నికల సందర్భంగా ప్రజా క్షేత్రంలో నిరూపితమైందని భువనేశ్వరి తెలిపారు.
- 4రోజుల్లో వచ్చిన 977 వినతులు
కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4రోజుల పర్యటన బిజీబిజీగా గడిచింది. బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో వచ్చిన భువనేశ్వరికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకడంతో ప్రారంభమైన పర్యటన ఆద్యంతం ఓ పండుగ వాతావరణంలో సాగింది. మొదటి రోజు గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి, కంచిబందార్లపల్లి, గుత్తార్లపల్లి, కోటపల్లి గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. ప్రజల నుండి వారి సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను భువనేశ్వరి స్వీకరించారు. తొలిరోజు పర్యటనలో భువనేశ్వరికి 202 వినతులు వచ్చాయి. రెండవరోజు కుప్పం రూరల్ మండలం, ఎన్.కొత్తపల్లి, నడుమూరు, పైపాళ్యం, ఉర్ల ఓబనపల్లి, గుండ్లనాయనపల్లి గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. రెండవ రోజు పర్యటనలో 310 వినతులు వచ్చాయి. మూడవ రోజు శాంతిపురం మండలం, సోమాపురం, కర్లగట్ట, బొడుగుమాకులపల్లి అదేవిధంగా రామకుప్పం మండలం, ఆవులకుప్పం, నారాయణపురం తండా, ఆరిమానిపెంట, వీర్నమల గ్రామాల్లో పర్యటించారు. మూడవ రోజు పర్యటనలో 345 వినతిపత్రాలు వచ్చాయి. నాల్గవ రోజు కుప్పం టౌన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా టౌన్ ప్రజలు తమ సమస్యలపై భువనేశ్వరికి వినతిపత్రాలు అందించారు. భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో 4రోజుల పర్యటనలో వచ్చిన వినతులతో కలిపి రమారమి 977 వినతులు వచ్చాయి. వీటిని శాఖల వారీగా విభజించి, ప్రతి వినతిపత్రాన్ని సంబంధిత శాఖ అధికారులకు పంపించి సత్వర పరిష్కారానికి భువనేశ్వరి కోరనున్నారు. 877 వినతుల్లో అత్యధిక భాగం భూ సమస్యలు, జగన్ పాలనలో రద్దు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించినవే ఎక్కువగా ఉండడం గమనార్హం. భువనేశ్వరి పర్యటించిన ప్రతి గ్రామంలోనూ వైసీపీ పాలనలో చోటుచేసుకున్న భూ సమస్యలు, సంక్షేమ పథకాలు నిలిపేసిన వేధింపులు వినతుల రూపంలో భువనేశ్వరికి అందాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని భువనేశ్వరి అర్జీదారులకు భరోసా కల్పించారు.